Post Office scheme: అదరిపోయే స్కీమ్.. రూ. 50 వేలు డిపాజిట్ చేసి రూ. 3,300 ఆదాయం పొందొచ్చు.. అదెలాగంటే..

Post Office scheme: సురక్షితమైన పెట్టుబడులతో మంచి రాబడి పొందాలని ప్రతీ ఒక్కరూ భావిస్తారు. పెట్టుబడి, సేవింగ్స్ విషయానికి వస్తే ముందుగా గుర్తుకు వచ్చేది పోస్ట్ ఆఫీస్ స్మాల్ సేవింగ్ స్కీమ్స్...

Post Office scheme: అదరిపోయే స్కీమ్.. రూ. 50 వేలు డిపాజిట్ చేసి రూ. 3,300 ఆదాయం పొందొచ్చు.. అదెలాగంటే..
Post Office
Follow us

|

Updated on: Apr 25, 2022 | 8:19 PM

Post Office scheme: సురక్షితమైన పెట్టుబడులతో మంచి రాబడి పొందాలని ప్రతీ ఒక్కరూ భావిస్తారు. పెట్టుబడి, సేవింగ్స్ విషయానికి వస్తే ముందుగా గుర్తుకు వచ్చేది పోస్ట్ ఆఫీస్ స్మాల్ సేవింగ్ స్కీమ్స్ అని చెప్పొచ్చు. ఇలాంటి పథకాల్లో పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్( పోస్టాఫీసు MIS ) ఒకటి అని చెప్పొచ్చు. ఇది పేరుకు తగ్గట్లుగానే.. ఈ పథకం నెలవారీ ఆదాయం, నెలవారీ సేవింగ్స్‌కు ప్రధాన అవకాశం ఉంటుంది. ఈ పథకంలో ఒకసారి డబ్బును డిపాజిట్ చేస్తే.. నిర్ణతీయ గడువు తరువాత ప్రతి నెలా పింఛన్‌ను పొందవచ్చు. వాస్తవానికి, మీరు పథకంలో డిపాజిట్ చేసిన డబ్బుకు వడ్డీ నెలవారీ ఆదాయం, పెన్షన్ రూపంలో మీ ఖాతాలో వస్తుంది. దీని ప్రకారం ఎంత డబ్బు డిపాజిట్ చేస్తే అంత ఆదాయం లేదా పెన్షన్ వస్తుందన్నమాట. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. నెలవారీ ఆదాయ పథకంలో ఒకసారి ప్రిన్సిపాల్‌గా డిపాజిట్ చేసిన మొత్తం కూడా మెచ్యూరిటీ తర్వాత తిరిగి వస్తుంది.

ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ MIS పథకం సంవత్సరానికి 6.6 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఇది నెలవారీ ప్రాతిపదికన లభిస్తుంది. ఈ పథకం కింద, ఒక వ్యక్తి ఒక ఖాతాలో గరిష్టంగా రూ. 4.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఉమ్మడి ఖాతా కోసం గరిష్ట మొత్తం రూ. 9 లక్షలు డిపాజిట్ చేయొచ్చు. MIS పథకం వ్యవధి 5​ సంవత్సరాలు. ఎవరైనా ఈ ప్లాన్‌ని తీసుకోవచ్చు. ఉమ్మడిగా తీసుకోవాలనుకుంటే గరిష్టంగా ముగ్గురు వ్యక్తులు ఏకకాలంలో పథకం ఖాతాను తెరవవచ్చు. ఇక సంరక్షకులు తమ మైనర్ పిల్లల కోసం లేదా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వారి కోసం ఈ పథకాన్ని తీసుకోవచ్చు. 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఎవరైనా తమ పేరు మీద MIS పథకాన్ని తీసుకోవచ్చు.

పథకంలో డబ్బును ఎలా డిపాజిట్ చేయాలి.. ఒక వ్యక్తి కనీసం రూ. 1,000తో MIS ఖాతాను తెరవవచ్చు. ఒక వ్యక్తి అయితే గరిష్టంగా రూ. 4.5 లక్షలు డిపాజిట్ చేయొచ్చు. ఉమ్మడి ఖాతా అయితే రూ. 9 లక్షలు డిపాజిట్ చేయొచ్చు. MIS జాయింట్ ఖాతా ఖాతాదారులందరికీ పెట్టుబడిలో సమాన వాటా ఉంటుంది. అన్ని MIS ఖాతాలలో ఒక వ్యక్తి డిపాజిట్లు/షేర్లు రూ. 4.50 లక్షలకు మించకూడదు. మైనర్ తరపున గార్డియన్ తెరిచిన ఖాతా పరిమితి భిన్నంగా ఉంటుంది.

ఎంత పెన్షన్.. ఒక వ్యక్తి MIS ఖాతాలో ఒకేసారి రూ. 50,000 డిపాజిట్ చేస్తే.. వారికి ప్రతి నెలా రూ. 275 వడ్డీ రేటుతో ఒక సంవత్సరంలో రూ. 3,300 పొందుతారు. 5 సంవత్సరాలలో ఆదాయం మొత్తం రూ. 16,500 అవుతుంది. ఖాతాలో ఒకేసారి రూ.లక్ష జమ చేస్తే నెలకు రూ.550 వడ్డీ వస్తుంది. సంవత్సరంలో ఈ ఆదాయం రూ. 6,600 అవుతుంది. ఇక 5 సంవత్సరాలలో రూ. 33,000 పొందుతారు.

ఒక సంవత్సరంలో గరిష్టంగా రూ.4.5 లక్షలు పోస్టాఫీసు MIS ఖాతాలో జమ చేయవచ్చు. ఈ మొత్తాన్ని డిపాజిట్ చేస్తే, ప్రతి నెలా రూ. 2,475 ఆదాయం లభిస్తుంది. ఇది సంవత్సరంలో రూ. 29,700 అవుతుంది. 5 సంవత్సరాలలో మొత్తం రూ. 1,48,500 మీ ఖాతాకు వడ్డీగా యాడ్ అవుతుంది. మీ ప్రిన్సిపాల్ మెచ్యూరిటీ తర్వాత తిరిగి ఇవ్వబడుతుంది.

వడ్డీని ఎలా పొందాలి.. ప్రతి నెలా MIS ఖాతాకు వడ్డీ డబ్బు కలపడం జరుగుతుంది. ఖాతా తెరిచిన తేదీ నుండి ఒక నెల పూర్తయిన తర్వాత వడ్డీ పెరుగుతుంది. ఈ ఖాతాలోని డబ్బును ప్రతి నెలా తీసుకోవచ్చు. ఒకవేళ తీసుకోకుండా అలాగే ఉంచుకోవచ్చు కూడా. అయితే, వడ్డీ డబ్బుపై వడ్డీ లభించదు. ఈ వడ్డీ డబ్బును తీసుకోవడానికి మీరు MIS ఖాతాను పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా, బ్యాంక్ అకౌంట్‌తో లింక్ చేయాలి. పోస్టాఫీసు MIS వడ్డీని నగదు రూపంలో ఇవ్వడం లేదు. కావున.. MIS ఖాతాను బ్యాంక్ ఖాతా, పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాతో లింక్ చేస్తే.. ఆ వడ్డీ డబ్బు దానికి బదిలీ చేయబడుతుంది.

Also read:

Telangana Women University: తెలంగాణలో మహిళా విశ్వ విద్యాలయం.. జీవో జారీ చేసిన సర్కార్..

Puzzle Picture: ఫసక్.. ఇంత సింపుల్‌ ఫజిల్‌ను కూడా ఛేజ్ చేయలేకపోతున్నారు.. మీవల్ల అయితే ట్రై చేయండి..!

Shah Rukh Khan: సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న ‘షారుఖ్ ఖాన్’ ఇల్లు.. ఎందుకో తెలుసా?..