Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bharat Ratna: నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్..!

తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుకు భారతరత్న పురస్కారాన్ని ఇవ్వాలన్న డిమాండ్ తెలుగు రాష్ట్రాల నుంచి చాలా ఏళ్లుగా ఉంది. ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ కీలక భాగస్వామ్యపక్షంగా ఉన్నందునే.. ఎన్టీఆర్‌కు భారతరత్న దక్కే అవకాశాలు ఎక్కువగా ఉందన్న ప్రచారం జరుగుతోంది. తాజాగా బీహార్ సీఎం నితీష్ కుమార్, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్‌కు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ కూడా తెరమీదకు వచ్చింది.

Bharat Ratna: నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్..!
Nitish Kumar And Naveen Patnaik
Follow us
Janardhan Veluru

|

Updated on: Dec 25, 2024 | 10:11 PM

దేశ అత్యున్నత పౌరపురస్కారం భారత రత్న కోసం కొత్త పేర్లు తెరమీదకు వస్తున్నాయి. తెలుగు దేశం పార్టీ (టీడీపీ) వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుకు భారత రత్న ఇవ్వాలన్న డిమాండ్ తెలుగు రాష్ట్రాల నుంచి చాలా ఏళ్లుగా ఉన్నదే. ఇటీవల జరిగిన ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఎన్టీఆర్‌కు భారత రత్న సాధిస్తామని అన్నారు. ఎన్డీయే సర్కారులో టీడీపీ కీలక భాగస్వామి కావడంతో ఎన్టీఆర్‌కు భారత రత్న దక్కే అవకాశాలున్నాయన్న ప్రచారం జోరుగానే సాగుతోంది.

తాజాగా భారత రత్న పురస్కారం కోసం మరికొందరు పేర్లు తెరమీదకు వస్తున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌లకు భారతరత్న ఇవ్వాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం తన సొంత నియోజకవర్గం బెగుసరాయ్‌లో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ.. బిహార్ రాష్ట్రాభివృద్ధి కోసం నితీష్ కుమార్ ఎంతో శ్రమిస్తున్నారని అన్నారు. గతంలో బీహార్‌ను జంగిల్ రాజ్ అనేవారని.. ఆ పరిస్థితిని నితీష్ పూర్తిగా మార్చేశారని కొనియాడారు. అలాగే ఒడిశా మాజీ సీఎం, బీజూ జనతా దళ్ (బీజేడీ) అధినేత నవీన్ పట్నాయక్ సైతం ఎన్నో ఏళ్లుగా ఒడిశా అభివృద్ధి కోసం పాటు పడ్డారని కొనియాడారు. వారిద్దరికీ భారతరత్న పురస్కారంతో సముచితంగా గౌరవించాలని కోరారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలతో భారత రత్న పురస్కారానికి ఎవరిని ఎంపిక చేయాలన్న అంశంపై రాజకీయ వర్గాల్లో మళ్లీ చర్చ మొదలయ్యింది.

మరో ఏడాది కాలం.. అంటే 2025 నవంబర్‌లో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జేడీయు అధినేత నితీశ్ కుమార్‌కు భారత రత్న పురస్కారాన్ని ఇవ్వాలని స్వయంగా ఓ కేంద్ర మంత్రి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం ఆసక్తికరంగా మారింది. బీహార్ రాజకీయ వర్గాల్లోనూ ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. రానున్న బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ నేతృత్వంలో ఎన్డీయే మళ్లీ విజయం సాధించి అధికారంలోకి వస్తుందని గిరిరాజ్ ధీమా వ్యక్తంచేశారు.

వాలంటైన్స్ డే కానుకగా సుఖేష్ జాక్వెలిన్‌కు ఏమిచ్చాడో తెలుసా?
వాలంటైన్స్ డే కానుకగా సుఖేష్ జాక్వెలిన్‌కు ఏమిచ్చాడో తెలుసా?
ఈ వయ్యారి సొగసుకు హంస కూడా పోటీ రాదు.. స్టన్నింగ్ కేతిక..
ఈ వయ్యారి సొగసుకు హంస కూడా పోటీ రాదు.. స్టన్నింగ్ కేతిక..
రామ్ చరణ్ కూతురు క్లింకార ఫేస్ రివీల్..ఎంత క్యూట్‌గా ఉందో? వీడియో
రామ్ చరణ్ కూతురు క్లింకార ఫేస్ రివీల్..ఎంత క్యూట్‌గా ఉందో? వీడియో
వారంలోనే 30 కోట్లు.. రీరిలీజ్‌లో రికార్డులు కొల్లగొడుతోన్న సినిమా
వారంలోనే 30 కోట్లు.. రీరిలీజ్‌లో రికార్డులు కొల్లగొడుతోన్న సినిమా
సొగసులో గులాబీ.. అందం వెన్నెల ఈ కోమలి.. చార్మింగ్ రుక్సార్..
సొగసులో గులాబీ.. అందం వెన్నెల ఈ కోమలి.. చార్మింగ్ రుక్సార్..
ముస్లిం అబ్బాయి- ఆంగ్లో ఇండియన్ అమ్మాయిల అందమైన ప్రేమకథ
ముస్లిం అబ్బాయి- ఆంగ్లో ఇండియన్ అమ్మాయిల అందమైన ప్రేమకథ
తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జ్‌‌గా మీనాక్షి నటరాజన్..
తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జ్‌‌గా మీనాక్షి నటరాజన్..
నెలకు రూ.4,500 ఇన్వెస్ట్ చేస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్
నెలకు రూ.4,500 ఇన్వెస్ట్ చేస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్
ఈ వయ్యారి అందానికి జాబిల్లి ప్రేమలో పడదా.. మెస్మరైజ్ అతుల్య..
ఈ వయ్యారి అందానికి జాబిల్లి ప్రేమలో పడదా.. మెస్మరైజ్ అతుల్య..
స్పెషల్ ఫ్లైట్‌లో జ్యూవెలరీ షాప్ ఓపెనింగ్‌కు మోనాలిసా.. వీడియో
స్పెషల్ ఫ్లైట్‌లో జ్యూవెలరీ షాప్ ఓపెనింగ్‌కు మోనాలిసా.. వీడియో