క్రేజీ హీరోయిన్ మీనాక్షి చౌదరి ఏం చదువుకుందో తెలుసా? అసలు ఊహించలేరు

25  December 2024

Basha Shek

ప్రస్తుతం తెలుగులో ది మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అంటే ఠక్కున గుర్తుక వచ్చే పేరు మీనాక్షి చౌదరి.

ఈ ఏడాది మీనాక్షి చౌదరి నటించిన అరడజను సినిమాలు రిలీజయ్యాయంటే ఇట్టే అర్థం చేసుకోవచ్చు ఆమె క్రేజ్ ను

ఇక దుల్కర్ సల్మాన్ తో మీనాక్షి నటించిన లక్కీ భాస్కర్ సినిమా ఏకంగా 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.

ప్రస్తుతం వెంకటేశ్, ఐశ్వర్యా రాజేష్ తో కలసి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో నటిస్తోందీ అందాల తార

అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా విడుదల కానుంది.

ఇక హర్యానాలో పుట్టి పెరిగింది మీనాక్షి చౌదరి.  తండ్రి బీఆర్ చౌదరి భారత ఆర్మీలో సేవలందించారు.

చండీగర్ లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన మీనాక్షి డెంటల్ సర్జరీ విభాగంలో ఎంబీబీఎస్ పట్టా అందుకుంది.

అన్నట్లు ఈ క్రేజీ హీరోయిన్ స్టేట్ లెవల్ స్విమ్మర్ కూడా. అలాగే బ్యాడ్మింటన్ లో పలు పతకాలు సొంతం చేసుకుంది.