AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wonder Kid: ఏడాదిన్నర వయసులో 400 వస్తువులు పేర్లు చెప్పే వండర్ కిడ్.. సూపర్‌ రికార్డ్‌

Wonder Kid: ఏడాదిన్నర వయసున్న ఓ బాలుడు తన జ్ఞాపకశక్తితో సూపర్ కిడ్ (Super Kid) అనిపించుకున్నాడు. హైదరాబాద్ కు చెందిన సహాన్ష్ అనే సంవత్సరన్నర బాలుడు చిన్న వయసులోనే..

Wonder Kid: ఏడాదిన్నర వయసులో 400 వస్తువులు పేర్లు చెప్పే వండర్ కిడ్.. సూపర్‌ రికార్డ్‌
India Book Of Record
Surya Kala
|

Updated on: Apr 21, 2022 | 9:50 AM

Share

Wonder Kid: ఏడాదిన్నర వయసున్న ఓ బాలుడు తన జ్ఞాపకశక్తితో సూపర్ కిడ్ (Super Kid) అనిపించుకున్నాడు. హైదరాబాద్ కు చెందిన సహాన్ష్ అనే సంవత్సరన్నర బాలుడు చిన్న వయసులోనే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో(India Book of Record) పేరు సంపాదించుకున్నాడు.. వస్తువుల పేర్లు గుర్తు పెట్టుకునే అలవాటు తన కొడుకులో ఉందని తెలుసుకున్న తల్లిదండ్రులు ప్రతి ఒక్కటి నేర్పించడం మొదలుపెట్టారు. దాదాపు 400 వస్తువుల పేర్లు చెప్తాడు. వేరే పిల్లలతో పోల్చుకుంటే తన పిల్లోడి లో ఏదో కొత్త లక్షణం, జ్ఞాపక శక్తి ఉందని తెలుసుకొని తల్లిదండ్రులు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ని సంప్రదించారు. పిల్లాడు చెప్పేవి అన్నీ రికార్డ్ చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ పంపించిన తర్వాత వారు వాటిని గుర్తించి అప్రిసియేషన్ సర్టిఫికేట్ ఇచ్చారు..

ఇందులో భాగంగా ఈ బుడత.. 16 పండ్లు, 11 కూరగాయల పేర్లు, 4 కీటకాలు, 12 స్టేషనరీ ఐటమ్స్, 9 బట్టలు, 38 జంతువులు, 10 వంటలు, 6 పక్షులు, 12 ఆకారాలు, 12 కలర్స్, 16 వెహికల్స్, 17 బాడీ పార్ట్స్, 12 హోమ్ అప్లయెన్సెస్, 38 యాక్షన్, 58 household items, 14 బంధాల పేర్లు చెప్పి అబ్బురపరిచాడు.

Reporter: Navya Chaitanya, Tv9 Telugu

Also Read: Tomato Price: మళ్ళీ టమాటా ధర పైపైకి.. అన్నదాత హర్షం.. మరింత పెరిగే అవకాశముందంటూ..

UK PM Johnson: భారత్‌కు చేరుకున్న బ్రిటన్ ప్రధాని జాన్సన్.. రేపు ప్రధాని మోడీతో సమావేశం