AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KGF Chapter 2: మనసులోని మాట బయటపెట్టిన రాకీభాయ్.. ఆ హీరోయిన్‏తో నటించాలని ఉందంటూ..

కన్నడ స్టార్ హీరో యశ్ (Yash), డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన లేటేస్ట్ చిత్రం కేజీఎఫ్ 2  (KGF 2). ఏప్రిల్ 14న విడుదలైన ఈ మూవీ

KGF Chapter 2: మనసులోని మాట బయటపెట్టిన రాకీభాయ్.. ఆ హీరోయిన్‏తో నటించాలని ఉందంటూ..
Yash
Rajitha Chanti
|

Updated on: Apr 20, 2022 | 3:06 PM

Share

కన్నడ స్టార్ హీరో యశ్ (Yash), డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన లేటేస్ట్ చిత్రం కేజీఎఫ్ 2  (KGF 2). ఏప్రిల్ 14న విడుదలైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా రికార్డ్స్ తిరగరాస్తోంది. గతంలో సంచలనం సృష్టించిన కేజీఎఫ్ చిత్రానికి సిక్వెల్‏గా వచ్చిన ఈ మూవీ సెన్సెషన్ క్రియేట్ చేస్తోంది. విడుదలైన ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 600 కోట్లకు పైగా వసూళ్లు సాధించి హ్యాట్రిక్ హిట్ అందుకుంది.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ స్క్రీన్ ప్లే, రాకింగ్ స్టార్ యశ్ నటనకు దేశమంతా ఫిదా అవుతోంది. కేవలం సౌత్ ఆడియన్స్ మాత్రమే నార్త్‏లోనూ యశ్ కు ఫుల్ క్రేజ్ ఏర్పడింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న యశ్ పలు ఆసక్తిరక విషయాలను పంచుకున్నాడు..

బాలీవుడ్ ఇండస్ట్రీలోని ఏ హీరోయిన్‏తో నటించాలనుకుంటున్నారు అంటూ రిపోర్టర్ అడగ్గా.. దీపికా పదుకొణే అంటూ ఠక్కున ఆన్సర్ ఇచ్చారు యశ్. ప్రస్తుతం దీపికా బీటౌన్‏లో టాప్ హీరోయిన్‏గా కొనసాగుతుంది. ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది దీపికా.. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ మాత్రమే కాకుండా… ప్రస్తుతం దీపికా.. హృతిక్ రోషన్ సరసన ఫైటర్ సినిమాలో.. షారూఖ్ ఖాన్ తో పఠాన్ మూవీలో.. అమితాబ్ బచ్చన్ నటించిన ది ఇంటర్న్ హిందీ రీమేక్ లో నటిస్తోంది.

Also Read: Viral Video: బంగ్లాదేశ్‌ పాటతో మళ్లీ మెరిసిన ఓవర్‌నైట్‌ సెలబ్రిటీ.. ఆ దేశం స్టార్ హీరోతో గొంతు కలిపిన రాను

KGF Chapter 2: బాక్సాఫీస్ దగ్గర రాకీభాయ్ హవా.. కొనసాగుతున్న వసూళ్ల వేట..

Kajal Aggarwal : అందాల చందమామ ముద్దుల కొడుకు పేరు ఏంటో తెలుసా..

Netflix: నెట్‌ఫ్లిక్స్‌ సంచలన నిర్ణయం.. యూజర్లకు షాక్ ఇచ్చిన ఓటీటీ ప్లాట్ ఫామ్..