AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: పంత్‌ ఆ విషయం మరిచిపోయి ఆడాలి.. అప్పుడే జట్టు బాగా రాణిస్తుంది.. ఇండియన్‌ మాజీ కోచ్‌ కామెంట్స్‌..!

IPL 2022: IPLలో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది. జట్టు 8వ స్థానంలో కొనసాగుతోంది. ఐదు మ్యాచ్‌ల్లో 2 గెలిచి 3 ఓడిపోయింది. ఢిల్లీ

IPL 2022: పంత్‌ ఆ విషయం మరిచిపోయి ఆడాలి.. అప్పుడే జట్టు బాగా రాణిస్తుంది.. ఇండియన్‌ మాజీ కోచ్‌ కామెంట్స్‌..!
Rishabh Pant
uppula Raju
|

Updated on: Apr 20, 2022 | 6:48 PM

Share

IPL 2022: IPLలో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది. జట్టు 8వ స్థానంలో కొనసాగుతోంది. ఐదు మ్యాచ్‌ల్లో 2 గెలిచి 3 ఓడిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కూడా ఒత్తిడితో ఆడుతున్నాడు. అయితే ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి .. బాధ్యతల కారణంగానే పంత్ స్వేచ్ఛగా ఆడలేకపోతున్నాడని అభిప్రాయపడుతున్నాడు. స్టార్ స్పోర్ట్స్‌తో జరిగిన సంభాషణలో రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘కెప్టెన్ రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్‌లో స్వేచ్ఛగా ఆడాలని కోరుకుంటున్నాను. అతను కెప్టెన్ అనే విషయం మరిచిపోవాలి. తన సహజసిద్దమైన ఆటతీరుని కనబర్చాలి. అందుకే ఇతర ఆటగాళ్లకు కూడా కొన్ని బాధ్యతలు ఇవ్వాలి. పంత్ బాగా ఆడితే అతని కెప్టెన్సీ కూడా బాగా కనిపిస్తుంది. ఫలితంగా మీరు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఫలితాల్లో మార్పును చూస్తారు’.

పంత్ బ్యాటింగ్‌లో ఎలాంటి ఇబ్బంది లేదని రవిశాస్త్రి అన్నాడు. శాస్త్రి మాట్లాడుతూ ‘పంత్ బ్యాటింగ్‌ తీరులో ఎటువంటి ఇబ్బంది లేదని నేను అనుకుంటున్నాను. అతని ఆలోచనలో మార్పు రావాలని నేను భావిస్తున్నాను. పంత్ కొంత సమయం తీసుకోవాలి. ఆపై స్వేచ్ఛగా ఆడాలి’ ఈ సీజన్‌లో పంత్ బ్యాటింగ్ గణాంకాలు అంత చెడ్డగా ఏమిలేవు. ఈ ఆటగాడు ఐదు మ్యాచ్‌ల్లో 36 సగటుతో 144 పరుగులు చేశాడు. పంత్ స్ట్రైక్ రేట్ 146 కంటే ఎక్కువ. అయితే పంత్ దీని కంటే మెరుగైన ప్రదర్శన ఇస్తాడని అందరు భావిస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు సమస్య ఏంటంటే మిడిల్ ఆర్డర్ సరిగ్గా ఆడలేకపోవడం. ముఖ్యంగా రోవ్‌మన్ పావెల్ ఘోరంగా ఫ్లాప్ అయ్యాడు. పావెల్ ఐదు మ్యాచ్‌ల్లో 31 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

Portable AC: పోర్టబుల్‌ ఏసీ వచ్చేసింది.. గదిలో ఎక్కడైనా పెట్టొచ్చు.. ధర కూడా తక్కువే..!

Good News: అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకి శుభవార్త.. ఆ సమయం భారీగా తగ్గించింది..

Steinway Tower: ప్రపంచంలో ఎత్తైన సన్నగా ఉండే బిల్డింగ్‌ ఇదే.. గాలి బలంగా వీస్తే ఎలా ఉంటుందంటే..!