25 December 2024

స్పెషల్ పాటలకు కేరాఫ్ అడ్రస్.. 5 నిమిషాలకు రూ.2 కోట్లు తీసుకుంటుంది

Rajitha Chanti

Pic credit - Instagram

పాన్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆమె చాలా స్పెషల్. సినిమాపై ఆసక్తితో ఇంట్లో నుంచి పారిపోయి వచ్చి ఇప్పుడు స్టార్ డమ్ అందుకుంది. 

నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టి ఎన్నో అవమానాలు, సవాళ్లను ఎదుర్కోంది. వచ్చిన అవకాశాలు కోల్పోయింది. 

ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి. ఇండస్ట్రీలో స్పెషల్ సాంగ్స్ కేరాఫ్ అడ్రస్‏గా మారింది ఈ ముద్దుగుమ్మ.

హిందీలో ఎన్నో సినిమాల్లో స్పెషల్ పాటలతో అలరించింది. తెలుగులో టెంపర్, బాహుబలి సినిమాలో పలు స్పెషల్ సాంగ్స్ చేసింది. 

కెరీర్ తొలినాళ్లల్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. ఆఫర్స్ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగింది. కెనడా నుంచి 5వేలతో ఇండియా వచ్చింది. 

కేవలం 5 వేలతో ముంబై చేరుకున్న నోరా ఫతేహి.. ఎన్నో సినిమాలకు ఆడిషన్స్ ఇచ్చింది. కానీ అందరూ ఈ బ్యూటీ రిజెక్ట్ చేశారు. 

నోరా ఫతేహి ఇప్పుడు బాలీవుడ్ స్టార్. కేవలం ఒక సినిమాలో 5 నిమిషాల స్పెషల్ సాంగ్ కోసం నోరా ఏకంగా రూ.2 కోట్లు తీసుకుంటుంది. 

అంతేకాదు.. కేవలం రూ.5 వేలతో ఇంట్లో నుంచి పారిపోయిన నోరా ఫతేహి ఇప్పుడు ఆమె ఆస్తులు రూ.50 కోట్లకు చేరుకుంది.