Vijayawada: బెజవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం.. యువతిపై గ్యాంగ్ రేప్.. ఆ తర్వాత..
Woman gangraped at GGH: ఏపీలో విజయవాడలో దారుణం జరిగింది. ప్రభుత్వ (GGH Vijayawada) ఆసుపత్రిలో ఓ మానసిక దివ్యాంగురాలిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
Woman gangraped at GGH: ఏపీలో విజయవాడలో దారుణం జరిగింది. ప్రభుత్వ (GGH Vijayawada) ఆసుపత్రిలో ఓ మానసిక దివ్యాంగురాలిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రేమ పేరుతో యువతికి మాయమాటలు చెప్పి అత్యాచారం చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్న ప్రియుడు శ్రీకాంత్.. మరో ఇద్దరితో కలిసి దారుణానికి పాల్పడ్డాడు. మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన యువతి తిరిగి రాలేదు. దీంతో యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. దీనిపై నున్న పీఎస్‌లో మిస్సింగ్ కేసు నమోదు కాగా.. నిన్న ప్రభుత్వ ఆసుపత్రిలో యువతిని గుర్తించారు పోలీసులు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. కాగా.. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇంత జరుగుతున్న పోలీసులు ఏం చేస్తున్నారంటూ పలువురు నాయకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినా.. ఎందుకు పట్టించుకోలేదని సీపీఎం నేత బాబురావు మండిపడ్డారు. విజయవాడ GGH ఎదుట జరిగిన ఘటనతో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు టిడిపి సీనియర్ నేత బుద్ధా వెంకన్న. ఆస్పత్రిలో యువతిపై ఇద్దరు నిందితులు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డ.. పట్టించుకునే నాథుడే కవరయ్యారన్నారు. మూడు రోజుల క్రితం మిస్సింగ్ కేసు నమోదైనా పోలీసులు ఎందుకు పట్టించుకోలేదన్నారు. అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని ఆరోపించారు మహిళా సంఘాల నేతలు. దిశా చట్టం ఉన్నా.. వాటిని కఠినంగా అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ జీజీహెచ్ ఎదుట సీపీఎం, టీడీపీ, మహిళా సంఘాల నేతలు ఆందోళన కొనసాగుతోంది. బాధితురాలికి న్యాయం జరిగేవరకూ అక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదంటున్నారు. మరోవైపు నిన్న ప్రభుత్వ ఆసుపత్రిలో యువతిని గుర్తించారు పోలీసులు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి..విచారిస్తున్నారు.
Also Read: