06 December 2025

ఆరోగ్యానికి వరం తిప్ప తీగ రసం.. రోజూ తాగితే ఎంత మంచిదో..

samatha

Pic credit - Instagram

చలికాలంలో రోగనిరోధక శక్తి అనేది తగ్గిపోతుంది. అయితే ఇటువంటి సమయంలో తిప్ప తీగ జ్యూస్ తాగడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

తిప్ప తీగలో రోగనిరోధక లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందువలన దీని జ్యూస్ తాగడం వలన చలికాలంలో దగ్గు, గొంతు నొప్పి సమస్యల నుంచి త్వరగా బయటపడవచ్చును.

తిప్ప తీగ జ్యూస్‌లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందువలన వీటిని తాగడం వలన ఇది వైరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతుంది.

కీళ్లు కండరాల ఆరోగ్యానికి ఇది చాలా మంచిది. ఆర్థరైటిస్ ఉన్న వారు ప్రతి రోజూ తిప్ప తీగ జ్యూస్ తాగడం వలన ఇది కండరాలు, కీళ్ల నొప్పుల నుంచి రక్షిస్తుంది.

తిప్ప తీగ జ్యూస్‌లో ఆడాప్టోజెనిక్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందువలన దీనిని ప్రతి రోజూ తాగడం వలన మానసిక, అలసట, ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది

తిప్ప తీగ జ్యూస్ జీర్ణ సమస్యలు ఉన్నవారు తాగడం వలన ఇది కాలేయం, కడుపు నొప్పి, గ్యాస్, ఎసిడిటి వంటి సమస్యల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది.

చర్మ సౌందర్యానికి కూడా తిప్పతీగ చాలా మంచిది. దీనిని చలికాలంలో తాగడం వలన ఇది చర్మానికి సహజమెరుపు ఇవ్వడమే కాకుండా, చర్మం పొడిబారకుండా చూస్తుంది.

డయాబెటీస్‌తో బాధపడే వారు ప్రతి రోజూ ఉదయం పరగడపున దీనిని తీసుకోవడం వలన ఇది రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గేలా చేస్తుంది. గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.