AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi – Chandrababu: ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. తాజా రాజకీయ పరిణామాలపై చర్చ..!

ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఏపీ కీలక ప్రాజెక్టులకు నిధుల అంశంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై ప్రధానితో చంద్రబాబు చర్చించారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధానిని సీఎం చంద్రబాబు కోరారు. రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు.

PM Modi - Chandrababu: ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. తాజా రాజకీయ పరిణామాలపై చర్చ..!
PM Modi - Chandrababu
Shaik Madar Saheb
|

Updated on: Dec 25, 2024 | 8:53 PM

Share

దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. బుధవారం సాయంత్రం ప్రధాని మోదీతో భేటీ అయిన చంద్రబాబు.. పలు కీలక అంశాలపై చర్చించారు.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరం ప్రాజెక్టుకి నిధులు, అమరావతికి రైల్వే లైన్, కేంద్ర సంస్థల తరలింపు వంటి అంశాలపై చర్చించారు. ఏపీ కీలక ప్రాజెక్టులకు నిధుల అంశంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై ప్రధానితో చంద్రబాబు చర్చించారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధానిని కోరారు. ఏపీ ఆర్థిక పరిస్థితులు రాష్ట్ర అభివృద్ధికి సహకారం అంశాలను..ప్రధాని మోదీ దృష్టికి సీఎం చంద్రబాబు తీసుకెళ్లారు.

Cbn Modi

PM Modi – Chandrababu

అమరావతి రాజధానికి బడ్జెట్‌లో ప్రతిపాదించిన రూ.15 వేల కోట్ల సాయాన్ని వేగవంతం చేయాలని కోరారు. విశాఖ రైల్వే జోన్ శంకుస్థాపనకు రావాలని ప్రధాని మోదీని చంద్రబాబు కోరారు.. పోలవరం నిర్మాణానికి సహకారంతో పాటు వరద సెస్‌కు అనుమతి ఇవ్వాలని కోరారు.

ప్రధానితో భేటీ అనంతరం కేంద్రమంత్రులు అమిత్‌షా, నిర్మలా సీతారామన్‌తో సమావేశం అయ్యారు. అమరావతి అభివృద్ధికి ఆర్థికంగా తోడ్పాటు అందించడంతో పాటు..పెండింగ్ నిధులు విడుదల పైన కేంద్ర ఆర్థిక మంత్రితో చంద్రబాబు డిస్కస్ చేశారు. ఇలా రోజంతా కీలకనేతలతో పలు అంశాలపై చంద్రబాబు కీలక చర్చలు జరిపారు.

Pm Modi Chandrababu

Pm Modi Chandrababu

ఢిల్లీ టూర్‌లో భాగంగా బుధవారం ఉదయం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రీయ స్మృతిస్థల్‌కు చేరుకున్నారు.. కేంద్ర పెద్దలు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలతో కలిసి వెళ్లిన చంద్రబాబు.. సదైవ్‌ అటల్‌ ఘాట్‌ దగ్గర దివంగత ప్రధాని వాజ్‌పేయి పుష్పాంజలి ఘటించారు. కాసేపు అక్కడే ఉండి ప్రార్థనా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఎన్డీఏ నేతల కీలక సమావేశం..

మధ్యాహ్నం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరిగిన NDA నేతలు, రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. అంబేద్కర్‌పై అమిత్‌షా వ్యాఖ్యలను కాంగ్రెస్‌ నేతలు వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని..దీనిపై ఎన్డీఏ పక్షాలు ఎదురుదాడి చేయాలని బీజేపీ కోరుతోంది. దీనిపై వ్యూహాన్ని రచించేందుకు ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే జమిలి ఎన్నికల బిల్లు, ఎన్నికల సంఘం తీసుకు వచ్చిన నూతన సంస్కరణలపై కూడా చర్చించినట్లు సమాచారం. జనవరి 8వ తేదీన జమిలి ఎన్నికలపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ తొలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా ఎన్డీఏ మిత్రపక్షాలు డిస్కస్ చేసినట్లు తెలుస్తోంది.

ఎన్డీఏ సమావేశం అనంతరం కేంద్ర ఉక్కుమంత్రి హెచ్‌.డి. కుమారస్వామితో భేటీ అయ్యారు చంద్రబాబు.. ఈ భేటీలో వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ని ప్రైవేటీకరించకుండా..ఏం చెయ్యాలి? సెయిల్‌లో విలీనం చెయ్యాలా, ఇంకేదైనా మార్గం ఉందా అనే అంశంపై చర్చించినట్లు సమాచారం.

కుమారస్వామితో భేటీ అనంతరం.. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవితో భేటీ అయ్యారు. పెండింగ్ ప్రాజెక్టుల పైన చర్చించారు. అలాగే ఇటీవల ఏపీ రాజధాని కోసం మంజూరైన రైలు మార్గం పనులను వీలైనంత తొందరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని రైల్వే మంత్రిని చంద్రబాబు కోరారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..