Eggs: ఎండాకాలంలో గుడ్లు తినడం మంచిదేనా ?.. తింటే ఎన్ని తినాలి? ఇదిగో క్లారిటీ
వేసవిలో గుడ్డు తింటే వేడి చేస్తుందని చాలామంది అంటుంటారు.. ఇది ఎంతవరకు నిజం.. ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం పదండి.
Health Tips: శరీరానికి గుడ్లు ఎంతో మేలు చేస్తాయి. శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ఖనిజాలు.. ఇవన్నీ కోడిగుడ్డులో పుష్కలంగా లభిస్తాయి. ప్రతిరోజూ గుడ్లు తింటే శరీరంలో ప్రొటిన్స్ పెరుగుతాయి. ఇది శాస్త్రీయంగా కూడా నిరూపితమైంది. ఇందులో కాల్షియం, ఐరన్ 90 శాతం ఉంటుంది. అలాగే గుడ్డులో ఉండే పచ్చసోన, తెల్లటి పోరలో అత్యధికంగా ప్రోటీన్ శాతం ఉంటుంది. అందుకే గుడ్లను పోషకాహర నిధిగా పిలుస్తారు. ఇలా ఎన్నో రకాల పోషకాలు కలిగిన చవకైనది ఎగ్ మాత్రమే. కొంతమంది ఉడకబెట్టిన గుడ్లను తినడానికి ఇష్టపడతారు. మరికొంత మంది ఎగ్ పుడ్డింగ్ చేసి తింటారు. అదే సమయంలో, కొంతమంది బ్రెడ్‌తో ఆమ్లెట్ తినడానికి ఇష్టపడతారు. గుడ్డు ప్రోటీన్ల నిధి అని పెద్దలు చెబుతారు.
ఉడికించిన కోడిగుడ్డు నుంచి మన శరీరానికి అందే పోషకాల శాతం ఎంతో మీకు తెలుసా?
* ఫోలేట్ – 5 శాతం
* సెలీనియం – 22 శాతం
* ఫాస్ఫరస్ – 9 శాతం
* విటమిన్ ఎ – 6 శాతం
* విటమిన్ బి2 – 15 శాతం
* విటమిన్ బి5 – 7 శాతం
* విటమిన్ బి12 – 9 శాతం
అయితే ఇన్ని పోషకాలున్న గుడ్లను వేసవి కాలంలో తినోచ్చా లేదా..?
చాలామందికి ఎండాకాలంలో గుడ్లను తింటే అనారోగ్యానికి గురవుతామనే డౌట్ ఉంటుంది. గుడ్లు వేడిని కలిగిస్తాయని, వీటిని తింటే మొటిమలు, కడుపు రుగ్మతలు వస్తాయని అంటుంటారు. అయితే నిపుణులు… వేసవికాలంలో గుడ్లను మితంగా తినాలని చెబుతున్నారు. గుడ్లు వేడిని ఉత్పత్తి చేసే ధోరణిని కలిగి ఉంటాయి. అతిగా తింటేనే ఇబ్బంది ఉంటుంది. రెండు కంటే ఎక్కువ గుడ్లను తింటేనే ఒంట్లో వేడి ఎక్కువవుతుంది. కాబట్టి ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా ఎంచక్కా రోజుకు రెండు గుడ్లను తినండి. అప్పుడే ఈ ఎండాకాలం ఆరోగ్యంగా ఉంటారు. గుడ్డును ఏ సీజన్ లోనైనా తినొచ్చు కానీ సమ్మర్‌లో తక్కువగా తీసుకోవాలని గుర్తుంచుకోవాలి.
Note: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.