Mangoes: చేదెక్కుతున్న మధుర ఫలం.. ధరలోనే కాదు, రుచిలోనూ మోసమే

పండ్లల్లో రారాజు.. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఎంతో ఇష్టంగా తినేది మామిడిపండు(Mango). వేసవి కాలంలోనే అందుబాటులో ఉండటంతో ఆ మధుర ఫలం రుచి చూసేందుకు ఉవ్విళ్లూరుతుంటారు. ధర ఎంతున్నా ఏ మాత్రం...

Mangoes: చేదెక్కుతున్న మధుర ఫలం.. ధరలోనే కాదు, రుచిలోనూ మోసమే
Mangoes
Follow us

|

Updated on: Apr 21, 2022 | 11:06 AM

పండ్లల్లో రారాజు.. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఎంతో ఇష్టంగా తినేది మామిడిపండు(Mango). వేసవి కాలంలోనే అందుబాటులో ఉండటంతో ఆ మధుర ఫలం రుచి చూసేందుకు ఉవ్విళ్లూరుతుంటారు. ధర ఎంతున్నా ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా కొంటుంటాం. ఇదే సమయంలో కొందరు అక్రమార్కులు మామిడిపండ్లనూ కల్తీ చేస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కాయ పక్వానికి రాకముందే చెట్టు మీది నుంచి కోసి, రసాయనాలతో(Chemicals) మగ్గిస్తున్నారు. చూసేందుకు మంచి రంగుతో కనిపించినా రుచిగా ఉండదు. ఇలాంటి పండ్లను తింటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే. కార్బైడ్‌(Carbide) తో పండ్లను మగ్గించడాన్ని 2012లో నిషేధించినా అధికారుల తనిఖీలు లేకపోవడం అక్రమ వ్యాపారులకు కలిసొచ్చే అంశం. సాధారణంగా బంగినపల్లి, సువర్ణరేఖ, చెరకు రసం, కలెక్టర్‌ తదితర రకాల కాయలు విరివిరిగా లభ్యమవుతాయి.

ఈ ఏడాది మార్కెట్‌లోకి ఇప్పుడిప్పుడే మామిడిపండ్లు వస్తున్నాయి. ఇవి చూడ్డానికి బాగానే కనిపిస్తున్నా.. అంతగా రుచి ఉండటం లేదు. హెక్టారుకు ఎనిమిది నుంచి పది టన్నుల దిగుబడి వస్తుంది. ఈ ఏడాది తెగుళ్లు, పురుగుల బెడద లేకపోయినా పూత ఆలస్యంగా రావడం.. మంచు, ఎండతీవ్రత పెరగడం తదితర కారణాల వల్ల దిగుబడి పడిపోయింది. ఫలితంగా ధరలు భగ్గుమంటున్నాయి. ప్రకృతి సిద్ధంగా పండాలంటే వారం, పది రోజులు పడుతుంది. రసాయనాలు వినియోగించడం వల్ల నాలుగు రోజుల్లోనే అవి పండినట్లుగా కనిపిస్తాయి. కాల్షియం కార్బైడ్‌, కొన్ని ఇతర రకాల రసాయనాలు వినియోగించి వీటిని మాగబెడతారు.

ఇలా చేయడం సరికాదని.. ఇథనాల్‌తో పండ్లను మగ్గించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. తద్వారా మూడు రోజుల్లోనే మామిడిపండ్లు సహజసిద్ధంగా పండుతాయి. వీటి నిర్వహణను మార్కెట్‌ కమిటీ పాలకవర్గాలు పట్టించుకోకపోవడంతో నిరుపయోగంగా మారాయి.

Also Read

PK-Congress: పీకే సలహా మేరకు ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకుంటుందా?

Sarkaru Vaari Paata: ఈసారి స్పీకర్లు పగిలిపోవాలే.. మహేశ్‌ మూవీ నుంచి మరో మ్యూజికల్‌ ట్రీట్‌.. టైటిల్‌ సాంగ్‌ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్‌..

Bank of India Recruitment 2022: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 696 ఉద్యోగాలు..పూర్తి వివరాలివే..