Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Elon Musk: టెస్లా అధినేత సొంతమైన ట్విట్టర్.. ఎంత ధరకు కొన్నాడో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..

Elon Musk Buys Twitter: ప్రపంచంలోని అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్.. మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్‌ను కొనుగోలు చేశాడు. ఇకనుంచి ట్విట్టర్‌లో కొత్త శకం ప్రారంభం కానుంది. ఎలోన్ మస్క్ ట్విట్టర్‌లో అనేక భారీ మార్పులను కూడా ప్రకటించాడు.

Elon Musk: టెస్లా అధినేత సొంతమైన ట్విట్టర్.. ఎంత ధరకు కొన్నాడో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..
Elon Musk Twitter Deal
Follow us
Venkata Chari

|

Updated on: Apr 26, 2022 | 7:30 AM

Elon Musk Buys Twitter: టెస్లా CEO ఎలోన్ మస్క్(Tesla CEO Elon Musk) ట్విట్టర్(Twitter) కొత్త యజమానిగా మారారు. వార్తా సంస్థ AFP ప్రకారం, మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేయడానికి దాదాపు $ 44 బిలియన్లు(సుమారు రూ. 3368 బిలియన్లు) ఖర్చు చేశారు. దీని ప్రకారం, ట్విట్టర్ ప్రతి షేరుకు దాదాపు $ 54.20 (రూ. 4148) చెల్లించారని తెలుస్తోంది. ఇంతకుముందు, బ్లూమ్‌బెర్గ్ ట్విట్టర్ తన యాజమాన్యాన్ని ఎలాన్ మస్క్‌కు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని నివేదించింది. ఆ రిపోర్ట్‌లో సోమవారం డీల్ ఫైనల్ అవుతుందని పేర్కొంది. అనుకున్నట్లుగానే సోమవారం అర్థరాత్రి ట్విట్టర్ బోర్డు కలిసి ఎలోన్ మస్క్ ఆఫర్‌ను అంగీకరించింది. ఒప్పందం పూర్తయిన తర్వాత, ట్విట్టర్ ప్రైవేట్ కంపెనీగా మారుతుంది. ఎలోన్ మస్క్ యాజమాన్యంలో ఇక ట్విట్టర్ తన సరికొత్త ప్రయాణాన్ని సాగించనుంది.

ట్విటర్‌ను కొనుగోలు చేసేందుకు $43 బిలియన్ల ఆఫర్..

ఎలోన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసేందుకు గతంలో $43 బిలియన్లు (సుమారు రూ. 3273.44 బిలియన్లు) ఆఫర్ చేశారు. దీని గురించి చాలా వివాదాలు ఉన్నాయి. కానీ, ప్రస్తుతం $ 44 బిలియన్లకు ఒప్పందం ఖరారు అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఎలాన్ మస్క్ చేసిన తొలి ట్వీట్..

ఈ డీల్ ప్రక్రియను పూర్తి చేయడానికి కొంత సమయం పట్టినప్పటికీ, ఇప్పుడు ఎలోన్ మస్క్‌ను ట్విట్టర్ యజమాని అని పిలవవచ్చు అంటూ తొలి ట్వీట్ చేశాడు. ట్విట్టర్ యజమాని అయిన తర్వాత ఎలోన్ మస్క్ చేసిన తొలి ట్వీట్ ఇదే కావడం గమనార్హం. ఈ ట్వీట్‌లో ఫ్రీ స్పీచ్ అని మొదలయ్యే తన స్టేట్‌మెంట్ స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేశాడు.

బోర్డు ఆఫ్ డైరెక్టర్ల నిరసన..

ఇటీవల, మస్క్ తరపున కంపెనీని టేకోవర్ చేయకుండా నిరోధించడానికి ట్విట్టర్ బోర్డు ‘పాయిజన్ పిల్ స్ట్రాటజీ’ని అనుసరించింది. ఈ డీల్‌పై చర్చలు జరపడానికి బోర్డు సభ్యులు సిద్ధంగా ఉన్నప్పటికీ, బోర్డు ఆఫ్ డైరెక్టర్ల నిరసనలు వ్యక్తం చేసినట్లు వార్తలు వినిపించాయి.

మస్క్ ప్రస్తుతం 9.2% షేర్లను కలిగి ఉన్నాడు. శుక్రవారం మస్క్ కంపెనీకి చెందిన పలువురు షేర్ హోల్డర్లతో ప్రైవేట్ మీటింగ్ నిర్వహించినప్పటి నుంచి ట్విట్టర్ వైఖరి మారినట్లు వార్తలు కూడా వచ్చాయి.

మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌లో పని చేస్తానని ప్రకటించాడు. మస్క్ ఎప్పటినుంచో తాను ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌‌కు అనుకూలంగా ఉన్నానని తెలిపాడు. ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో వాక్ స్వాతంత్ర్యం ముప్పులో ఉందని, అది అలాగే ఉంచేందుకే ట్విట్టర్‌ను కొనుగోలు చేయాలనే వెనుక ఉన్న ఉద్దేశాన్ని కూడా ఆయన పేర్కొన్నాడు.

Also Read: Post Office scheme: అదరిపోయే స్కీమ్.. రూ. 50 వేలు డిపాజిట్ చేసి రూ. 3,300 ఆదాయం పొందొచ్చు.. అదెలాగంటే..

Stock Market: వారం ఆరంభంలోనూ మార్కెట్లను వెంటాడిన నష్టాలు.. 17000 మార్క్ కిందకు నిఫ్టీ..

ట్రంప్‌ హత్యకు డబ్బివ్వలేదనీ.. తల్లిదండ్రులను చంపేశాడు..!
ట్రంప్‌ హత్యకు డబ్బివ్వలేదనీ.. తల్లిదండ్రులను చంపేశాడు..!
బంగ్లాతో సిరీస్ నుంచి విరాట్, బుమ్రా ఔట్.. ప్రశ్నార్థకంగా రోహిత్?
బంగ్లాతో సిరీస్ నుంచి విరాట్, బుమ్రా ఔట్.. ప్రశ్నార్థకంగా రోహిత్?
అక్షయ తృతీయ రోజున వీటిని కొంటే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే
అక్షయ తృతీయ రోజున వీటిని కొంటే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే
గోపిచంద్ యజ్ఞం హీరోయిన్ ఇట్టా మారిపోయింది.
గోపిచంద్ యజ్ఞం హీరోయిన్ ఇట్టా మారిపోయింది.
క్రికెట్‌లో కొత్త చరిత్ర.. ఏకంగా 504 పరుగుల తేడాతో రికార్డ్ విజయం
క్రికెట్‌లో కొత్త చరిత్ర.. ఏకంగా 504 పరుగుల తేడాతో రికార్డ్ విజయం
వీళ్లు మనుషులేనా.. భర్త ఫిర్యాదు చేశాడని దారుణం..
వీళ్లు మనుషులేనా.. భర్త ఫిర్యాదు చేశాడని దారుణం..
ఆ స్టార్ హీరోతో లక్కీ భాస్కర్ డైరెక్టర్ సినిమా..
ఆ స్టార్ హీరోతో లక్కీ భాస్కర్ డైరెక్టర్ సినిమా..
వరూధుని ఏకాదశి రోజున వీటిని దానం చేయడం.. సహస్ర గోదాన ఫలితం ..
వరూధుని ఏకాదశి రోజున వీటిని దానం చేయడం.. సహస్ర గోదాన ఫలితం ..
ఇదేం చెత్త కామెంట్రీ భయ్యా.. అచ్చ తెలుగులో పంత్‌ను అలా అంటారా?
ఇదేం చెత్త కామెంట్రీ భయ్యా.. అచ్చ తెలుగులో పంత్‌ను అలా అంటారా?
ప్రకృతి విపత్తు వేళ రైతన్నకు సాయంగా నిలబడ్డ పోలీస్ అన్నలు..
ప్రకృతి విపత్తు వేళ రైతన్నకు సాయంగా నిలబడ్డ పోలీస్ అన్నలు..