Andhra Pradesh: పూజారితో తన్నించుకునేందుకు బారులు తీరిన భక్తులు.. ఆ ఆలయ ప్రత్యేకతే వేరు..!

Andhra Pradesh: పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందని అక్కడి భక్తుల నమ్మకం. కాలి తన్నుల కోసం భక్తులు బారులు తీరుతారు. ఏంటీ కథ? తెలియాలంటే..

Andhra Pradesh: పూజారితో తన్నించుకునేందుకు బారులు తీరిన భక్తులు.. ఆ ఆలయ ప్రత్యేకతే వేరు..!
Devotees
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 19, 2022 | 1:50 PM

Andhra Pradesh: పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందని అక్కడి భక్తుల నమ్మకం. కాలి తన్నుల కోసం భక్తులు బారులు తీరుతారు. ఏంటీ కథ? తెలియాలంటే కర్నూలు వెళ్లాల్సిందే. వివరాల్లోకెళితే.. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం చిన్నహోతురులో ఏటా ఏప్రిల్ 15 నుంచి 18 వరకు శ్రీ సిద్ధరామేశ్వరస్వామి రథోత్సవ ఉత్సవాలుజరుగుతాయి. ఉత్సవాల్లో చివరి రోజు శివపార్వతులకు కల్యాణం జరిపిస్తారు. తమ తల్లిదండ్రుల కల్యాణంలో భక్తులు కొన్ని తప్పులు చేసారని వారి కుమారుడు వీరభద్ర స్వామి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. స్వయంగా వీరభద్ర స్వామి పూజారి రూపంలో ఆలయంలో ఉన్న త్రిశూలం తీసుకొని తల్లిదండ్రుల ఉత్సవ విగ్రహాలను నెత్తిమీద ఉంచుకొని ఆగ్రహంతో నాట్యం చేస్తూ భక్తులను తన కాలితో తన్నుతాడు. అలా స్వామి వారి కాలి తన్నులు తిన్న వారికి మోక్షం జరిగిందని భక్తులు చెప్తుంటారు.

దాదాపు 500 ఏళ్ల నాటి నుంచి ఇప్పటి వరకు ఈ ఆచార సంప్రదాయంను కొనసాగుతోంది. కల్యాణం ముగిశాక భక్తులు ఆలయం ముందు వరస క్రమంలో బారులు తీరుతారు. పూజారి నాట్యం చేస్తూ ఆలయం నుంచి పరుగులు తీస్తూ బయటకు వస్తాడు. వరుస క్రమంలో ఉన్న కొందరు భక్తులను తన్నుకుంటూ వెళ్తారు. పూజారి కాలితో తన్నిన భక్తులు స్వామి వార్లకు పూజలు నిర్వహించి అక్కడినుంచి వెళ్ళిపోతారు. అలా తన్నించుకున్న వారు తమకు మోక్షం జరిగిందని భావిస్తుంటారు. పూజారి తన్నుల సేవా కార్యక్రమం తరువాత స్వామి వార్లకు భక్తులు గులాబీ రంగు ఉన్న నీటితో వసంతోత్సవం జరిపిస్తారు. ఇది తమ సంప్రదాయం అని అంటున్నారు గ్రామస్తులు.

Also read:

World Liver Day 2022: కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఇప్పుడే తెలుసుకోండి..

Best mobile phones under 13K: రూ. 13 వేల లోపు అదిరిపోయే స్మార్ట్ ఫోన్స్.. పూర్తివివరాలివే..

Mukesh Ambani Birthday: ముఖేష్ అంబానీ బర్త్‌డే స్పెషల్.. ఆయన జీవితంలోని అరుదైన విశేషాలు మీకోసం..