PK-Congress: పీకే సలహా మేరకు ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకుంటుందా?

కాంగ్రెస్‌కు పునర్వైభవం రావాలంటే ఏం చేయాలో ప్రశాంత్‌కిశోర్‌ కొన్ని ప్రతిపాదనలను, ప్రణాళికలను రచించుకున్నారు. వాటిని పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో ఇప్పటికే నాలుగుసార్లు చర్చలు జరిపారు.

PK-Congress: పీకే సలహా మేరకు ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకుంటుందా?
Pk Congress
Follow us
Balu

| Edited By: Ram Naramaneni

Updated on: Apr 21, 2022 | 11:04 AM

అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీలో ఆత్మవిమర్శ మొదలయ్యింది. దాంతో పాటుగా తత్వచింతన కూడా! ఇంతకాలం అప్పుడేప్పుడో కురిసిన హిమసమూహములనే చెప్పుకుంటూ వచ్చిన కాంగ్రెస్‌ ఇప్పుడు మెదడుకు పనికల్పిస్తోంది. అందుకు కారణం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోరే! కాంగ్రెస్‌కు పునర్వైభవం రావాలంటే ఏం చేయాలో ప్రశాంత్‌కిశోర్‌(Prashant Kishor) కొన్ని ప్రతిపాదనలను, ప్రణాళికలను రచించుకున్నారు. వాటిని పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో ఇప్పటికే నాలుగుసార్లు చర్చలు జరిపారు. ఇదే సమయంలో పీకే ప్రణాళికలపైనా, ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారన్న విషయంపైనా బయట చాలా చర్చ జరిగింది. ప్రశాంత్‌ కిశోర్‌ ప్రణాళికలను పరిశీలించే బాధ్యతను సీనియర్‌ నేతలు ఏకే ఆంథోరిచ అంబికా సోని(Ambika Soni), మల్లికార్జున్‌ ఖర్గే(Mallikarjun Kharge)లకు అప్పగించారు సోనియా. మరో మూడు నాలుగు రోజుల్లో వీరు తమ తుది నివేదికను సోనియాకు అందించే అవకాశం ఉంది. ఆ తర్వాత భవిష్యత్తు కార్యాచరణపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. అప్పుడు కానీ ప్రశాంత్‌ కిశోర్‌ కాంగ్రెస్‌లో చేరతారా? లేక వ్యూహకర్త వరకే పరిమితం అవుతారా అన్నది తేలదు. కాంగ్రెస్‌లో పీకే పాత్ర ఏమిటన్నది సోనియానే నిర్ణయించాలి. ఈ విషయంపై ఇప్పటికే రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీలతో చర్చించారు సోనియా. సీనియర్‌ నేతలు కమల్‌నాథ్‌, దిగ్విజయ్‌సింగ్‌, ముకుల్ వాస్నిక్‌, వేణుగోపాల్‌, ఆంథోని, అంబికా సోని, జైరామ్‌రమేశ్‌లతో కూడా చర్చించారు సోనియా. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఒంటరిగానే పోటీ చేయాలన్న పీకే సూచనను పాటించాలని డిసైడయ్యింది అధిష్టానం. ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, ఒడిషాలలో ఒంటరిగా పోటీ చేయడమే మంచిదన్న పీకే సూచనలకు కాంగ్రెస్‌ అధినాయకత్వం ఓకే చెప్పిందట. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ 370 లోక్‌సభ నియోజకవర్గాలలో సీరియస్‌గా దృష్టి పెట్టాలని పీకే లెక్కలేసి మరీ చెప్పారు. పీకే చెప్పారని కాదు కానీ కాంగ్రెస్‌కు కాస్తో కూస్తో బలమున్న స్థానాలు ఇన్నే! సాధారణ ఎన్నికలకు ముందు కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాది జరిగే గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌ సమాయత్తమవ్వాల్సి ఉంది. వచ్చే ఏడాది కర్నాకట, మధ్యప్రదేశ్‌, రాజస్తాన్‌, చత్తీస్‌గఢ్‌, తెలంగాణ వంటి రాష్ట్రాలకు సంసిద్ధం కావాల్సి ఉంటుంది.

ప్రశాంత్‌ కిశోర్‌ చెప్పినవాటికి కాంగ్రెస్‌ అధినాయకత్వం తలూపడానికి కారణం ఆయన ట్రాక్‌ రికార్డే. 2014లో నరేంద్రమోదీ అధికారంలోకి రావడానికి దోహదపడిన పీకే ఆ తర్వాత 2015లో బీహార్‌లో జనతాదళ్‌ యునైటెడ్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కారకుడయ్యారు. కిందటిసారి పంజాబ్‌లో అంటే 2017 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించడం వెనుక పీకే ఉన్నారు. 2019లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ను గద్దెనెక్కించగలిగారు. 2020లో ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ, బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌, తమిళనాడులో డీఎంకే అధికారంలోకి రావడానికి ప్రశాంత్‌ కిశోర్‌ దోహదపడ్డారు. బెంగాల్‌లో బీజేపీకి మూడెంకల సీట్లు కూడా రావని, వందకు పైగా సీట్లు బీజేపీకి వస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు పీకే.. ఇక పీకే పని అయిపోయినట్టేనని అందరూ అనుకున్నారు. కానీ ఆశ్యర్యంగా పీకే చెప్పినట్టుగానే బీజేపీ రెండంకెల స్థానాలతో సంతృప్తి చెందాల్సి వచ్చిందక్కడ! 2017లో ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలప్పుడు సమాజ్‌వాదీ- కాంగ్రెస్‌ పార్టీల కూటమి తరఫున పీకే పని చేశారు. ఆ ఒక్కసారే పీకే ఫెయిలయ్యారు. కాంగ్రెస్‌లో పీకే చేరతారా లేదా అన్నది పక్కన పెడితే కాంగ్రెస్‌కు వ్యూహకర్తగా వ్యవహరించడం కూడా తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు నచ్చడం లేదు. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితికి పని చేస్తూ కాంగ్రెస్‌కు ఎలా వ్యూహకర్తగా వ్యవహరిస్తారన్నది తెలంగాణ కాంగ్రెస్‌ నేతల ప్రశ్న. ప్రాంతీయ సమీకరణాల పేరిట టీఆర్‌ఎస్‌తో పొత్తు కుదిరిస్తారేమోనన్న భయమూ ఉంది. టీఆర్‌ఎస్‌తో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు ఉండదని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌ అంటున్నారు కానీ నేతలు మాత్రం ఇంకా సందేహిస్తూనే ఉన్నారు.

టీఆర్‌ఎస్‌ తరఫున పని చేస్తున్న పీకే ఇప్పటికే ఓ నివేదికను కేసీఆర్‌కు సమర్పించారట. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారా? ప్రభుత్వం పట్ల ప్రజలలో ఎంత వ్యతిరేకత ఉంది? టీఆర్‌ఎస్‌ వైరి పక్షాలైన బీజేపీ, కాంగ్రెస్‌ పరిస్థితి ఎలాగుంది? వంటి అంశాలపై పీకే టీమ్‌ బాగా వర్క్‌ చేసి ఓ నివేదికను తయారు చేసిందట. ఆ నివేదికను బట్టే కేసీఆర్‌ నిర్ణయాలు తీసుకుంటారట! పీకేను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్న మాట నిజమేనా అన్న ప్రశ్నకు కేసీఆర్‌ అవుననడం లేదు, కాదనడం లేదు. కేసీఆర్‌ ఈ విషయాన్ని డైరెక్ట్‌గా చెప్పకపోయినా ఒకానొక సందర్భంలో పీకేతో కలిసి పని చేస్తే తప్పేమిటన్నారు. . ఇప్పుడు జాతీయస్థాయిలో కాంగ్రెస్‌కు వ్యూహకర్తగా ఉన్నారు కాబట్టి ఆ పార్టీ గెలుపు బాధ్యతలను భుజాన వేసుకోక తప్పదు. వివిధ రాష్ట్రాలలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రాంతీయపార్టీలతో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్‌కు సూచించిన పీకే ఇప్పుడా పనిలోనే ఉన్నారు. టీఆర్‌ఎస్‌తో పొత్తుకు కాంగ్రెస్‌ అధిష్టాన్ని సిద్ధం చేయబోతున్నారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు ఉండకపోవవచ్చు కానీ, 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలప్పుడు మాత్రం టీఆర్‌ఎస్‌- కాంగ్రెస్‌ పొత్తు ఉండవచ్చన్నది కాంగ్రెస్‌ నేతల భావన. ఇలాగైతే 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతినవచ్చని అనుకుంటున్నారు. ఎలాగూ వరంగల్‌లో రాహుల్‌గాంధీ సభ ఉంది కాబట్టి.. ఆ సభా వేదికపైనే రాహుల్‌తో పొత్త విషయంలో ఓ స్పష్టత ఇప్పించాలని తెలంగాణ పీసీసీ నేతలు అనుకుంటున్నారు.

'పంత్.. నువ్వొక స్టుపిడ్'.. లైవ్ మ్యాచ్‌లోనే రెచ్చిపోయిన సన్నీ..
'పంత్.. నువ్వొక స్టుపిడ్'.. లైవ్ మ్యాచ్‌లోనే రెచ్చిపోయిన సన్నీ..
ప్రభాస్, విజయ్ పై సుదీప్ కామెంట్స్..
ప్రభాస్, విజయ్ పై సుదీప్ కామెంట్స్..
మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..