సపోటా పండు ఆరోగ్యానికి చాలా మంచిది. అంతే కాకుండా దీని రుచి కూడా చాలా బాగుండటంతో చాలా మంది ఇష్టంగా తింటుంటారు.
సపోటా పండ్లలో విటమిన్స్, మినరల్స్, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. అందువలన వీటిని తినడం వలన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటారు నిపుణులు.
సపోటా పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అందువలన దీనిని తినడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతుంది.
చర్మ ఆరోగ్యానికి సపోటా చాలా మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ ఎ పుష్కలంగా ఉండటం వలన ఇది కంటి చూపు, చర్మ సంరక్షణకు చాలా మంచిది
ప్రతి రోజూ సపోటా తినడం వలన ఇందులో ఉండే పొటాషియం, ఐరన్, కాల్షియం వంటి ఖనిజాలు ఉండటం వలన ఇవి ఎముకలను బలంగా, దృఢంగా తయారు చేస్తాయి.
అన్ని పండ్లలో కంటే సపోటా పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందువలన ఇది తినడం వలన జీర్ణ సమస్యలు త్వరగా తీరిపోతాయంట.
బరువు తగ్గాలి అనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ సపోటా పండు. ప్రతి రోజూ ఉదయం వీటిని తీసుకోవడం వలన ఇందులో ఉండే కేలరీలు ఆహారం తక్కువ తీసుకునేలా చేసి బరువును నియంత్రణలో ఉంచుతుంది.
ప్రతి రోజూ ఒక సపోటా పండు తినడం వలన ఇది జీర్ణక్రియను మెరుగు పరిచి, మలబద్ధకం, కడుపు ఉబ్బరం సమస్యల నుంచి కాపాడుతుంది.