Viral Photo: 6 రోజుల్లో పెళ్లి.. 10 రూపాయల నోటుతో ప్రేయసి రాయబారం.. ఏం రాసిందో తెలిస్తే షాక్..!

Viral Photo: కొన్నేళ్ల క్రితం ‘సోనమ్ గుప్తా బేవఫా హై’ అని రాసిన నోట్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి గుర్తుండే ఉంటుంది.

Viral Photo: 6 రోజుల్లో పెళ్లి.. 10 రూపాయల నోటుతో ప్రేయసి రాయబారం.. ఏం రాసిందో తెలిస్తే షాక్..!
Lovers
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 20, 2022 | 8:56 PM

Viral Photo: కొన్నేళ్ల క్రితం ‘సోనమ్ గుప్తా బేవఫా హై’ అని రాసిన నోట్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి గుర్తుండే ఉంటుంది. దానిపై నెటిజన్లు సోషల్ మీడియాలో రకరకాల మీమ్స్ చేసి రచ్చ రచ్చ చేశారు. అయితే, తాజాగా అంతకు మించిన షాకింగ్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘విశాల్ మేరీ షాదీ ఏప్రిల్ 26’ అంటూ ప్రేయసి రాసిన ఓ ప్రేమ లేఖ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అది కూడా మామూలు ప్రేమ లేఖ కాదండోయ్.. కాస్ల్టీ ప్రేమ లేఖ. పాత కాలంలో పావురాలతో సందేశాలు పంపించేవారు. ఆ తరువాత తపాలా వ్యవస్థ వచ్చాక.. దాని ద్వారా సమాచారం చేరవేసేవారు. కాలం మారుతోంది.. క్రమంగా టెక్నాలజీ కూడా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుత ఫోన్ యుగంలో.. ఓ ప్రేయసి పంపిన కరెన్సీ రాయబారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఆ నోట్‌పై పెళ్లికి ముందే తనను తీసుకెళ్లాలని వేడుకుంది ఆ ప్రియుడిని కోరింది ప్రేయసి.

మైక్రో-బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లో, క్రైమ్ మాస్టర్ గోగో పేరుతో ఉన్న అకౌంట్ నుంచి 10 రూపాయల కరెన్సీ నోటును షేర్ చేశారు. ఆ కరెన్సీ నోటుపై ‘విశాల్, నా పెళ్లి ఏప్రిల్ 26న. నన్ను తీసుకెళ్లు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను మీ కుసుమ్.’ అని ఆ కరెన్సీ నోటుపై రాసి ఉంది. దీన్ని షేర్ చేసిన ట్విట్టర్ యూజర్.. ఏప్రిల్ 26వ తేదీ లోపు కుసుమ్ సందేశాన్ని అతని ప్రియుడికి చేరవేయాలని, అతనికి చేరే వరకు షేర్ చేయండి అంటూ క్యాప్షన్ పెట్టారు. ఇద్దరి ప్రేమికులను కలిపే అంశం కావడంతో నెటిజన్లందరూ ఏకమయ్యారు. ఆ ఫోటోను తెగ షేర్ చేస్తున్నారు. విశాల్, కుసుమ్ అనే పేరుతో ఉన్న అకౌంట్లను ట్యాగ్ చేస్తూ షేర్ చేస్తున్నారు. వారిద్దరికీ ఒక్కటి చేసేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు. ఆ పోస్ట్‌ను మీరూ చూసేయండి మరి.

Also read:

Viral Video: కుక్కను ఓ రేంజ్‌లో కాకా పట్టిన పిల్లి.. దాని ట్యాలెంట్‌కు ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే..!

Viral Video: డ్రైవర్ సాబ్ ఎంత పని చేశావయ్యా.. రిజర్వాయర్‌లో స్విమ్మింగ్ చేసిన కారు..!

AP Weather Alert: ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ ప్రజలకు ‘కూల్’ న్యూస్.. రాబోయే మూడు రోజులు..