DC vs PBKS Highlights, IPL 2022: పంజాబ్‌పై ఢిల్లీ ఘన విజయం
Delhi Capitals vs Punjab Kings Highlights: పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు కేవలం 115 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఢిల్లీ ముందు 116 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. మయాంక్ అగర్వాల్ 24, జితేష్ శర్మ 32 పరుగులతో కాస్త ఫర్వాలేదనిపించారు.
DC vs PBKS, IPL 2022: పంజాబ్‌పై ఢిల్లీ సూపర్ విక్టరీ సాధించింది. పంజాబ్ నిర్దేశించిన 115 పరుగుల లక్ష్యాన్ని 10.3 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి సాధించింది. ఢిల్లీ ఓపెనర్లుగా వచ్చిన పృధ్వీషా, డేవిడ్ వార్నర్ పంజాబ్ బౌలర్లకి చుక్కలు చూపించారు. ముఖ్యంగా డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు. 30 బంతుల్లో 60 (10 ఫోర్లు 1 సిక్సర్) పరుగులు చేశాడు. ఫృధ్వీషా 20 బంతుల్లో 41 (7 ఫోర్లు 1 సిక్స్) పరుగులు చేసి చాహర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. సర్పరాజ్ ఖాన్ 12 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్‌కి ఒక వికెట్ దక్కింది. అంతకుముందు పంజాబ్ టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించింది. స్వల్ప స్కోరుకే కుప్పకూలింది. నిర్ణీత 20 ఓవర్లలో 115 పరుగులకు ఆలౌటైంది.జితేశ్ శర్మ (32), మయాంక్ అగర్వాల్ (24), షారుఖ్ ఖాన్ (12) మినహా ఎవరూ రెండంకెల స్కోరు చేయలేదు. దిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 2, అక్షర్ 2, కుల్‌దీప్ 2, లలిత్ యాదవ్ 2, ముస్తాఫిజర్ చెరో వికెట్ తీశారు. దీంతో పాయింట్ల పట్టికలో దిల్లీ (6) ఆరో స్థానానికి ఎగబాకింది.
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (కీపర్), షారుక్ ఖాన్, కగిసో రబాడ, నాథన్ ఎల్లిస్, రాహుల్ చాహర్, వైభవ్ అరోరా, అర్ష్‌దీప్ సింగ్
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, రిషబ్ పంత్ (కీపర్/కెప్టెన్), రోవ్‌మన్ పావెల్, లలిత్ యాదవ్, సర్ఫరాజ్ ఖాన్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహమాన్, ఖలీల్ అహ్మద్
Key Events
ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటి వరకు పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఐదు మ్యాచ్‌లు ఆడిప ఢిల్లీ టీం.. కేవలం రెండింటిలో మాత్రమే గెలిచింది.
పంజాబ్ కింగ్స్‌కు ఈ సీజన్‌లో నాలుగో విజయం అవసరం. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన పంజాబ్, మూడు మాత్రమే గెలిచింది.
LIVE Cricket Score & Updates
-
పంజాబ్‌పై ఢిల్లీ ఘన విజయం
పంజాబ్‌పై ఢిల్లీ ఘన విజయం సాధించింది. పంజాబ్ నిర్దేశించిన 115 పరుగుల లక్ష్యాన్ని కేవలం ఒక వికెట్ కోల్పోయి 10.3 ఓవర్లలో సాధించింది. పృధ్వీషా 41 పరుగులు చేసి ఔటయ్యాడు. డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీతో (30 బంతుల్లో 10 ఫోర్లు 1 సిక్సర్) 60 పరుగులు చేశాడు. సర్పరాజ్ ఖాన్ 12 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్‌కి ఒక వికెట్ దక్కింది.
-
డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీ
డేవిడ్ వార్నర్ హాప్ సెంచరీ సాధించాడు. 26 బంతుల్లో 9 ఫోర్ల 1 సిక్సర్ సహాయంతో 54 పరుగులు చేశాడు. దీంతో ఢిల్లీ ఒక వికెట్ కోల్పోయి 109 పరుగులు సాధించింది. విజయానికి ఇంకా 63 బంతుల్లో 7 పరుగులు చేయాల్సి ఉంది.
-
-
100 పరుగులు దాటిన ఢిల్లీ
ఢిల్లీ 8.5 ఓవర్లలో 100 పరుగులు దాటింది. క్రీజులో డేవిడ్ వార్నర్ 45 పరుగులు, సర్పరాజ్ ఖాన్ 9 పరుగులతో ఆడుతున్నారు. విజయానికి ఇంకా 66 బంతుల్లో 12 పరుగులు చేయాల్సి ఉంది. రాహుల్ చాహర్‌కి ఒక వికెట్ దక్కింది.
-
మొదటి వికెట్ కోల్పోయిన ఢిల్లీ
ఢిల్లీ మొదటి వికెట్ కోల్పోయింది. ఫృధ్వీషా 41 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. రాహుల్ చాహర్ బౌలింగ్‌లో నాధన్ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. దీంతో ఢిల్లీ వికెట్ నష్టపోకుండా 83 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 79 బంతుల్లో 33 పరుగులు చేయాల్సి ఉంది.
-
5 ఓవర్లకు ఢిల్లీ స్కోర్..
5 ఓవర్లు పూర్తయ్యే సరికి ఢిల్లీ టీం 75 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ 36, షా 35 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఢిల్లీ విజయం సాధించాలంటే మరో 41 పరుగలు చేయాల్సి ఉంది.
-
-
3 ఓవర్లకు ఢిల్లీ స్కోర్..
3 ఓవర్లు పూర్తయ్యే సరికి ఢిల్లీ టీం 43 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ 16, షా 26 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఢిల్లీ విజయం సాధించాలంటే మరో 73 పరుగలు చేయాల్సి ఉంది.
-
IPL 2022లో అత్యల్ప స్కోర్లు..
115 పంజాబ్ vs ఢిల్లీ, బ్రబౌర్న్
126 చెన్నై vs పంజాబ్, బ్రబౌర్న్
128 కోల్‌కతా vs బెంగళూర్, DY పాటిల్
131/5 చెన్నై vs కోల్‌కతా, వాంఖడే
-
ఢిల్లీ టార్గెట్ 116
పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు కేవలం 115 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఢిల్లీ ముందు 116 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. మయాంక్ అగర్వాల్ 24, జితేష్ శర్మ 32 పరుగులతో కాస్త ఫర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్స్ క్రీజులోకి అలా వచ్చి ఇలా పెవిలియన్ చేరుకోవడంతో పంజాబ్ తక్కువ స్కోర్‌కే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, ఖలీల్ అద్భుతంగా బౌలింగ్ చేసి తలో 2 వికెట్లు పడగొట్టారు.
-
19 ఓవర్లకు పంజాబ్ స్కోర్..
19 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ టీం 9 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది. అర్షదీప్ సింగ్ 5, వైభవ్ అరోరా 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.
-
8వ వికెట్ కోల్పోయిన పంజాబ్..
షారుక్ ఖాన్ (12) రూపంలో పంజాబ్ కింగ్స్ 8వ వికెట్‌ను కోల్పోయింది. ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో కీపర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 14.3 ఓవర్లకు పంజాబ్ టీం 8 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది.
-
ఏడో వికెట్ కోల్పోయిన పంజాబ్..
నాథన్ ఎల్లీస్ (0) రూపంలో పంజాబ్ కింగ్స్ ఏడో వికెట్‌ను కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. కాగా, ఈ ఓవర్లో కుల్దీప్ వెంటవెంటనే రెండు వికెట్లను పడగొట్టాడు. దీంతో 14 ఓవర్లకు పంజాబ్ టీం 7 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది.
-
ఆరో వికెట్ కోల్పోయిన పంజాబ్..
రబాడ (2) రూపంలో పంజాబ్ కింగ్స్ ఆరో వికెట్‌ను కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. దీంతో 13.4 ఓవర్లకు పంజాబ్ టీం 6 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది.
-
ఐదో వికెట్ కోల్పోయిన పంజాబ్..
జితేష్ శర్మ (32 పరుగులు, 23 బంతులు, 5 ఫోర్లు) రూపంలో పంజాబ్ కింగ్స్ ఐదో వికెట్‌ను కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియన్ చేరాడు. దీంతో 12.1 ఓవర్లకు పంజాబ్ టీం 5 వికెట్లు కోల్పోయి 85 పరుగులు చేసింది.
-
9 ఓవర్లకు పంజాబ్ స్కోర్..
9 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ టీం 4 వికెట్లు కోల్పోయి 69 పరుగులు చేసింది. షారుక్ ఖాన్ 1, జితేష్ శర్మ 22 పరుగులతో క్రీజులో ఉన్నారు.
-
నాలుగో వికెట్ కోల్పోయిన పంజాబ్..
బెయిర్ స్టో (9) రూపంలో పంజాబ్ కింగ్స్ నాలుగో వికెట్‌ను కోల్పోయింది. ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో ముస్తాఫిజుర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 6.4 ఓవర్లకు పంజాబ్ టీం 4 వికెట్లు కోల్పోయి 54 పరుగులు చేసింది.
-
మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్..
లివింగ్‌స్టోన్ (2) రూపంలో పంజాబ్ కింగ్స్ మూడో వికెట్‌ను కోల్పోయింది. అక్షర్ పటేల్ కీపర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 6 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ టీం మూడు వికెట్లు కోల్పోయి 47 పరుగులు చేసింది.
-
పెవిలియన్ చేరిన పంజాబ్ సారథి..
మయాంక్ అగర్వాల్ (24 పరుగులు, 15 బంతులు, 4 ఫోర్లు) రూపంలో పంజాబ్ కింగ్స్ రెండో వికెట్‌ను కోల్పోయింది. ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. దీంతో 4.3 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ టీం రెండు వికెట్లు కోల్పోయి 35 పరుగులు చేసింది.
-
తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్..
ధావన్(9) రూపంలో పంజాబ్ కింగ్స్ తొలి వికెట్‌ను కోల్పోయింది. లలిత్ యాదవ్ బౌలింగ్‌లో కీపర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి ధావన్ పెలివియన్ చేరాడు. దీంతో 4 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ టీం ఒక వికెట్ కోల్పోయి 33 పరుగులు చేసింది.
-
2 ఓవర్లకు పంజాబ్ స్కోర్..
2 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ టీం వికెట్ కోల్పోకుండా 13 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ 9, శిఖర్ ధావన్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇన్నింగ్స్‌ను ధాటిగానే ప్రారంభించారు.
-
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, రిషబ్ పంత్ (కీపర్/కెప్టెన్), రోవ్‌మన్ పావెల్, లలిత్ యాదవ్, సర్ఫరాజ్ ఖాన్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహమాన్, ఖలీల్ అహ్మద్
-
పంజాబ్ కింగ్స్ జట్టు..
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (కీపర్), షారుక్ ఖాన్, కగిసో రబాడ, నాథన్ ఎల్లిస్, రాహుల్ చాహర్, వైభవ్ అరోరా, అర్ష్‌దీప్ సింగ్
-
టాస్ గెలిచిన రిషబ్ పంత్..
కీలక మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టీం టాస్ గెలిచి, బౌలింగ్ ఎంచుకుంది. దీంతో పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
-
Delhi vs Punjab Live Score: పాయింట్ల పట్టికలో రెండు జట్ల స్థానం
ఐపీఎల్ 2022 పాయింట్ల పట్టికలో ఇరు జట్ల స్థానం చూస్తే, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఎనిమిదో స్థానంలో ఉండగా, పంజాబ్ కింగ్స్ ఏడో స్థానంలో నిలిచింది.
-
Delhi vs Punjab Live Score: రెండు జట్లు సిద్ధం..
కోవిడ్ కేసుల తర్వాత కూడా ఈ మ్యాచ్‌కు ఇరు జట్లు సిద్ధమయ్యాయి. ఈ సమయంలో ఇరు జట్లు మైదానానికి చేరుకున్నాయి. దీంతో మ్యాచ్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది.
-
Delhi vs Punjab Live Score: కోవిడ్ నీడలో నేటి మ్యాచ్..
IPL 2022లో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. కోవిడ్ నీడలో ఈ మ్యాచ్ జరగనుంది. మంగళవారం ఢిల్లీ క్యాంపులో కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ రోజు కూడా ఒక ఆటగాడు పాజిటివ్‌గా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వీటన్నింటి నడుమ నేటి మ్యాచ్‌ను ఎలా నిర్వహిస్తారో చూడాలి.
Published On - Apr 20,2022 6:48 PM