Puzzle Picture: ఫసక్.. ఇంత సింపుల్ ఫజిల్‌ను కూడా ఛేజ్ చేయలేకపోతున్నారు.. మీవల్ల అయితే ట్రై చేయండి..!
Puzzle Picture: ఎండమావి గురించి మనకు తెలిసిందే. కొంత దూరంలో నీరు ఉన్నట్లే అనిపిస్తుంటుంది.. కానీ, అక్కడ ఒక్క చుక్క కూడా నీరుండదు.
Puzzle Picture: ఎండమావి గురించి మనకు తెలిసిందే. కొంత దూరంలో నీరు ఉన్నట్లే అనిపిస్తుంటుంది.. కానీ, అక్కడ ఒక్క చుక్క కూడా నీరుండదు. అది భ్రమ మాత్రమే. దానినే ఇంగ్లీష్‌లో ఆప్టికల్ ఇల్యూషన్ అంటారు. తీవ్రమైన ఎండలు, వడగాడ్పుల కారణంగా ఆ ఎండమావులు ఏర్పడుతాయి. అయితే, ఈ మధ్య కాలంలో ఆప్టికల్ ఇల్యూషన్ పిక్స్ సోషల్ మీడియాలో తెగ ట్రైండ్ అవుతున్నాయి. ఎందుకంటే.. ఆ ఫోటోలు ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఫజిల్ పిక్చర్స్, ఆప్టికల్ ఇల్యూషన్ పిక్చర్‌ను ఛేజ్ చేయడం చాలా సరదాగా ఉంటుంది. అదే సమయంలో వాటిని ఛేజ్ చేయడం ద్వారా మెదడు కూడా చురుకుగా తయారవుతుంది. అయితే, తాజాగా సోషల్ మీడియాలో ఓ పజిల్ పిక్చర్ తెగ వైరల్ అవుతోంది. అందులో దాగి ఉన్న మంచు ఎలుగుబంటిని కనిపెట్టండంటూ సవాల్ విసిరారు. దాంతో ఆ ఎలుగు బంటిని కనిపెట్టేందుకు నెటిజన్లు జుట్టు పీక్కుంటున్నారు.
ఆ ఫజిల్ పిక్చర్‌లో ఏముంది? ఏం కనిపెట్టమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ రెట్రో పజిల్ పేయింట్ పిక్‌లో మంచుతో కప్పబడి ఉన్న అడవి ఉంది. అందులో ఓ వ్యక్తి వేట షాట్‌గన్‌తో వేట సాగిస్తున్నాడు. చుట్టూ మంచు, ఆ పక్కను కొన్ని చెట్ల పొదలు ఉన్నాయి. అయితే, వేటగానికి చిక్కకుండా చాటుగా, మంచు దిబ్బల్లో కలిసిపోయి ఓ ఎలుగుబంటి దాక్కుని ఉంది. ఈ డ్రాయింగ్ చూడటానికి చాలా సింపుల్‌గా ఉన్నప్పటికీ.. దాగి ఉన్న ఎలుగుబంటిని కనిపెట్టడం మాత్రం చాలా కష్టంగా మారింది. ఈ ఫజిల్ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. నెటిజన్లు దాగి ఉన్న ఎలుగుబంటిని కనిపెట్టలేక జుట్టును పీక్కుంటున్నారు. కొంత మంది మాత్రం ఈ విషయంలో సక్సెస్ అయ్యారు. మరి ఆ పిక్‌లో ఎలుగుబంటి ఎక్కడ దాగుందో మీరేమైనా కనిపెట్టగలరేమో ట్రై చేయండి. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఈ ఫిక్చర్‌ను రివర్స్‌లో చేసి రౌండప్‌ను చూస్తే ఆ ఎలుగుబంటి మీకు క్షుణ్ణంగా కనిపిస్తుంది.
Also read:
Youtube Channels: తప్పుడు వార్తల ప్రసారంపై కేంద్రం సీరియస్.. 16 యూట్యూబ్ ఛానెళ్లపై నిషేధం!
PM Modi: ప్రధానిగా నరేంద్ర మోదీ పాలనకు ఎనిమిదేళ్లు.. ఘనంగా సంబరాలకు బీజేపీ సన్నాహాలు..!
Shah Rukh Khan: సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న ‘షారుఖ్ ఖాన్’ ఇల్లు.. ఎందుకో తెలుసా?..