PM Modi: భారత సాంప్రదాయ వైద్యానికి ప్రపంచస్థాయి గుర్తింపు.. WHO చీఫ్ టెడ్రోస్‌తో కలిసి మోదీ టూర్..
PM Modi in Gujarat: ప్రధాని మోదీ(PM Modi) సొంతరాష్ట్రం గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ.. WHO చీఫ్ టెడ్రోస్ గెబ్రేయేస్‌తో కలిసి మోదీ గుజరాత్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు . ప్రధాని మోడీతో కలిసి జామ్‌నగర్‌లో..
ప్రధాని మోదీ(PM Modi) సొంతరాష్ట్రం గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ.. WHO చీఫ్ టెడ్రోస్ గెబ్రేయేస్‌తో కలిసి మోదీ గుజరాత్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు . ప్రధాని మోడీతో కలిసి జామ్‌నగర్‌లో డబ్ల్యూహెచ్‌వో గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్‌కు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు టెడ్రోస్. భారత్‌లో కరోనా మరణాలపై WHO, కేంద్రం మధ్య వివాదాలు నడుస్తున్న సమయంలో టెడ్రోస్ భారత పర్యటన అందరి దృష్టిని ఆకర్షించింది. కరోనా సమయంలో సాంప్రదాయ వైద్యం చేసిన మేలును ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించింది. సాంప్రదాయ వైద్య విధానాన్ని ప్రపంచానికి పంచడానికి భారత్ – WHO కలిసి పనిచేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సాంప్రదాయ వైద్యం కోసం జీసీటీఎం మొదటి, ఏకైక గ్లోబల్ అవుట్‌పోస్ట్ కేంద్రం రూపుదిద్దుకుంటోంది.
ఇవాళ గాంధీనగర్‌లో మహాత్మామందిర్‌లో గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్‌మెంట్, ఇన్నోవేషన్ సదస్సులో ప్రధాని మోడీ(తో కలిసి టెడ్రోస్ పాల్గొంటారు. జామ్‌నగర్‌లో ప్రధాని సమక్షంలో గుజరాతీలో టెడ్రోస్ ప్రసంగించడంతో సభలో నవ్వులు వెల్లివిరిశాయి. గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషినల్ మెడిసిన్‌ను గుజరాత్‌లో ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు మోదీ. భారత్‌తో ప్రపంచ ఆరోగ్యసంస్థ కలిసి పనిచేయడాన్ని ఆయన స్వాగతించారు.
ప్రధాని మోదీ తన గుజరాత్ పర్యటనలో బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. గుజరాత్ పర్యటన కంటే ముందు ఢిల్లీలో పర్యటించారు టెడ్రోస్. సాంప్రదాయ వైద్యంలో భారత ప్రపంచానికి మార్గదర్శిగా ఉందని ప్రశంసించారు. ఢిల్లీలో ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆయుర్వేదను సందర్శించారు టెడ్రోస్.
PM Modi met WHO DG Dr Tedros Adhanom Ghebreyesus, after inaugurating WHO-Global Centre for Traditional Medicine in Jamnagar, Gujarat
Discussed how Global Centre would bring people &resources together to advance acceptance &use of Traditional Medicine systems around the world:MEA pic.twitter.com/ydZZ2XnfNM
— ANI (@ANI) April 19, 2022
ఆయుర్వేద వైద్యంపై ప్రశంసలు కురిపించారు టెడ్రోస్. కరోనా తీవ్రతను తగ్గించడంలో ఆయుర్వేదం కూడా కీలక పాత్ర పోషించిందన్నారు. ప్రపంచానికి సాంప్రదాయ వైద్య విధానాలను పరిచయం చేయడానికి గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ బాగా పనిచేస్తుందన్నారు.
ఇవి కూడా చదవండి: Governor Tamilisai: సీఎం చెప్పారని ఫైల్‌పై సంతకంచేయడానికి.. నేను రబ్బర్ స్టాంప్ గవర్నర్‌ని కాదు..
Minister Harish Rao: రోగి సహాయకులకు రూ.5 భోజనం.. కీలక ప్రకటన చేసిన మంత్రి హరీష్ రావు..