AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: బీచ్‌లో సరదాగా ఎంజాయ్ చేస్తున్న జనాలు.. ఒక్కసారిగా కుప్పకూలిన విమానం..!

Viral Video: సోషల్‌మీడియాలో ప్రతిరోజు చాలా వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. ఈ వీడియోలని నెటిజన్లు బాగా ఎంజాయ్ చేస్తారు.

Viral Video: బీచ్‌లో సరదాగా ఎంజాయ్ చేస్తున్న జనాలు.. ఒక్కసారిగా కుప్పకూలిన విమానం..!
Plane Crashed
uppula Raju
|

Updated on: Apr 22, 2022 | 6:23 PM

Share

Viral Video: సోషల్‌మీడియాలో ప్రతిరోజు చాలా వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. ఈ వీడియోలని నెటిజన్లు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇందులో రకరకాల వీడియోలు ఉంటాయి. అయితే ప్రమాదాలకి సంబంధించిన వీడియోలని నెటిజన్లు ఎక్కువగా చూస్తారు. లైక్స్‌, షేర్స్‌, కామెంట్స్‌ చేస్తారు. ఇలాంటి వీడియోలు తక్కువ వ్యవధిలోనే వైరల్‌గా మారుతుంటాయి. సముద్రంలో విమానం కూలిపోయిన వీడియో ఒకటి నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. ఇది పాత వీడియో అయినప్పటికీ సోషల్‌ మీడియాలో మళ్లీ వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ విమానం ఎలా కూలిపోయిందో తెలుసుకుందాం.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో కొంతమంది జనాలు బీచ్‌లో సరదాగా గడపడం మనం చూడవచ్చు. ఇంతలో ఒక జెట్‌ విమానం తక్కువ ఎత్తులో ఎగురుకుంటు వచ్చి జనాలకి సమీపంలో కూలిపోవడం మనం వీడియోలో గమనించవచ్చు. అనుకోని సంఘటనతో అక్కడున్న జనాలు ఒక్కసారిగా ఉలిక్కిపడుతారు. విమానం కూలిపోవడంతో భయంతో పరుగులు తీస్తారు. ఈ ఘటనలో ప్రాణనష్టం ఏమైన జరిగిందా అనేది తెలియలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియో ఓషన్‌హోలిక్ లైఫ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ చేశారు. దీనికి లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి. చాలా మంది దీనిపై వ్యాఖ్యానించారు. ఒక నెటిజన్‌ ఇది భయంకరమైన ప్రమాదం అన్నారు. మరొకరు ఆ వీడియో చూసి షాక్ అయ్యానని చెప్పాడు. మీరు కూడా ఈ వీడియో చూసినట్లయితే మీ కామెంట్‌ తెలియజేయండి.

మరిన్ని వైరల్‌ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

BEL Recruitment 2022: డిప్లొమా, ఐటీఐ చేసినవారికి సువర్ణవకాశం.. ఇంకా 8 రోజులే మిగిలి ఉన్నాయి..!

Health News: ఈ భయంకరమైన వ్యాధికి వ్యాక్సిన్‌ వచ్చి100 ఏళ్లు దాటింది.. అయినా టెన్షన్ టెన్షన్..!

Health News: మీలో ఈ లక్షణాలుంటే కిడ్నీలు డేంజర్‌లో ఉన్నట్లే.. కచ్చితంగా తెలుసుకోండి..!