AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Liver Day 2022: కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఇప్పుడే తెలుసుకోండి..

World Liver Day 2022: ఒక వ్యక్తి ఆరోగ్యం విషయానికవ స్తే కాలేయం పాత్రం చాలా కీలకం అనే చెప్పాలి. కాలయం ఆరోగ్యంగా ఉంటే వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉంటారు.

World Liver Day 2022: కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఇప్పుడే తెలుసుకోండి..
Liver Health
Shiva Prajapati
|

Updated on: Apr 19, 2022 | 1:40 PM

Share

World Liver Day 2022: ఒక వ్యక్తి ఆరోగ్యం విషయానికవ స్తే కాలేయం పాత్రం చాలా కీలకం అనే చెప్పాలి. కాలయం ఆరోగ్యంగా ఉంటే వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉంటారు. అందుకే ఆరోగ్యం విషయంలో కాలేయం పాత్ర గురించి అవగాహన పెంచడానికి, కాలయానికి సంబంధించిన వ్యాధులు, పరిస్థితుల గురించి ప్రజల్లో చైతన్యం పెంచడానికి ప్రతీ సంవత్సరం ఏప్రిల్ 19న ప్రపంచ కాలేయ దినోత్సవంగా జరుపుకుంటారు.

శరీరంలో రెండవ అతిపెద్ద అవయవం కాలేయం. ఇది శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం. మెదడు తర్వాత రెండవది. ఎందుకంటే మానవ శరీరంలో రోగనిరోధక శక్తి, జీర్ణక్రియ, జీవక్రియపై ప్రతిబింబించే శరీరంలోని వివిధ కీలకమైన విధులకు కాలేయం బాధ్యత వహిస్తుంది. సాధారణంగా, హెపటైటిస్‌బి, సి, ఆల్కహాల్ లేదా డ్రగ్స్ దుర్వినియోగం వంటి ఇతర కారణాల వల్ల కాలేయం దెబ్బతింటుంది. అయితే, కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

చేయకూడనివి.. కొవ్వు పదార్థాలు ఎక్కువగా తినకూడు. ప్రాసెస్ చేసిన ఆహారాలకూ దూరంగా ఉండాలి. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నందున..కాలేయంపై దుష్ప్రభావం చూపుతుంది. ఇవి శరీరంలో చక్కెర స్థాయిని కూడా పెంచుతాయి. సంతృప్త, ట్రాన్స్ కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండండి. ముఖ్యంగా ఫ్రై చేసిన ఆహారాలు అస్సలు తీసుకోవద్దు. మద్యం సేవించకూడదు. ఆల్కహాల్ డీహైడ్రేటింగ్ ఏజెంట్‌గా పని చేస్తుంది. దాంతో శరీరంలోని టాక్సిన్‌లను తొలగించడంలో కాలేయం శ్రమించాల్సి వస్తుంది. మాంసాహారం కూడా అధికంగా తీసుకోవద్దు. చాక్లెట్లు, క్యాండీలు, కూల్‌డ్రింక్స్ వంటి అధిక షుగర్ కంటెంట్ ఉన్న పదార్థాలు అస్సలు తినొద్దు.

ఏం చేయాలి.. కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. బచ్చలికూ, బ్రోకలీ, కాలే వంటి ఆకుపచ్చని కూరగాయలు తీసుకోవాలి. ఈ కూరగాయలు శరీరాన్ని శుభ్రపరిచే ప్రక్రియను మెరుగుపరుస్తాయి. వాల్‌నట్స్, అవకాడోలు తినడం, ఆలీవ్ ఆయిల్‌తో వంటలు చేసుకోవడం ప్రారంభించండి. ఆరోగ్యకరమైన కాలెం కావాలంటే.. హైడ్రేట్‌గా ఉండటం ముఖ్యం. నీరు సహజమైన నిర్విషీకరణ ఏజెంట్‌గా పని చేస్తుంది. అలా కాలేయం శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. మీరు తినే ఆహారంలో పండ్లను అధికంగా చేర్చుకోండి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే.. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.

Also read:

RBI revises bank timings: బ్యాంక్ కస్టమర్లకు ‘బిగ్ అలర్ట్’.. టైమింగ్స్ మారాయి.. పూర్తివివరాలివే..!

Viral Video: ఇజ్జత్ పోతుందని సైలెంట్‌‌గా సైడ్‌ కి వెళ్లిన పిల్లి.. వీడియో చూస్తే పొట్టచెక్కలవ్వాల్సిందే..

Chanakya Niti: ఈ నాలుగు అలవాట్లు ఒక వ్యక్తిని ధనవంతుడిని చేస్తాయి..!

మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!