మొద‌టిసారి డ్రాగ‌న్ ఫ్రూట్ తిన్న పిల్లకోతి రియాక్షన్‌ !! నెట్టింట నవ్వులే నవ్వులు !!

Phani CH

Phani CH |

Updated on: Apr 21, 2022 | 8:13 AM

సోష‌ల్‌మీడియాలో జంతువుల వీడియోల‌కు సంబంధించిన వీడియోలను చాలామంది ఇష్టపడతారు. అందులో ఏదైనా ఆసక్తికరమైన విషయం ఉంటే వెంటనే షేర్‌ చేస్తారు.

సోష‌ల్‌మీడియాలో జంతువుల వీడియోల‌కు సంబంధించిన వీడియోలను చాలామంది ఇష్టపడతారు. అందులో ఏదైనా ఆసక్తికరమైన విషయం ఉంటే వెంటనే షేర్‌ చేస్తారు. ఆ థ్రిల్‌ని అందరితో పంచుకుంటారు. తాజాగా, ఓ కోతిపిల్ల వీడియో నెట్టింట చ‌క్కర్లు కొడుతోంది. మొద‌టిసారి డ్రాగ‌న్ ఫ్రూట్ తిన్న కోతిపిల్ల ఇచ్చిన ఎక్స్‌ప్రెష‌న్స్ నెటిజ‌న్లను క‌ట్టిప‌డేస్తుంది. ఈ వీడియోలో ఓ బుల్లి కోతి నేల‌పై కూర్చుని ఉంది. దానికి ఓ వ్యక్తి డ్రాగ‌న్ ఫ్రూట్ క‌ట్‌చేసి ఇచ్చాడు. మొద‌ట అది ఎలా తినాలో తెలియ‌క కోతిపిల్ల అయోమ‌యంగా చూస్తుంది. అంతలో ఆ వ్యక్తి ఒక ముక్క తీసుకొని తిని చూపిస్తాడు. ఆతర్వాత కోతిపిల్లకు తినిపిస్తాడు. తర్వాత ఆ కోతి పిల్ల పండు తీసుకుని తింటూ రకరకాల ఎక్స్‌ప్రెషన్స్‌ ఇస్తుంది. ఈ వీడియోను ఓ యూజ‌ర్ ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ వీడియోను వీక్షిస్తున్న మిలియ‌న్ల మంది లైక్‌లతో, సరదా కామెంట్లతో హోరెత్తించారు.

Also Watch:

సంగీత్‌ ఫంక్షన్‌లో డాన్స్‌ అదరగొట్టిన నవ వధువు !! స్టెప్పులకు నెటిజన్లు ఫిదా

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu