IPL 2022, LSG vs RCB: తీరు మారని కోహ్లీ.. మరోసారి జీరోనే..
తొలుత టాస్ గెలిచిన లక్నో జట్టు ఆర్‌సీబీని బ్యాటింగ్‌కు పంపింది. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తీసుకున్న ఈ నిర్ణయం కరెక్టే అని నిరూపణ అయింది. మొదటి ఓవర్‌లోనే, లక్నోకు అనుజ్, విరాట్ రూపంలో రెండు వికెట్లు లభించాయి.
ఇది ఐపీఎల్ 2022(IPL 2022) 31వ మ్యాచ్‌లో మొదటి ఓవర్. టాస్ ఓడిపోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్ అప్పుడే మొదలైంది. DY పాటిల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఒకే గురువు దగ్గర శిష్యులుగా చేరిన ఇద్దరు కేవలం 2 బంతుల్లోనే పెవిలియన్ చేరారు. వీరిద్దరూ రూ. 2 కోట్ల బౌలర్ చేతిలో బలయ్యారు. ఒకరు ఔట్ అయిన తర్వాత డగౌట్‌లో కూడా స్థిరపడి ఉండకపోవచ్చు.. ఆ వెంటనే మరొకరు కూడా తిరిగి పెవిలియన్ చేరాడు. RCB బ్యాట్స్‌మెన్స్ – ఓపెనర్ అనుజ్ రావత్(Anuj Rawat), విరాట్ కోహ్లీ(Virat Kohli) ఈ మ్యాచ్‌లో ఆకట్టుకోలేకపోయారు.
తొలుత టాస్ గెలిచిన లక్నో జట్టు ఆర్‌సీబీని బ్యాటింగ్‌కు పంపింది. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తీసుకున్న ఈ నిర్ణయం కరెక్టే అని నిరూపణ అయింది. మొదటి ఓవర్‌లోనే, లక్నోకు అనుజ్, విరాట్ రూపంలో రెండు వికెట్లు లభించాయి. దీని కారణంగా RCB జట్టు మ్యాచ్‌లో వెనుకడుగు వేసింది.
రాజ్‌కుమార్ శర్మ విరాట్ కోహ్లీ, అనుజ్ రావత్‌లకు కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. విరాట్ కోహ్లి చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ కూడా అనుజ్ రావత్ కోచ్‌గా ఉన్నారు. రెండూ వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీ నుంచి బయటకు వచ్చారు. వీరిద్దరూ మొదటి ఓవర్‌లోనే రెండు బంతుల్లో డగౌట్‌కు తిరిగి రావడంతో మ్యాచ్‌లో బెంగళూరు కష్టాలు మరింత పెరిగాయి.
Also Read: LSG vs RCB Live Score, IPL 2022: గాడిలో పడ్డ బెంగళూరు.. క్రమంగా పెరుగుతోన్న జట్టు స్కోర్..
ఐపీఎల్‌లో అరంగేట్రం.. 4 బంతుల్లో మ్యాచ్‌నే మలుపు తిప్పాడు.. ఈ 75 లక్షల ప్లేయర్ ఎవరో తెలుసా?