AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: అరేయ్ పోతార్రా.. పైకేమో బ్రాండెడ్.. లోపలేమో వెరీ చీప్.. కొన్నారంటే ఇక అంతే..

పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా హైదరాబాద్‌లో నకిలీ సరుకుల దందా ఆగడం లేదు. నూనె, అల్లం వెల్లుల్లి పేస్టులే కాదు.. సబ్బులు, సర్ఫ్​లు, గుడ్​ నైట్‌​లు, ఆల్ అవుట్లు ఇలా ప్రతి వస్తువును కల్తీ చేసి మార్కెట్‌లోకి వదులుతున్నారు కేటుగాళ్లు. లేటెస్ట్‌గా బేగంబజారులో పలు గోడౌన్లు, షాపులపై దాడులు చేసిన సీసీఎస్​ అధికారులు నకిలీ కిరాణా సరుకుల దందా గుట్టురట్టు చేశారు.

Hyderabad: అరేయ్ పోతార్రా.. పైకేమో బ్రాండెడ్.. లోపలేమో వెరీ చీప్.. కొన్నారంటే ఇక అంతే..
Hyderabad Fake Products Bust
Shaik Madar Saheb
|

Updated on: Mar 04, 2026 | 10:46 AM

Share

పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా హైదరాబాద్‌లో నకిలీ సరుకుల దందా ఆగడం లేదు. నూనె, అల్లం వెల్లుల్లి పేస్టులే కాదు.. సబ్బులు, సర్ఫ్​లు, గుడ్​ నైట్‌​లు, ఆల్ అవుట్లు ఇలా ప్రతి వస్తువును కల్తీ చేసి మార్కెట్‌లోకి వదులుతున్నారు కేటుగాళ్లు. లేటెస్ట్‌గా బేగంబజారులో పలు గోడౌన్లు, షాపులపై దాడులు చేసిన సీసీఎస్​ అధికారులు నకిలీ కిరాణా సరుకుల దందా గుట్టురట్టు చేశారు. సీసీఎస్ స్పెషల్​ టీం దాడుల్లో హోల్‌సేల్‌గా విక్రయిస్తున్న నకిలీ టైడ్​, ఏరియల్​, సర్ఫ్​ ఎక్సెల్‌ ప్యాకెట్లతో పాటు.. జెమినీ, రెడ్‌లేబుల్, తాజ్‌మహల్‌ టీపొడి ప్యాకెట్లను గుర్తించారు. 1340 రెడ్ లేబుల్ నకిలీ ప్యాకెట్లు, 100 తాజ్ మహల్ టీ నకిలీ ప్యాకెట్లు, 75 కిలోల లూజ్ టీ పౌడర్, 1900 సర్ఫ్ ప్యాకెట్లు, 3600 నకిలీ గుడ్ నైట్ లిక్విడ్ బాటిల్స్ సీజ్ చేశారు. 9500 నకిలీ లేబుల్ కవర్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ దందా నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.

వీరంతా గుజరాత్ డీలర్ల నుంచి తక్కువ నాణ్యతగల మెటీరియల్​ కొనుగోలు చేసి నకిలీ ప్యాకింగ్​ కవర్లతో బ్రాండెడ్‌గా నమ్మించి గోషామహల్, అఫ్జల్‌గంజ్, బేగంబజార్, ఇతర ప్రాంతాల్లోని వ్యాపారులకు విక్రయిస్తూ ప్రజలను మోసగిస్తున్నారు. నకిలీ వస్తువుల తయారీ, విక్రయంపై వస్తున్న ఫిర్యాదులతో రంగంలోకి దిగిన సీసీఎస్ స్పెషల్​ టీం బేగం బజారులోని పలు షాపులు, గోదాంలపై దాడులు చేసింది.

వీడియో చూడండి..

నకిలీ వస్తువులు తయారు చేసి విక్రయిస్తున్న రాజస్థాన్‌కు చెందిన జయ రామ్, కచ్చవా సురేందర్, హనుమాన్ రామ్‌ను అరెస్ట్ చేశారు. నిందితులను గోషామహల్​, అఫ్జల్​ గంజ్​ పోలీసులకు అప్పగించారు. కల్తీ దందా పెరిగిపోతున్న నేపథ్యంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. సరుకులు కొనుగోలు సమయంలో క్యూఆర్ కోడ్ తప్పనిసరిగా తనిఖీ చేయాలని చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర