AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sri Lanka Crisis: పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మృతి.. లంకలో కొనసాగుతున్న ఆందోళనలు..

Sri Lanka Economic Crisis: రాంబుక్కనలో రహదారిని దిగ్బంధించిన వారిపై పోలీసులు కాల్పులు జరిపారు. తొలిసారి ఆందోళనకారులపై కాల్పులు జరిన ఘటనలో ఒకరు..

Sri Lanka Crisis: పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మృతి.. లంకలో కొనసాగుతున్న ఆందోళనలు..
Sri Lanka Police Shoot Prot
Sanjay Kasula
|

Updated on: Apr 19, 2022 | 9:21 PM

Share

శ్రీలంక సంక్షోభం(Sri Lanka Crisis) మంటలు చల్లారడం లేదు. వారం రోజులుగా ఆందోళనలకు దిగుతున్న లంకేయులు.. రాజపక్స గద్దె దిగాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నారు. అదే సమస్యకు పరిష్కారమంటున్నారు. అయితే  ఆర్థిక, ఆహార సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు ఇవాళ హింసాయుతం మారింది. రాంబుక్కనలో రహదారిని దిగ్బంధించిన వారిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు.. పలువురికి గాయాలయ్యాయి.. 40 మందికి పూగా తీవ్ర గాయాలయ్యాయి. రైల్వే క్రాసింగ్‌ దగ్గర ఆందోళన చేస్తున్న వారిని వెనక్కి వెళ్లిపోవాలని పోలీసులు హెచ్చరించారు. ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోవడంతో తొలుత లాఠీఛార్జ్‌ చేశారు. తరువాత భాష్పవాయువు ప్రయోగించారు. అయినప్పటికి పరిస్థితి అదుపు లోకి రాకపోవడంతో కాల్పులు జరిపారు. ఆయిల్ డిపోకు , వాహనాలకు నిప్పు పెట్టడానికి ఆందోళనకారులు ప్రయత్నించడంతో కాల్పులు జరిపామని పోలీసులు చెబుతున్నారు.

రాజధాని కొలంబో నగరానికి 95 కిలోమీటర్ల దూరంలోని రాంబుక్కనలో ఈ ఘటన జరిగింది. ఇంధన కొరత, అధిక ధరల కారణంగా లంక వాసులు ఈ రోజు నిరసన ప్రారంభించారు. కొలంబోకు 95 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీలంకలోని రంబుక్కనలో నిరసనకారులు హైవేను అడ్డుకున్నారు. సుమారు 10,000 మంది ఆందోళనకు గురైన బైక్ రైడర్లు హైవేను దిగ్బంధించారు. అక్కడ టైర్లు కూడా తగులబెట్టారు. ఇంధన కొరత, అధిక ధరలను నిరసిస్తూ అనేక మంది రహదారిని దిగ్బంధించారు. వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించిన పోలీసులపై కొందరు రాళ్ల దాడి చేశారు. పోలీసులు కాల్పులు జరపగా.. ప్రాణనష్టం సంభవించింది.

శ్రీలంక ఆర్థిక స్థితి..

శ్రీలంక ఆర్థిక స్థితి. దేశం మొత్తం అప్పుల్లో కూరుకుపోయింది. ఇంధన చమురు కొరత కారణంగా ఇటీవలి కాలంలో శ్రీలంకలో అనేక ప్రదేశాలలో విద్యుత్ కొరత కూడా గమనించబడింది. ఆర్థిక వ్యవస్థ యొక్క ఈ స్థితిలో, ఆహారం, ఇంధనం మరియు విద్యుత్ కొరతకు వ్యతిరేకంగా శ్రీలంక వాసులు వీధుల్లోకి వచ్చారు. అంతకుముందు భారత్ శ్రీలంకకు క్రెడిట్ లైన్ ద్వారా ఇంధన చమురును పంపింది. పరిస్థితిని తాత్కాలికంగా నిర్వహించగలిగినప్పటికీ, ఇంధనం కూడా అయిపోతుంది.

శ్రీలంకలో తాజాగా పెట్రోలు ధరను మరో 84 రూపాయలు పెంచారు.. మొత్తం ధర 338 రూపాయలకు చేరింది.. గత ఆరు నెలల లంక ఇండియన్‌ ఆయిల్‌ కంపెనీ ఇంధన ధరలను ఐదుసార్లు పెంచేసింది. ఇప్పటికే ఇంధన కొరతతో ఇబ్బందులు పడుతున్న లంక ప్రజలకు పెరిగిన పెట్రోల్‌ ధరలు మరింత గుదిబండగా మారాయి. దీంతో ఆందోళనలు మరోసారి మిన్నంటాయి.. ప్రజల ఆందోళనలను శాంతింపజేసేందుకు ఆధ్యక్షుడు గొటబయ రాజపక్స తాజాగా కేబినెట్‌ను ప్రక్షాళన చేసినా ఫలితం కనిపించలేదు. ఆర్థిక సంక్షోభానికి తమ ప్రభుత్వం చేసిన తప్పులు కారణమని రాజపక్స ఇప్పటికే అంగీకరించారు.

ఈ మోటార్ బైక్ రైడర్లు కొలంబోలో 11 రోజుల సుదీర్ఘ నిరసనలో పాల్గొంటున్నారు. శ్రీలంక ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తున్నదని పేర్కొంటూ శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశంలోని ప్రధాన పిల్లల ఆసుపత్రి వైద్యులు కూడా నిరసనలో పాల్గొన్నారు. మందులు, వైద్య పరికరాల కొరతను నిరసిస్తూ వారు కూడా వీధుల్లోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రాజపక్సే ఫ్యామిలీకి వ్యతిరేకండా రకరకాల పద్ధతుల్లో నిరసనలు తెలుపుతున్నారు ప్రజలు. సంతకాల సేకరణ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మద్దతు పలుకుతున్న ప్రతి ఒక్కరూ రాజపక్స పదవి నుంచి దిగిపోవాలని రాస్తున్నారు.

ఇవి కూడా చదవండి: PK Meets Sonia: సోనియా చేతికి మందుల చిట్టా.. కాంగ్రెస్‌కు ట్రీట్మెంట్ మొదలు పెట్టిన పీకే..

CM KCR: 5వ సారి కొత్త సెక్రటేరియట్‌కి సీఎం కేసీఆర్.. 80 శాతం పనులు పూర్తి..

చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ