ఎండాకాలం చుండ్రు, దురదతో విసిగిపోతున్నారా ?? అయితే ఇలా చేయండి !!

ఎండాకాలం చుండ్రు, దురదతో విసిగిపోతున్నారా ?? అయితే ఇలా చేయండి !!

Phani CH

|

Updated on: Apr 21, 2022 | 8:15 AM

వేసవిలో పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ప్రోటీన్, విటమిన్ B7 పుష్కలంగా ఉంటాయి. పెరుగు జుట్టుకి చాలా మేలు చేస్తుంది.

వేసవిలో పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ప్రోటీన్, విటమిన్ B7 పుష్కలంగా ఉంటాయి. పెరుగు జుట్టుకి చాలా మేలు చేస్తుంది. దీనిని వెంట్రుకలకు అప్లై చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా, మృదువుగా తయారవుతుంది. అంతేకాదు. పెరుగులో ఉండే విటమిన్లు, కొవ్వు ఆమ్లాలు చుండ్రు, దురదలను తొలగిస్తాయి. పెరుగు సహజ కండీషనర్‌గా పనిచేస్తుంది. అందుకే వారానికి రెండుసార్లు పెరుగును తప్పనిసరిగా జుట్టుకి అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఆలివ్ నూనె, తేనె కూడా జుట్టుకు మేలు చేస్తాయి. తేనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, మాయిశ్చరైజింగ్ లక్షణాలు ఉంటాయి. ఇవి జుట్టుని పొడిబారకుండా చేస్తాయి. ఇందుకోసం మీరు అరకప్పు పెరుగు తీసుకుని అందులో 3 చెంచాల తేనె, 2 స్పూన్ల ఆలివ్ ఆయిల్ కలిపి, ఈ మిశ్రమాన్ని జుట్టుకి అప్లై చేయాలి. అరగంట పాటు అలాగే ఉంచాలి. తర్వాత తేలికపాటి షాంపూతో కడగాలి.

Also Watch:

మొద‌టిసారి డ్రాగ‌న్ ఫ్రూట్ తిన్న పిల్లకోతి రియాక్షన్‌ !! నెట్టింట నవ్వులే నవ్వులు !!

సంగీత్‌ ఫంక్షన్‌లో డాన్స్‌ అదరగొట్టిన నవ వధువు !! స్టెప్పులకు నెటిజన్లు ఫిదా