Telangana: నమ్మకంగా ఉంటూ చిన్నారిని చెరబట్టాడు.. బాలికపై వృద్ధుడి అఘాయిత్యం

రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం వారిది. ఉన్న ఊరిలో పనులు లేకపోవడంతో పొట్ట చేతబట్టుకుని పరాయి రాష్ట్రానికి వచ్చారు. కాయాకష్టం చేసుకుని జీవిస్తున్నారు. రైల్వే విద్యుదీకరణ పనులు ఉన్నయాన్న సమాచారంతో పని ప్రదేశానికి....

Telangana: నమ్మకంగా ఉంటూ చిన్నారిని చెరబట్టాడు.. బాలికపై వృద్ధుడి అఘాయిత్యం
Girl Harassment
Follow us

|

Updated on: Apr 21, 2022 | 12:20 PM

రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం వారిది. ఉన్న ఊరిలో పనులు లేకపోవడంతో పొట్ట చేతబట్టుకుని పరాయి రాష్ట్రానికి వచ్చారు. కాయాకష్టం చేసుకుని జీవిస్తున్నారు. రైల్వే విద్యుదీకరణ పనులు ఉన్నయాన్న సమాచారంతో పని ప్రదేశానికి చేరుకున్నారు. స్థానికంగా గుడిసెలు వేసుకుని సమూహంగా నివసిస్తున్నారు. వారికి వంట చేసేందుకు మరో కుటుంబాన్ని నియమించుకున్నారు. అంతే కాకుండా వారి పిల్లలను చూసుకునే బాధ్యతనూ అప్పగించారు. పిల్లలను కంటికి రెప్పలా చూసుకోమని కాపలా పెట్టిన ఆ వ్యక్తే తమ కన్నబిడ్డ పాలిట కీచకుడవుతారని ఊహించలేకపోయారు. తల్లిదండ్రులు పనులకు వెళ్లిన తర్వాత ఎనిమిదేళ్ల బాలికపై ఆ కీచకుడు మృగంలా మారి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తనకి ఏం జరుగుతుందో అర్థం కాని ఆ చిన్నారికి తీవ్ర రక్తస్రావం కావడంతో భయపడి నిందితుడే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అనుమానం వచ్చిన వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.

వనపర్తి జిల్లాలోని మదనాపురం మండలం రామన్‌పాడ్‌ సమీపంలో రైల్వేట్రాక్‌ విద్యుద్దీకరణ పనుల కోసం ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కొందరు వలస వచ్చారు. వీరికి వంట చేసేందుకు పశ్చిమ బెంగాల్‌కు చెందిన షేక్‌ మచ్చాన్‌ కుటుంబాన్ని నియమించుకున్నారు. వీరందరూ మదనాపురం సమీపంలో గుడిసెలు వేసుకున్నారు. పెద్దవాళ్లు పనులకు వెళితే వారి పిల్లలకు మచ్చాన్ కాపలా ఉండేవాడు. ఇదే సమయంలో ఓ బాలిక తల్లిదండ్రులు పనులకు వెళ్లారు. అదనుగా భావించిన మచ్చాన్ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికకు రక్తస్రావమవడంతో మచ్చాన్ భయాందోళనకు గురయ్యాడు. వైద్య చికిత్స కోసం చిన్నారని మదనాపురం పీహెచ్సీకి తీసుకువెళ్లాడు. చిన్నారని పరీక్షించిన వైద్యులు అత్యాచారం జరిగిందని నిర్ధరించారు. మెరుగైన చికిత్స కోసం వనపర్తి జిల్లా ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించారు.

ఘటన ఎలా జరిగిందని వైద్యులు మచ్చాన్ ను ఆరా తీశారు. అతని ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈలోగా మచ్చాన్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టిన పోలీసులు మధ్యాహ్నం రామన్‌పాడ్‌ గ్రామంలో అదుపులోకి తీసుకున్నారు.

Also Read

Russia: తగ్గేదేలే అంటున్న రష్యా.. యుద్ధం మధ్యలో అణ్వాయుధ క్షిపణి ప్రయోగం.. Watch Video

Stock Market: దాలాల్ స్ట్రీల్ లో కొనసాగుతున్న బుల్ జోరు.. లాభాల్లో ప్రధాన సూచీలు..

Wonder Kid: ఏడాదిన్నర వయసులో 400 వస్తువులు పేర్లు చెప్పే వండర్ కిడ్.. సూపర్‌ రికార్డ్‌