AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KGF Chapter 2: బాక్సాఫీస్ దగ్గర రాకీభాయ్ హవా.. కొనసాగుతున్న వసూళ్ల వేట..

కేజీఎఫ్(K.G.F )2 ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ సినిమాకు కొనసాగింపుగా ఈ సినిమా తెరకెక్కింది.

KGF Chapter 2: బాక్సాఫీస్ దగ్గర రాకీభాయ్ హవా.. కొనసాగుతున్న వసూళ్ల వేట..
Kgf 2
Rajeev Rayala
|

Updated on: Apr 20, 2022 | 1:21 PM

Share

కేజీఎఫ్ చాప్టర్ 2 (KGF Chapter 2) ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ సినిమాకు కొనసాగింపుగా ఈ సినిమా తెరకెక్కింది. మొదటి పార్ట్ తో సంచలన విజయాన్ని అందుకున్న యష్.. ఈ సినిమాతో మరోసారి భారీ హిట్ ను సొంతం చేసుకున్నాడు. మొదటి షో నుంచి బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా. కేజీఎఫ్ సినిమా సరికొత్త రికార్డులను సృష్టించింది. ఇప్పుడు ఆ రికార్డ్స్ ను కేజీఎఫ్ 2 బ్రేక్ చేస్తుంది. మొదటి రోజే సెకండ్ షో కూడా పడక ముందే  రూ.100 కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది కేజీఎఫ్ 2. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద జోరుగా కొనసాగుతోంది. ఇక ఇప్పటి వరకు ( ఆరు రోజులు) ఏకంగా రూ . 600 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇదే ట్రెండ్ కొనసాగితే  కేజీఎఫ్ చాప్టర్ 2 త్వరలో రూ.1000 కోట్ల క్లబ్‌లోకి చేరుకుంటుందని ట్రేడ్ వర్గాల అంచనా.

కేజీఎఫ్ చాప్టర్ 2 ఏప్రిల్ 14న థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రం దేశవ్యాప్తంగా చాప్టర్ 2 ఐదు భాషల్లో విడుదలైంది. హిందీలో మంగళవారం (ఏప్రిల్ 19) ఒక్క రోజే రూ.20 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా ఇప్పటివరకు కేజీఎఫ్ బాలీవుడ్ లో 238 కోట్లు వసూల్ చేసింది. చాప్టర్ 2 ఏప్రిల్ 18న ఆంధ్రప్రదేశ్ , తెలంగాణల్లో రూ.5.09 కోట్ల భారీ షేర్ వసూలు చేసింది. చాప్టర్ 2 USAలో ఐదు రోజుల వ్యవధిలో 5 మిలియన్ మార్క్ (సుమారు రూ. 39 కోట్లు) చేరిన మొదటి కన్నడ చిత్రంగా నిలిచింది. చాప్టర్ 2 ను హోంబలే ఫిలిమ్స్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో సంజయ్ దత్, రవీనా టాండన్ కీలక పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Netflix: నెట్‌ఫ్లిక్స్‌ సంచలన నిర్ణయం.. యూజర్లకు షాక్ ఇచ్చిన ఓటీటీ ప్లాట్ ఫామ్.

Ante Sundaraniki Teaser : సుందరానికి చెప్పుకోలేని కష్టాలు.. అంటే…! ఆకట్టుకుంటున్న టీజర్

Allu Arjun: ఆ కమర్షియల్‌ యాడ్‌లో నటించేందుకు నో చెప్పిన బన్నీ.. ప్రశంసలు కురిపిస్తున్న ఫ్యాన్స్‌..

మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!
తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!
Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి
Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి
ఐశ్వర్య రాజేష్ క్యూట్ ఫోటోలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
ఐశ్వర్య రాజేష్ క్యూట్ ఫోటోలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
కొత్త అజెండాతో పెట్టుబడులకు సీఎం రేవంత్ స్కెచ్..!
కొత్త అజెండాతో పెట్టుబడులకు సీఎం రేవంత్ స్కెచ్..!
తానాజీ పార్ట్‌ 2 హింట్ ఇచ్చిన అజయ్ దేవగన్‌.. సీక్వెలా.. ప్రీక్వెల
తానాజీ పార్ట్‌ 2 హింట్ ఇచ్చిన అజయ్ దేవగన్‌.. సీక్వెలా.. ప్రీక్వెల
పవన్ కళ్యాణ్ ప్లాన్ C.. ఫ్యూచర్ అదే..
పవన్ కళ్యాణ్ ప్లాన్ C.. ఫ్యూచర్ అదే..
తురిమిన కొబ్బరిని ఇలా నిల్వ చేస్తే నెలల తరబడి వాడుకోవచ్చు
తురిమిన కొబ్బరిని ఇలా నిల్వ చేస్తే నెలల తరబడి వాడుకోవచ్చు
హైదరాబాద్‌లో హాట్ ఎయిర్ బెలూన్స్ రైడ్‌.. ఇలా బుక్‌ చేసుకోండి!
హైదరాబాద్‌లో హాట్ ఎయిర్ బెలూన్స్ రైడ్‌.. ఇలా బుక్‌ చేసుకోండి!
ధనుష్- మృణాళ్ పెళ్లి రూమర్లు.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?
ధనుష్- మృణాళ్ పెళ్లి రూమర్లు.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?