TS Govt Jobs 2022: తెలంగాణ రిక్రూట్‌మెంట్‌ బోర్డుల కీలక నిర్ణయం.. ఆన్‌లైన్‌లో పెట్టనున్న ఒరిజినల్‌ ఓఎంఆర్‌ పత్రాలు!

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో మరింత పారదర్శకత కోసం అభ్యర్థులు జవాబులు నమోదు చేసిన ఒరిజినల్‌ ఓఎంఆర్‌ పత్రాలను ఆన్‌లైన్‌లో పెట్టాలని..

TS Govt Jobs 2022: తెలంగాణ రిక్రూట్‌మెంట్‌ బోర్డుల కీలక నిర్ణయం.. ఆన్‌లైన్‌లో పెట్టనున్న ఒరిజినల్‌ ఓఎంఆర్‌ పత్రాలు!
Omr Sheets
Follow us

|

Updated on: Apr 21, 2022 | 1:40 PM

TSPSC Original OMR Sheets will be available on Online: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో మరింత పారదర్శకత కోసం అభ్యర్థులు జవాబులు నమోదు చేసిన ఒరిజినల్‌ ఓఎంఆర్‌ పత్రాలను ఆన్‌లైన్‌లో పెట్టాలని నియామక సంస్థలు నిర్ణయించాయి. గతంలో కొన్ని పోస్టుల భర్తీ సందర్భంలో ఈ ప్రయత్నం చేసినప్పటికీ… ఈసారి 80వేల ఉద్యోగాల భర్తీకి నిర్వహించే అన్నిరకాల పరీక్షలకు తప్పనిసరి చేయనున్నాయి. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ (Group 1 Prelims) సహా గ్రూప్‌-2, 3, 4తో పాటు ఇతర నియామక సంస్థలు నిర్వహించే పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తాము పేర్కొన్న సమాధానాలు ఎన్ని సరైనవో ఆన్‌లైన్‌లో పెట్టే ఒరిజినల్‌ ఓఎంఆర్‌ చూసి తెలుసుకునేందుకు వీలు కలుగనుంది. పోటీ పరీక్షల్లో మల్టిపుల్‌ ఛాయిస్‌ పద్ధతిలో ప్రశ్నలకు సమాధానాలను ఓఎంఆర్‌ షీట్లలో గుర్తించాలి.

ఇప్పటివరకు ఒరిజినల్‌ షీటుకు అనుసంధానంగా కార్బన్‌తో కూడిన నకలు కాపీ ఉంది. అభ్యర్థులు గుర్తించిన సమాధానాలు కార్బన్‌ కారణంగా నకలు కాపీపై నమోదయ్యేవి. ఇన్విజిలేటర్లు ఒరిజినల్‌ ఓఎంఆర్‌ షీటును మూల్యాంకనానికి తీసుకుని, కార్బన్‌ షీటును అభ్యర్థికి ఇచ్చేవారు. పరీక్ష ప్రాథమిక కీ విడుదలైన తరువాత సమాధానాలు, పరీక్షలో నమోదు చేసిన సమాధానాలతో పోల్చుకుని మార్కులపై అంచనాకు వచ్చేవారు. అయితే కొందరు కార్బన్‌ సరిగా ఉంచకపోవడం, పక్కకు జరగడం కారణంగా ఒరిజినల్‌ ఓఎంఆర్‌లో సమాధానం ఏ గా నమోదు చేస్తే.. నకలు కాపీలో బీ లేదా సీ గా నమోదయ్యేది. సమాధానాలు గజిబిజిగా వచ్చేవి. దీంతో కీ విడుదల చేసినపుడు కొందరు అభ్యర్థుల్లో మార్కుల అంచనాపై గందరగోళం ఏర్పడేది. ఈ అడ్డంకులను అధిగమించేందుకు అభ్యర్థుల ఒరిజినల్‌ ఓఎంఆర్‌ షీట్‌ను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని టీఎస్‌పీఎస్సీతో సహా నియామక సంస్థలు నిర్ణయించాయి. దీంతో పరీక్షల్లో అభ్యర్థులు సాధించే మార్కులపై స్పష్టత వస్తుందని అంచనా వేస్తున్నాయి.

Also Read:

GGH Kadapa Recruitment 2022: టెన్త్‌/ఇంటర్‌ అర్హతతో.. కడప జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు.. అకడమిక్ మెరిట్ ద్వారా…

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన