Best mobile phones under 13K: రూ. 13 వేల లోపు అదిరిపోయే స్మార్ట్ ఫోన్స్.. పూర్తివివరాలివే..

Best mobile phones under 13K: చాలా మంది స్మార్ట్ ఫోన్స్ కొనుగులో చేయడానికి ఆసక్తి చూపుతారు. అయితే, ఏ ఫోన్ కొనుగోలు చేయాలి, ఏ ఫోన్ బెటర్ అనే సందిగ్ధంలో

Best mobile phones under 13K: రూ. 13 వేల లోపు అదిరిపోయే స్మార్ట్ ఫోన్స్.. పూర్తివివరాలివే..
Smart Phones
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 19, 2022 | 1:39 PM

Best mobile phones under 13K: చాలా మంది స్మార్ట్ ఫోన్స్ కొనుగులో చేయడానికి ఆసక్తి చూపుతారు. అయితే, ఏ ఫోన్ కొనుగోలు చేయాలి, ఏ ఫోన్ బెటర్ అనే సందిగ్ధంలో పడిపోతుంటారు. ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తుంటారు. అయితే, అన్ని ఫోన్ల స్పెసిఫికేషన్స్ ఒకేలా ఉండటం కూడా గందరగోళానికి గురి చేస్తుంటుంది. అయితే, హై బడ్జెట్‌ ఫోన్లలో ఎక్కువ ఫీచర్స్ ఉండటం కామన్. అలాగే.. బడ్జెట్‌ ఫోన్లలోనూ అంతేస్థాయిలో ఫీచర్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఇక మన దేశంలో సామాన్య ప్రజలే ఎక్కువ అనే విషయం తెలిసిందే. బడ్జెట్ ఫోన్లకే ఎక్కువ ప్రాధాన్య ఇస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఏ ఫోన్ కొనుగోలు చేయాలనే సంశయిస్తుంటారు. అయితే, ఇవాళ మనం బడ్జెట్ ధరకే, అంటే రూ. 13 వేల లోపు అందుబాటులో ఉండి మాంచి ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

అవును, రూ.13,000 లకు అదిరిపోయే ఫీచర్లతో అనేక మొబైల్ కంపెనీ ఫోన్లు మార్కెట్‌లో విక్రయానికి ఉన్నాయి. ఆకర్షణీయమైన కలర్స్, కెమెరా ఫీచర్స్, ఛార్జింగ్ కెపాసిటీ, స్టోరేజీ కెపాసిటీ, వేగవంతమైన ప్రాసెసర్, డిస్‌ప్లే స్క్రీన్స్ వంటి అన్ని సదుపాయాలతో సూపర్ మొబైల్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. మార్కెట్‌లో 13 వేల రూపాయల లోపు లభించే ఫోన్స్ ఏంటో ఒకసారి చూద్దాం..

రియల్‌మి నార్జో 50: రూ. 12,999 ఒప్పో A31: రూ. 12,989 శామ్‌సంగ్ గెలాక్సీ M12: 12,499 రెడ్‌మీ 10 ప్రైమ్: 12,499

రియల్‌మీ నార్జో 50: ఈ రియల్‌మీ స్మార్ట్‌ఫోన్ రెండు రంగులలో లభిస్తుంది. స్పీడ్ బ్లూ, స్పీడ్ బ్లాక్. ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి.. చాలా తేలికగా ఉంటుంది. ఎంతసేపైనా చేతితో పట్టుకునే విధంగా, బరువు తక్కువగా ఉంటుంది. 4జీవీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ మెమరీ స్టోరేజీ/ 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీ కలిగి ఉంది.

మరిన్ని ఫీచర్స్.. 1) కెమెరా: 50MP + 2MP + 2MP బ్యాక్ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా 2) ప్రాసెసర్: MediaTek Helio G96 ఆక్టా-కోర్ ప్రాసెసర్, గరిష్టంగా 2.05 GHz క్లాక్ స్పీడ్ 3) డిస్‌ప్లే: 6.6 అంగుళాల FHD+ డిస్‌ప్లే, 2412×1080 పిక్సెల్ రిజల్యూషన్, 120Hz అధిక రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ మోడల్. 4) బ్యాటరీ: 5000mAh బ్యాటరీ

ఒప్పో A31: OPPO స్మార్ట్‌ఫోన్ చాలా స్లిమ్‌గా, తేలికగా ఉంటుంది. ఇది రెండు రంగులలో అందుబాటులో ఉంది. మిస్టరీ బ్లాక్, ఫాంటసీ వైట్. ColorOS 6.1 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా Android Pie v9.0పై నడుస్తుంది. అద్భుతమైన యూజర్ ఫ్రెండ్లీ అనుభవాన్ని అందిస్తుంది. ఇది 6 GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీ కలిగి ఉంది.

ఇతర ఫీచర్స్.. 1) కెమెరా: పోర్ట్రెయిట్ బోకెతో 12 + 2 + 2 MP ట్రిపుల్ వెనుక కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా. 2) డిస్‌ప్లే: 89% స్క్రీన్ టు బాడీ రేషియోతో 6.5 అంగుళాల వాటర్ డ్రాప్ మల్టీ టచ్ స్క్రీన్, 1600 x 720 పిక్సెల్స్ రిజల్యూషన్, 269 ​​PPI పిక్సెల్ డెన్సిటీ కలిగి ఉంది. 3) ప్రాసెసర్: 2.3GHz Mediatek 6765 ఆక్టా కోర్ ప్రాసెసర్. 4) బ్యాటరీ: 4230mAH లిథియం-పాలిమర్ బ్యాటరీ.

సామ్‌సంగ్ గెలాక్సీ M12: సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్‌లలో వస్తుంది. ఒకటి 4GB RAM+ 64 GB ఇంటర్నల్ స్టోరేజీతో, రెండవది 6 GB RAM+128 GB ఇంటర్నల్ స్టోరేజీతో ఉంది. ఇంకా మూడు రంగులలో అందుబాటులో ఉంది. బ్లాక్, బ్లూ, వైట్ కలర్‌ ఫోన్స్ ఉన్నాయి. లైట్ వేయిట్‌ కలిగి ఉంది.

ఇతర ఫీచర్స్.. 1) కెమెరా: 48MP + 5MP + 2MP + 2MP క్వాడ్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా. 2) బ్యాటరీ: 6000mAH లిథియం-అయాన్ బ్యాటరీ. 3) డిస్ప్లే: 6.5 అంగుళాల HD+ TFT LCD – ఇన్ఫినిటీ v-కట్ డిస్ప్లే, 90Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్.

రెడ్‌మీ 10 ప్రైమ్: రెడ్‌మీ 10 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్ స్ట్రాంగ్, ఆకర్షణీయమైన బాడీని కలిగి ఉంది. 4GB RAM+64 GB స్టోరేజ్ కెపాసిటీని కలిగి ఉంది.

ఇతర ఫీచర్స్.. 1) కెమెరా: 50MP + 8MP + 2MP + 2MP వెనుక కెమెరా, ఫ్రంట్ కెమెరా: 8 MP. 2) ప్రాసెసర్: MediaTek Helio G88 Octa-core processor with HyperEngine 2.0, గరిష్టంగా 2.0GHz క్లాక్ స్పీడ్. 3) డిస్‌ప్లే: 6.5 అంగుళాల FHD+ డాట్ డిస్‌ప్లే, 2400×1080 పిక్సెల్ రిజల్యూషన్, 90Hz అధిక రిఫ్రెష్ రేట్, అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ టెక్నాలజీ, 180Hz టచ్ నమూనా. 4) బ్యాటరీ: 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6000mAh బ్యాటరీ.

Also read:

RBI revises bank timings: బ్యాంక్ కస్టమర్లకు ‘బిగ్ అలర్ట్’.. టైమింగ్స్ మారాయి.. పూర్తివివరాలివే..!

Viral Video: ఇజ్జత్ పోతుందని సైలెంట్‌‌గా సైడ్‌ కి వెళ్లిన పిల్లి.. వీడియో చూస్తే పొట్టచెక్కలవ్వాల్సిందే..

Chanakya Niti: ఈ నాలుగు అలవాట్లు ఒక వ్యక్తిని ధనవంతుడిని చేస్తాయి..!

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!