AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతుందా.. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే ఎక్కువ రోజులు రావడం పక్కా..

అనుకున్న సమయం కంటే ముందే గ్యాస్ సిలిండర్ ఖాళీ అయిపోతే ఆ భారం నేరుగా జేబుపై పడుతుంది. మంటను పూర్తిగా సిమ్‌లో పెడితే గ్యాస్ ఆదా అవుతుందా? లేక హై ఫ్లేమ్‌లో వండితే త్వరగా పూర్తవుతుందా? వంటగదిలో మనం తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లే గ్యాస్ వృధాకు కారణమవుతున్నాయా? ప్రతినెలా సిలిండర్‌ను ఎక్కువ రోజులు తెప్పించే అద్భుతమైన చిట్కాలు ఇప్పుడు తెలుసుకుందాం..

గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతుందా.. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే ఎక్కువ రోజులు రావడం పక్కా..
Lpg Gas Saving Tips
Krishna S
|

Updated on: Jul 29, 2026 | 7:00 AM

Share

ప్రస్తుతం బడ్జెట్‌ను అదుపులో ఉంచుకోవడం ప్రతి కుటుంబానికి పెద్ద సవాలుగా మారింది. అందులోనూ నెలాఖరు రాకముందే ఎల్పీజీ సిలిండర్ ఖాళీ అయిపోతే.. ఆ ప్రభావం నేరుగా ఇంటి బడ్జెట్‌పై పడుతుంది. దీంతో గ్యాస్ ఆదా చేసేందుకు చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు మంటను పూర్తిగా సిమ్‌లో పెట్టి వంట చేస్తే గ్యాస్ మిగులుతుందనుకుంటారు. మరికొందరు హై ఫ్లేమ్‌లో పెట్టి త్వరగా ముగిస్తే ఆదా అవుతుందని భావిస్తారు. అయితే ఇందులో ఏది నిజం? అసలు నిపుణులు ఏం చెబుతున్నారు? గ్యాస్ మిగిల్చే అసలైన సూత్రాలు చాలా మందికి తెలియదు.

హై ఫ్లేమ్ vs సిమ్: ఏది సరైనది?

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మంట మరీ ఎక్కువగా ఉండటం లేదా మరీ తక్కువగా ఉండటం రెండూ సరైనవి కావు. వంటకు కావాల్సింది అవసరమైన వేడి మాత్రమే. వంట చేసేటప్పుడు మంట పాత్ర అడుగు భాగాన్ని దాటి అంచుల వరకు వ్యాపిస్తే, ఆ అదనపు వేడి గాలిలోకి వెళ్లిపోయి గ్యాస్ వృధా అవుతుంది. వంట ప్రారంభంలో నీటిని మరిగించడానికి లేదా నూనె వేడెక్కడానికి మధ్యస్థ లేదా కొద్దిగా ఎక్కువ మంట అవసరం. కానీ నీరు మరగడం మొదలయ్యాక మంటను తగ్గించాలి. నీరు ఒకసారి మరిగాక ఇంకా ఎక్కువ వేడి ఇవ్వడం వల్ల ఆహారం త్వరగా ఉడకదు, పైగా గ్యాస్ మాత్రమే ఎక్కువగా ఖర్చవుతుంది.

గ్యాస్ బిల్లును గణనీయంగా తగ్గించే 7 చిన్న అలవాట్లు..

వంటగదిలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లను దిద్దుకుంటే ప్రతినెలా సిలిండర్ ఎక్కువ రోజులు రావడం ఖాయం.

మూత పెట్టి వండడం: పాత్రపై మూత పెట్టి వంట చేసినప్పుడు లోపలి వేడి, ఆవిరి బయటకు పోవు. దీనివల్ల ఆహారం త్వరగా ఉడికి గ్యాస్ ఆదా అవుతుంది.

ముందుగా నానబెట్టడం: పప్పులు, శనగలు, బియ్యాన్ని వండే ముందు కనీసం అరగంట పాటు నీటిలో నానబెడితే అవి చాలా త్వరగా ఉడుకుతాయి.

ప్రెషర్ కుక్కర్ వాడకం: సాధారణ పాత్రల్లో ఉడకబెట్టడానికి బదులుగా మాంసం లేదా గట్టిగా ఉండే ఆహార పదార్థాలను ప్రెషర్ కుక్కర్‌లో వండితే సమయం, గ్యాస్ రెండూ ఆదా అవుతాయి.

కొలత ప్రకారమే నీరు: పాత్రలో అవసరానికి మించి నీరు పోస్తే దాన్ని మరిగించడానికి ఎక్కువ గ్యాస్ కావలసి వస్తుంది. కాబట్టి సరిపడా నీటినే వాడండి.

పాత్రకు తగ్గ బర్నర్: చిన్న పాత్రలకు చిన్న బర్నర్‌ను మాత్రమే వాడాలి. పాత్ర కంటే బర్నర్ పరిమాణం పెద్దదైతే వేడి పక్కకు పోయి వేస్ట్ అవుతుంది.

నీలి మంట గమనించండి: బర్నర్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. మంట నీలం రంగుకు బదులుగా పసుపు లేదా నారింజ రంగులో వస్తుంటే బర్నర్‌లో మురికి పేరుకుపోయి గ్యాస్ వృధా అవుతోందని అర్థం.

ముందస్తు ప్రిపరేషన్: కూరగాయలు కోయడం, కడగడం, మసాలాలు సిద్ధం చేసుకోవడం వంటి పనులన్నీ పూర్తయ్యాకే స్టవ్ వెలిగించాలి. గ్యాస్ వెలిగించిన తర్వాత సిద్ధం చేసుకోవడం వల్ల చాలా గ్యాస్ వృధా అవుతుంది.

ఈ చిన్న చిన్న నియమాలు, మెళకువలు పాటిస్తే వంట త్వరగా పూర్తవ్వడమే కాకుండా ప్రతినెలా మీ ఎల్పీజీ సిలిండర్ ఎక్కువ రోజులు వస్తుంది. ఫలితంగా మీ కుటుంబ బడ్జెట్‌పై భారం గణనీయంగా తగ్గుతుంది.

Follow Us
సెప్టెంబర్ 10 రాశిఫలాలు: వారికి ఉద్యోగ పదోన్నతి..
సెప్టెంబర్ 10 రాశిఫలాలు: వారికి ఉద్యోగ పదోన్నతి..
8, 7, 7.. సింగిల్ డిజిట్ దాటని బాబర్ ఆజం.. కెరీర్ క్లోజ్..?
8, 7, 7.. సింగిల్ డిజిట్ దాటని బాబర్ ఆజం.. కెరీర్ క్లోజ్..?
80s స్పెషల్.. ఈ ఫొటోల్లోని టాలీవుడ్ హీరో భార్యను గుర్తు పట్టారా?
80s స్పెషల్.. ఈ ఫొటోల్లోని టాలీవుడ్ హీరో భార్యను గుర్తు పట్టారా?
భారత్ వర్సెస్ ఆఫ్గానిస్తాన్ పోరుకు అంతా సిద్ధం.. ఫ్రీగా చూడలేమా.?
భారత్ వర్సెస్ ఆఫ్గానిస్తాన్ పోరుకు అంతా సిద్ధం.. ఫ్రీగా చూడలేమా.?
'కోర్టు' హీరోయిన్ కొత్త సినిమా 'హైకూ' టీజర్ చూశారా?
'కోర్టు' హీరోయిన్ కొత్త సినిమా 'హైకూ' టీజర్ చూశారా?
కుండీల మట్టిపై తెల్లటి పొర పేరుకుపోతోందా? ఈ చిన్న చిట్కాలతో చెక్
కుండీల మట్టిపై తెల్లటి పొర పేరుకుపోతోందా? ఈ చిన్న చిట్కాలతో చెక్
రూ.50 వేల ఖర్చు... రూ.2 లక్షల లాభం...ఈ పంటతో రైతు ధనవంతుడే!
రూ.50 వేల ఖర్చు... రూ.2 లక్షల లాభం...ఈ పంటతో రైతు ధనవంతుడే!
నందన అరెస్ట్‌తో వెలుగులోకి వస్తున్న సంచలనాలు!
నందన అరెస్ట్‌తో వెలుగులోకి వస్తున్న సంచలనాలు!
ఓటీటీలోకి వచ్చేస్తోన్నరవితేజ 'ఇరుముడి'! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్నరవితేజ 'ఇరుముడి'! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మఖానా ఇలా తిన్నారంటే.. శరీరానికి కొండంత బలం.. ఎముకల ఆరోగ్యానికి
మఖానా ఇలా తిన్నారంటే.. శరీరానికి కొండంత బలం.. ఎముకల ఆరోగ్యానికి