GGH Kadapa Recruitment 2022: టెన్త్‌/ఇంటర్‌ అర్హతతో.. కడప జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు.. అకడమిక్ మెరిట్ ద్వారా..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన కడప జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ కార్యాలయం ఒప్పంద/ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన మెడికల్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి..

GGH Kadapa Recruitment 2022: టెన్త్‌/ఇంటర్‌ అర్హతతో.. కడప జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు.. అకడమిక్ మెరిట్ ద్వారా..
ACSR
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 21, 2022 | 1:43 PM

Kadapa Govt General Hospital Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన కడప జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ కార్యాలయం ఒప్పంద/ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన మెడికల్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 12

పోస్టుల వివరాలు:

  • డీఆర్‌ఏ పోస్టులు: 3
  • ల్యాబ్‌ అటెండెంట్‌ పోస్టులు: 3
  • రేడియోలాజికల్‌ ఫిజిసిస్ట్‌ పోస్టులు: 1
  • ఫిజిసిస్ట్‌ పోస్టులు: 1
  • ఆప్టోమెట్రిస్ట్‌ పోస్టులు: 1
  • ఎంఎన్‌ఓ పోస్టులు: 1

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.12,000ల నుంచి రూ.37,100ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి టెన్త్‌, ఇంటర్‌, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎమ్మెస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌, అనుభవం ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: ప్రభుత్వ సర్వజన వైద్యశాల, కడప. ఏపీ.

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 23, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Adani Group: రూ.10,000 కోట్ల పెట్టుబడిని ప్రకటించిన అదానీ గ్రూప్! 25,000 ఉద్యోగావకాశాలు..