ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్న ఓ కార్యక్రమంలో సరదా సంఘటన జరిగింది. గోరఖ్నాథ్ ఆలయంలో కిచడీ మేళాలో పాల్గొన్న యోగి.. అనంతరం ప్రజలతో కాసేపు ముచ్చటించారు. ఓ బుడతడిని దగ్గరకు పిలిచి ఏం కావాలని అడిగాడు. సీఎం యోగి చెవి దగ్గరకు వెళ్లి.. చిప్స్ కావాలని ఆ పిల్లవాడు అడగడంతో యోగి నవ్వు ఆపుకోలేకపోయాడు.