Hyderabad: హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఏకంగా 45 రోజులు నిబంధనలు
హైదరాబాద్ నగరంలోని పికెట్ నాలా పునర్నిర్మాణ పనుల కారణంగా అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు చేపట్టారు. ఈ నెల 21 నుంచి జూన్ 4 వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని వెల్లడించారు. సికింద్రాబాద్ ఎస్పీ....
హైదరాబాద్ నగరంలోని పికెట్ నాలా పునర్నిర్మాణ పనుల కారణంగా అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు చేపట్టారు. ఈ నెల 21 నుంచి జూన్ 4 వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని వెల్లడించారు. సికింద్రాబాద్ ఎస్పీ రోడ్డు, మినిస్టర్ రోడ్డులోని ప్యాట్నీ నాలా వంతెన పునర్నిర్మాణానికి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా మళ్లింపులు చేపడుతున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. సికింద్రాబాద్ సీటీవో నుంచి రసూల్‌పుర జంక్షన్ వైపు వచ్చే వాహనాలు హనుమాన్ దేవాలయం (యాత్రి నివాస్) వద్ద ఎడమకు తిరిగి పీజీ రోడ్డు మీదుగా ఫుడ్‌వరల్డ్, రాంగోపాల్‌పేట్ ఠాణా, మినిస్టర్ రోడ్డుల మీదుగా రసూల్‌పుర జంక్షన్‌కు వెళ్లాలి. బేగంపేట్ ప్లై ఓవర్ నుంచి వచ్చే ట్రాఫిక్ కిమ్స్ ఆసుపత్రి రసూల్‌పురా టీ జంక్షన్ నుంచి కుడివైపు మలుపు తీసుకుని వెళ్లేందుకు అనుమతి లేదు. నేరుగా సీటీఓ జంక్షన్ వైపు వెళ్లేందుకు అనుమతి ఉంటుంది.
ఎస్పీరోడ్డు హనుమాన్ టెంపుల్ నుంచి ఫుడ్ వరల్డ్ రాంగోపాల్‌పేట్ ఠాణా మీదుగా రసూల్‌పురా టీ జంక్షన్‌కు వెళ్లే దారి వన్‌వేగా ఉంటుంది. గూడ్స్ వాహనాలు, రవాణా వాహనాలు సికింద్రాబాద్ నుంచి సోమాజీగూడ వైపు వెళ్లేందుకు ఈ మార్గంలో అనుమతి లేదు. ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాలి. పంజాగుట్ట వైపు నుంచి వచ్చే వాహనాలు బేగంపేట్ ప్లై ఓవర్ కింద యూ టర్న్ తీసుకుని హనుమాన్ టెంపుల్ లేన్ నుంచి ఫుడ్‌వరల్డ్, రాంగోపాల్‌పేట్ ఠాణా వద్ద ఎడమ వైపు నుంచి కిమ్స్ ఆసుపత్రికి వెళ్లాలి. వాహనదారులు ఈ మార్పులు గమనించి, సహకరించాలని కోరారు.
Also Read
మూడు పెళ్లిళ్లు జరిగాయి.. మరో మహిళతో లవ్.. విషయం తెలిసిన మూడో భార్య ఏం చేసిందంటే..?
JoSAA 2022: జోసా కౌన్సెలింగ్ తేదీని ప్రకటించిన ఐఐటీ బాంబే.. సెప్టెంబరు 12 నుంచి..
Eggs: ఎండాకాలంలో గుడ్లు తినడం మంచిదేనా ?.. తింటే ఎన్ని తినాలి? ఇదిగో క్లారిటీ