Adani Group: రూ.10,000 కోట్ల పెట్టుబడిని ప్రకటించిన అదానీ గ్రూప్! 25,000 ఉద్యోగావకాశాలు..
దేశంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాధినేత గౌతమ్ అదానీ (Gautam Adani) మరో భారీ పెట్టుబడిని ప్రకటించారు. రానున్న 10 ఏళ్లలో వివిధ రంగాల్లో సుమారు రూ.10,000 కోట్ల పెట్టుబడి..
Adani Group to invest ₹10,000 crores in Bengal: దేశంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాధినేత గౌతమ్ అదానీ (Gautam Adani) మరో భారీ పెట్టుబడిని ప్రకటించారు. రానున్న 10 ఏళ్లలో వివిధ రంగాల్లో సుమారు రూ.10,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలియజేశారు. అదానీ గ్రూప్ ఇంత పెద్ద పెట్టుబడిని ప్రకటించడం ఇదే తొలిసారి. దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 25,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. బుధవారం (ఏప్రిల్ 20) జరిగిన 6వ బెంగాల్ (west Bengal) గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ 2022 (BGBS)లో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రపంచ స్థాయి పోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, అత్యాధునిక డేటా సెంటర్లు, అండర్ సీ కేబుల్స్, డిజిటల్ ఇన్నోవేషన్‌లో ఎక్సలెన్స్ సెంటర్లు, వేర్‌హౌస్‌లు, లాజిస్టిక్స్ పార్కుల్లో తమ గ్రూప్ పెట్టుబడులు పెట్టనుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
కాగా గౌతం అదానీ తొలిసారిగా ఈ సమ్మిట్‌కు హాజరయ్యారు. బెంగాల్‌లోని గ్రీన్ ఎనర్జీ వాల్యూ చైన్‌లో అదానీ గ్రూప్ ప్రపంచ స్థాయి నైపుణ్యాన్ని తీసుకువస్తుందన్నారు. అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు ఇటీవలి కాలంలో శరవేగంగా పుంజుకుంటున్నాయి. దీంతో గత కొద్దికాలంగా అదానీ గ్రూప్ వృద్ధిబాటలో దూసుకుపోతోంది. దీంతో అతిపెద్ద మొత్తంలో పెట్టుబడులను ప్రకటించింది. అంతేకాకుండా స్టాక్ ఎక్స్ఛేంజ్ జాబితాలో ఈ గ్రూప్‌కు సంబంధించిన 7 కంపెనీలు చేరాయి. వాటిల్లో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌తో పాటు అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పవర్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ పోర్ట్, అదానీ విల్మర్ కంపెనీలు ఉన్నాయి.
నిజానికి బెంగాల్‌లో అదానీ గ్రూప్ కంపెనీలు చాలా తక్కువగా ఉన్నాయి. హల్దియాలో ఒక ఎడిబుల్ ఆయిల్ ప్లాంట్ మాత్రమే ఉంది. ఈ ప్లాంట్ అదానీ విల్మర్‌కు చెందింది. బెంగాల్‌లోని తాజ్‌పూర్ ఓడరేవులో అదానీ గ్రూప్ అతిపెద్ద బిడ్డర్. ఐతే ఆ రాష్ట్రం ఇంతవరకు గ్రూప్ పేరును ఎల్1 బిడ్డర్‌గా ప్రకటించలేదు. అదానీ గ్రూప్ వృద్ధి ఇటీవలి నెలల్లో చాలా వేగంగా ఉంది.
Also Read: