IPL 2022: ఢిల్లీ క్యాపిటల్స్‌లో మరింత పెరిగిన ఆందోళన.. మరో ఆటగాడికి కోవిడ్ పాజిటివ్.. మ్యాచ్ జరిగేనా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022) 32వ మ్యాచ్ జరుగుతుందా లేదా? కారణం.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన మరో ఆటగాడు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఈ ప్రశ్న ప్రస్తుతం ప్రతి అభిమాని మనస్సులో నెలకొంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022) 32వ మ్యాచ్ జరుగుతుందా లేదా? కారణం.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన మరో ఆటగాడు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఈ ప్రశ్న ప్రస్తుతం ప్రతి అభిమాని మనస్సులో నెలకొంది. మీడియా నివేదికల ప్రకారం, ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన మరో విదేశీ ఆటగాడు కరోనా బారిన పడ్డాడు. మంగళవారం ఇతర ఆటగాళ్లతో శిక్షణ పొందిన టిమ్ సీఫెర్ట్ కరోనా పాజిటివ్‌గా తెలినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ (DC vs PBKS) మధ్య మ్యాచ్ ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు టిమ్ సీఫెర్ట్ కోవిడ్ నివేదిక సానుకూలంగా రావడం ఆందోళన కలిగిస్తోంది. బుధవారం మధ్యాహ్నం, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లను ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేశారు.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం, మరో విదేశీ ఆటగాడు కోవిడ్ పాజిటివ్‌గా తేలిన తర్వాత, ఢిల్లీ క్యాపిటల్స్‌లోని ఆటగాళ్లందరినీ హోటల్ గదిలోనే ఉంచమని బీసీసీఐ కోరింది. ఈ టీమ్‌లోని ఆటగాళ్లందరికీ బీసీసీఐ ఆర్టీ-పీసీఆర్ పరీక్ష నిర్వహిస్తుంది. ప్రతి క్రీడాకారుడి గదికి వెళ్లి వారి నమూనా తీసుకోంటున్నారు. RT-PCR నివేదిక ప్రతికూలంగా ఉన్న ఆటగాళ్లను మాత్రమే ప్లేయింగ్ XIలో ఢిల్లీ చేర్చుకోనుంది.
ఢిల్లీ క్యాపిటల్స్‌లో ఆరుగురికి కరోనా..
ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన ఆరుగురు ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. ఫిజియో పాట్రిక్ ఫర్‌హార్ట్‌కు మొదట కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆ తర్వాత సహాయక సిబ్బందిలోని ఇతర సభ్యులు కూడా దాని బారిన పడ్డారు. ఇందులో టీమ్‌లోని మసాజ్ స్పెషలిస్ట్, డాక్టర్ కూడా ఉన్నారు. ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ కూడా కరోనా కారణంగా ఆసుపత్రిలో చేరాడు. ఢిల్లీ జట్టులో కరోనా దాడి తర్వాత, BCCI ఈ మ్యాచ్ వేదికను మార్చిని సంగతి తెలిసిందే. ముందుగా ఈ మ్యాచ్ పుణెలోని ఎంసీఏ స్టేడియంలో జరగాల్సి ఉండగా, దానిని బ్రబౌర్న్ స్టేడియంకు మార్చారు. ఇప్పుడు మ్యాచ్‌కు ముందు, మరోసారి ఢిల్లీకి చెందిన మరో ఆటగాడికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. కాగా, నివేదికల ప్రకారం ఈ మ్యాచ్ కొనసాగుతుందని బీసీసీఐ స్పష్టం చేసింది. ఆరోగ్యంగా ఉన్న ఆటగాళ్లు మ్యాచ్ ఆడేందుకు బరిలోకి దిగనున్నారు.
ఢిల్లీ, పంజాబ్‌లకు కీలక మ్యాచ్..
ఈ మ్యాచ్ ఢిల్లీ, పంజాబ్ కింగ్స్‌కు ఎంతో కీలకం. టోర్నీలో శుభారంభం తర్వాత ఇరు జట్లు తడబడ్డాయి. పంజాబ్ కింగ్స్ 6 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 3 ఓటములతో 7వ స్థానంలో ఉండగా, ఢిల్లీ క్యాపిటల్స్ 2 విజయాలు, 3 ఓటములతో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది.
IPL 2022: ముంబై జట్టులో చేరనున్న అన్‌సోల్డ్ బౌలర్.. జాతకం మార్చేస్తాడంటోన్న రోహిత్.. ఆయనెవరంటే?