Vaibhav Sooryavanshi : క్రిస్ గేల్‌ను కూడా దాటేసిన వైభవ్ సూర్యవంశీ.. 40 టీ20ల తర్వాత రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే
Vaibhav Sooryavanshi vs Chris Gayle: భారత యంగ్ సెన్సేషన్ కేవలం 40 టీ 20 మ్యాచ్‌లకే క్రిస్ గేల్ రికార్డులను వెనక్కి నెట్టి సంచలనం సృష్టించాడు.. రన్స్, యావరేజ్, స్ట్రైక్ రేట్, సెంచరీల విభాగంలో వైభవ్ అద్భుతమైన ఆధిపత్యం ప్రదర్శించాడు.

Vaibhav Sooryavanshi vs Chris Gayle: భారత యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇటీవల ముగిసిన జింబాబ్వే పర్యటనలో తన అద్భుత బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. 3 మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచిన వైభవ్ 3 ఇన్నింగ్స్‌లలో కలిపి ఏకంగా 151 పరుగులు సాధించాడు. ఈ అద్భుతమైన ప్రదర్శనకు గాను ఆయనకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది. ఈ సిరీస్‌తో వైభవ్ తన కెరీర్‌లో 40 టి20 మ్యాచ్‌ల మార్కును చేరుకున్నాడు. ఈ తొలి 40 మ్యాచ్‌ల ప్రదర్శనను యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ గణాంకాలతో పోల్చి చూస్తే భారత కుర్రాడు చాలా ముందంజలో ఉన్నాడు.
40 టీ20ల తర్వాత: వైభవ్ vs క్రిస్ గేల్
తొలి 40 టీ20 ఇన్నింగ్స్‌ల తర్వాత క్రిస్ గేల్ సాధించిన గణాంకాలతో పోలిస్తే వైభవ్ సూర్యవంశీ అన్ని విభాగాల్లోనూ అగ్రస్థానంలో నిలిచాడు. తొలి 40 ఇన్నింగ్స్‌ల్లో గేల్ 1189 పరుగులు చేయగా, వైభవ్ ఏకంగా 1670 పరుగులు చేశాడు. అంటే గేల్ కంటే 481 పరుగులు ఎక్కువ సాధించాడు. సగటు విషయంలో గేల్ 33.97 నమోదు చేయగా, వైభవ్ 42.82తో సత్తా చాటాడు. ఇక స్ట్రైక్ రేట్ పరంగా గేల్ 137.29తో ఉంటే, వైభవ్ ఏకంగా 216.32 భారీ స్ట్రైక్ రేట్‌తో విధ్వంసం సృష్టించాడు. సెంచరీల విషయంలో గేల్ 1 సెంచరీ చేయగా వైభవ్ 4 సెంచరీలు చేశాడు. అలాగే హాఫ్ సెంచరీలలో కూడా గేల్ (7) కంటే వైభవ్ (8) ముందున్నాడు.
చిన్న వయసులోనే ఐపీఎల్, ఇంటర్నేషనల్ డెబ్యూ
కేవలం 14 ఏళ్ల చిన్న వయసులోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఆడే అవకాశం దక్కించుకున్న వైభవ్ సూర్యవంశీ, లీగ్‌లో పవర్‌ఫుల్ ప్రదర్శనతో టీమిండియాలోకి అడుగుపెట్టాడు. 15 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు తన అంతర్జాతీయ కెరీర్‌లో 6 టీ20 మ్యాచ్‌లు ఆడిన వైభవ్, 32.16 సగటు, 189.21 స్ట్రైక్ రేట్‌తో 193 పరుగులు చేశాడు. ఇందులో 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఐపీఎల్‌లో పరుగుల వరద
అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు డొమెస్టిక్ క్రికెట్‌లోనూ వైభవ్ మెరుపులు మెరిపిస్తున్నాడు. ఇప్పటివరకు 8 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 13 లిస్ట్-ఎ మ్యాచ్‌లు ఆడిన వైభవ్, రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్‌లో గత రెండేళ్లుగా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటివరకు 23 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ఈ యువ క్రికెటర్ 2026 ఐపీఎల్ సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచి ఆరెంజ్ క్యాప్ సాధించడం విశేషం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
