AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం.. అమ్మాయి చేతికి స్టీరింగ్ ఇచ్చి పక్కనే కుర్చున్న బస్సు డ్రైవర్.. చివరకు..

బస్సు డ్రైవర్ చేతిలో వంద మంది ప్రయాణికుల ప్రాణాలు ఉంటాయి. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినా.. చిన్నపొరపాటు జరిగిన ప్రయాణికుల

Viral Video: ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం.. అమ్మాయి చేతికి స్టీరింగ్ ఇచ్చి పక్కనే కుర్చున్న బస్సు డ్రైవర్.. చివరకు..
Viral
Rajitha Chanti
|

Updated on: Apr 19, 2022 | 9:39 PM

Share

బస్సు డ్రైవర్ చేతిలో వంద మంది ప్రయాణికుల ప్రాణాలు ఉంటాయి. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినా.. చిన్నపొరపాటు జరిగిన ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అందుకే బస్సు డ్రైవర్ ఎంతో సమయస్పూర్తితో డ్రైవ్ చేస్తుంటారు. కానీ.. ఇక్కడ ఓ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యపు ప్రవర్తన ప్రయాణికుల ప్రాణాల మీదకు తెచ్చింది. అతని అజాగ్రత్తతో ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదు.. కానీ ఇంత అజాగ్రత్తగా ఉన్న డ్రైవర్ లైసెన్స్ పోగొట్టుకున్నాడు. ఇంతకీ ఆ డ్రైవర్ ఏం చేశాడని అనుకుంటున్నారా ? బస్సు నిండుగా ప్రయాణికులు ఉన్నారని తెలిసిన ఆ డ్రైవర్ బస్సు స్టీరింగ్‏ను ఓ అమ్మాయి చేతికి ఇచ్చాడు. అంతేకాదు.. ఆ అమ్మాయి పక్కనే కూర్చుని బస్సు డ్రైవ్ చేయడం నేర్పిస్తున్నాడు.

జమ్మూ కాశ్మీర్‏లోని ఉధంపూర్‏-లాంర్ మార్గంలో వెళ్తున్న ఓ బస్సు స్టీరింగ్‏ను అమ్మాయికి ఇచ్చాడు డ్రైవర్.. ఆ బాలిక పంచైరిలోని ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో 11వ తరగతి చదువుతుంది. స్టీరింగ్ ఇవ్వడమే కాకుండా.. ఆ అమ్మాయి పక్కన కూర్చుని బస్సు ఎలా నడపాలో నేర్పిస్తున్నాడు. పైగా అది కొండ మార్గం. ఏమాత్రం బస్సు అదుపుతప్పినా.. లోయలోకి పడిపోయేది.. అయినా ఎలాంటి జాగ్రత్తలు లేకుండా.. అజాగ్రత్తగా అమ్మాయి చేతికి స్టీరింగ్ ఇచ్చాడు. ఈ ఘటన మొత్తాన్ని బస్సులోనే ఉన్నా మరో విద్యార్థి ఫోన్ లో రికార్డ్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియా తెగ వైరల్ అవుతూ.. జమ్మూ కాశ్మీర్ ట్రాన్స్ పోర్ట్ అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఘటనపై వెంటనే స్పంధించి.. ఆ అమ్మాయి నడిపిన బస్సును సీజ్ చేసినట్లు తెలిపారు.. అంతేకాకుండా.. సదరు డ్రైవర్ లైసెన్స్, వాహన పర్మిట్ లను సస్పెండ్ చేసింది. ప్రస్తుతం బస్సు డ్రైవర్ ను విచారిస్తున్నారు అధికారులు.

Also Read: RRR Collections: జోరు తగ్గని ఆర్ఆర్ఆర్.. కేజీఎఫ్ 2 పోటీని సైతం తట్టుకుని..

Siddu Jonnalagadda: బంపర్ ఆఫర్ అందుకున్న యంగ్ హీరో ?.. బడా ప్రొడ్యూసర్‏తో సిద్ధు జొన్నలగడ్డ..

Ram Charan: బీఎస్ఎఫ్ జవాన్లను కలిసిన రామ్ చరణ్.. ఆర్‏సీ 15 షూటింగ్ మధ్యలో ఇలా..

Kajal Aggarwal: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కాజల్ .. సోషల్ మీడియాలో వైరలవుతున్న న్యూస్..

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా