Hyderabad: కోడ్ ఉంటేనే గదిలోకి అనుమతి.. హైటెక్ సెక్స్ రాకెట్ గుట్టురట్టు
హైదరాబాద్‌లో(Hyderabad) హైటెక్ సెక్స్ రాకెట్ గుట్టురట్టు అయింది. టెక్నాలజీ ఆధారంగా సెక్స్ రాకెట్ నడుపుతున్న ఉగాండా(Uganda) దేశానికి చెందిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. సెక్స్ రాకెట్(Prostitution Rocket) నిర్వహించేందుకు...
హైదరాబాద్‌లో(Hyderabad) హైటెక్ సెక్స్ రాకెట్ గుట్టురట్టు అయింది. టెక్నాలజీ ఆధారంగా సెక్స్ రాకెట్ నడుపుతున్న ఉగాండా(Uganda) దేశానికి చెందిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. సెక్స్ రాకెట్(Prostitution Rocket) నిర్వహించేందుకు ఉగాండా దేశీయులు ప్రత్యేక సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. సీక్రెట్ కోడ్ ఎంటర్ చేస్తేనే విటులను లోపలికి అనుమతిచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు షాక్ కు గురయ్యారు. సాధారణంగా సీక్రెట్ కోడ్‌లను డేటా ట్రాన్స్‌ఫర్, డేటా షేరింగ్, ఈమెయిల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్ చేయడానికి వినియోగిస్తున్నారు. కానీ పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు కస్టమర్ ఆథెంటికేషన్ కోసం సీక్రెట్ కోడ్‌లు ఉపయోగించడం ఇదే తొలిసారి అని పోలీసులు చెబుతున్నారు. తమపై అందిన సమాచారం ఆధారంగా నార్సింగిలోని ఓ ఫ్లాట్‌పై దాడి చేశారు. అక్కడ నలుగురు ఉగాండా దేశానికి చెందిన వారికి కనుగొన్నారు. వారిలో ముగ్గురు సెక్స్ వర్కర్లు ఉన్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా.. ఒక డేటింగ్ యాప్ ద్వారా కస్టమర్, నిర్వాహకులు సంప్రదింపులు జరిపినట్టుగా తెలుసుకుని పోలీసులు ఆశ్చర్యపోయారు.
కస్టమర్ డబ్బులు చెల్లించడానికి ఒప్పుకున్న తర్వాత.. ఒక ఫ్లాట్‌లోని మహిళ వద్దకు వెళ్లేందుకు కోడ్‌ను షేర్ చేశారు. కస్టమర్ అక్కడికి వెళ్లి సీక్రెట్ కోడ్‌ను ఎంటర్ చేస్తేనే మహిళ వద్దకు వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. ఆ తర్వాత నిర్వాహకులు కస్టమర్ మొబైల్ ఫోన్ నుంచి వారి సంప్రదింపు వివరాలు, ఇతర సమాచారం తొలగిస్తారు. తద్వారా కస్టమర్ ఆ డేటాను దుర్వినియోగం చేయడం వీలు లేకుండా పోలీసులకు సాక్ష్యాలు దొరకకుండా ఉండేలా జాగ్రత్తపడతారు. వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న ఉగాండా మహిళతో పాటు కస్టమర్‌ను నిందితులుగా చేర్చినట్టుగా పోలీసులు తెలిపారు. కస్టమర్లకు వల వేస్తున్న ఉగాండాకు చెందిన మరో వ్యక్తి పరారయ్యాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Also Read
Stock Market: దాలాల్ స్ట్రీల్ లో కొనసాగుతున్న బుల్ జోరు.. లాభాల్లో ప్రధాన సూచీలు..
Srisailam Reservoir: శ్రీశైలం రిజర్వాయర్‌కు పెనుముప్పు.. నిపుణుల కమిటీ వార్నింగ్.. ఇంకా..