అంతరిక్ష ప్రేమికులకు గుడ్‌న్యూస్.. స్పేస్ ట్రావెల్‌కు సిద్ధమైన నెప్ట్యూన్.. ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే..

చాలా మందికి అంతరిక్షంలో ప్రయాణించాలని కోరుకుంటారు. ఈ కలను నిజం చేసుకోవడానికి ప్రపంచంలోని అనేక అంతరిక్ష సంస్థలు ప్రయోగాలు చేస్తున్నాయి. తాజాగా, అమెరికాకు చెందిన స్పేస్ పెర్స్పెక్టివ్ కంపెనీ అంతరిక్షంలో 6 గంటల పాటు ప్రయాణించడానికి..

అంతరిక్ష ప్రేమికులకు గుడ్‌న్యూస్.. స్పేస్ ట్రావెల్‌కు సిద్ధమైన నెప్ట్యూన్.. ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే..
Space Perspective Spaceship Neptune
Follow us
Venkata Chari

|

Updated on: Apr 26, 2022 | 9:50 AM

అంతరిక్షప్రేమికులకు ఓ గుడ్ న్యూస్ వచ్చింది. అంతరిక్షంలోకి ప్రయాణించాల(Space Travel)ని కోరుకుంటున్నారా.. అయితే మీకోసం ఓ టూర్ సిద్ధమైంది. 2024లో అంతరిక్ష యాత్ర చేసేందుకు ఇక సిద్ధమైపోండి. ఏంటో అర్థం కావడం లేదా.. అయితే, ఆలస్యం ఎందుకు.. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి మరి. చాలా మందికి అంతరిక్షంలో ప్రయాణించాలని కోరుకుంటారు. ఈ కలను నిజం చేసుకోవడానికి ప్రపంచంలోని అనేక అంతరిక్ష సంస్థలు ప్రయోగాలు చేస్తున్నాయి. తాజాగా, అమెరికాకు చెందిన స్పేస్ పెర్స్పెక్టివ్ కంపెనీ(Space Perspective Spaceship) అంతరిక్షంలో 6 గంటల పాటు ప్రయాణించడానికి వీలు కల్పించే స్పేస్ షిప్‌ను రూపొందించింది. ఈ స్పేస్‌క్రాఫ్ట్ పేరు, అంటే స్పేస్‌షిప్‌కి నెప్ట్యూన్(neptune) అని పేరు పెట్టారు.

2024 చివరిలో ప్రయాణం..

స్పేస్ పెర్స్పెక్టివ్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, అంతరిక్ష ప్రేమికులు 2024 చివర్లో ఈ ప్రయాణాన్ని ఆస్వాదించగలరు. ప్రయాణికులు అంతరిక్షానికి చేరుకోగానే భూమిని, నక్షత్రాలను 360 డిగ్రీల కోణంలో చూసేందుకు అవకాశం కల్పించనున్నారు. నెప్ట్యూన్ స్పేస్‌షిప్ అనే స్పేస్ బెలూన్‌లో కూర్చుని ఇవన్నీ చూడొచ్చని పేర్కొంది. ప్రస్తుతం, ఈ కంపెనీ ప్రజలకు స్పేస్‌షిప్ వర్చువల్ టూర్‌ను అందిస్తోంది.

ప్రయాణం ఖర్చు మాత్రం చాలా ఖరీదు..

అయితే, అంతా బాగానే ఉంది కానీ, అసలు విషయం చెప్పడం లేదని ఆలోచిస్తున్నారా. వస్తున్నాం.. అక్కడికే వస్తున్నాం.. నెప్ట్యూన్ స్పేస్ షిప్‌లో ప్రయాణించాలంటే మాత్రం ఖర్చు భారీగానే ఉంది. దీంతో ఒక్క సీటు ధర 1 లక్ష 25 వేల డాలర్లు అంటే దాదాపు 95 లక్షల 75 వేల రూపాయలు అన్నమాట. స్పేస్ పెర్స్పెక్టివ్ 2024 చివరిలో కెన్నెడీ స్పేస్ సెంటర్ ఫ్లోరిడా నుంచి దీనిని ప్రయోగించాలని చూస్తోంది.

కంపెనీ విడుదల చేసిన ఫోటోల్లో లగ్జరీ లాంజ్‌లు, కుర్చీలు, టేబుల్స్, మంచాలు, కాక్ టెయిల్ మెనూలు కనిపిస్తున్నాయి. అంతరిక్ష నౌకలో బాత్రూమ్ కూడా విలాసవంతమైనదిగా కనిపిస్తోంది. నెప్ట్యూన్ టెలిస్కోప్, ఇంటరాక్టివ్ స్క్రీన్‌లు, వైఫై కనెక్షన్ వంటి హైటెక్ సౌకర్యాలను కూడా కలిగి ఉంటుంది.

ప్రపంచంలోని ఏకైక కార్బన్ న్యూట్రల్ స్పేస్‌షిప్..

కంపెనీ ప్రకారం, నెప్ట్యూన్ ప్రపంచంలోనే మొట్టమొదటి కార్బన్ న్యూట్రల్ స్పేస్ షిప్. దాని అంతర్గత తయారీకి స్థిరమైన పదార్థాలు ఉపయోగించారు. అంతరిక్ష నౌకలో ఒక బార్ కూడా ఉంది. ఇది రీసైకిల్ చేసిన పదార్థంతో తయారు చేశారు.

ప్రయాణికులకు శిక్షణ అవసరం లేదు..

నెప్ట్యూన్ అంతరిక్ష నౌక సముద్ర మట్టానికి 30 మైళ్ల (48.2 కిలోమీటర్లు) ఎత్తుకు చేరుకోగలదు. ఇది అమెరికన్ బిలియనీర్ జెఫ్ బెజోస్ కంపెనీ బ్లూ ఆరిజిన్, రిచర్డ్ బ్రాస్నన్ కంపెనీ వర్జిన్ గెలాక్టిక్ అంతరిక్ష నౌక కంటే చాలా తక్కువ. బ్లూ ఆరిజిన్ అంతరిక్ష నౌక 62 మైళ్ల (99.7 కిలోమీటర్లు) ఎత్తుకు చేరుకోగలిగితే, వర్జిన్ గెలాక్టిక్ అంతరిక్ష నౌక 50 మైళ్ల (80.4 కిలోమీటర్లు) దూరాన్ని చేరుకోగలదు.

ఏది ఏమైనప్పటికీ, నెప్ట్యూన్ స్పేస్ షిప్ ఒక ప్రయోజనం ఏమిటంటే, దాని ప్రయాణీకులు అంతరిక్షంలోకి వెళ్లడానికి ఎటువంటి ప్రత్యేక శిక్షణ తీసుకోనవసరం లేదు. కంపెనీ ప్రకారం, స్పేస్ షిప్ మొదటి సంవత్సరంలో 25 విమానాలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు 600 మంది దీనిని బుక్ చేసుకున్నారు. దీని విమానాలు ఇప్పటికే 2025 వరకు బుక్ అయ్యాయంట.

మరిన్ని సైన్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Elon Musk: ట్విట్టర్ కొనుగోలు విషయంలో పంతం నెగ్గించుకుంటున్న ఎలాన్ మస్క్..! డీల్ వివరాలు..

Realme Narzo 50A Prime: రియల్‌మి నార్జో 50A ప్రైమ్ స్మార్ట్‌ఫోన్ లాంచ్‌.. ధర, ఫీచర్ల గురించి తెలుసుకోండి..!