AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shah Rukh Khan: సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న ‘షారుఖ్ ఖాన్’ ఇల్లు.. ఎందుకో తెలుసా?..

Shah Rukh Khan: బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ ఇల్లు ‘మన్నత్’ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. దీనికి కారణం.. ఆయన అభిమానులే కావడం విశేషం.

Shah Rukh Khan: సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న ‘షారుఖ్ ఖాన్’ ఇల్లు.. ఎందుకో తెలుసా?..
Shah Rukh Khan
Shiva Prajapati
|

Updated on: Apr 25, 2022 | 6:42 PM

Share

Shah Rukh Khan: బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ ఇల్లు ‘మన్నత్’ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. దీనికి కారణం.. ఆయన అభిమానులే కావడం విశేషం. ఇంతకీ షారూఖ్ ఇల్లు వైరల్ అవడానికి కారణం ఏంటో ఇప్పడు తెలుసుకోండి. షారూఖ్ ఖాన్‌కు దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగానూ ఎంతోమంది అభిమానులు ఉన్నారు. వారు షారూఖ్ ఖాన్‌కు సంబంధించిన ప్రతీ అంశాన్ని నిశితంగా గమనిస్తూ.. సోషల్ మీడియాలో సేర్ చేస్తుంటారు. తాజాగా కూడా అదే పని చేశారు అభిమానులు. షారూఖ్, గౌరీ ఖాన్ ఇంటికి కొత్త నేమ్ ప్లేట్ వచ్చింది. షారూఖ్ ఇంటి పేరు ‘మన్నత్’. ఆ పేరు గతంలో సాధారణంగా పెద్ద స్పేస్‌తో రాసి ఉండేది. కానీ, ఇప్పుడు ఆ పేరు బోర్డును మార్చేశారు. ఇదే ఆ ఇల్లు సోషల్ మీడియాలో వైరల్ అవడానికి ప్రధాన కారణంగా నిలిచింది. ‘మన్నత్’ పేరుతో ఉన్న వివిధ నేమ్ ప్లేట్‌ ఫోటోలను కలిపి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ట్విట్టర్‌లో షేర్ చేశారు. గతంలో ఉన్న ‘మన్నత్’కు, ఇప్పుడు ‘మన్నత్’కు డిఫరెన్స్ అంటూ ఫోటోలను షేర్ చేశారు. గతంలో గోడపై పెద్ద పెద్ద అక్షరాలతో ‘మన్నత్’ అని రాసి ఉండగా.. ఇప్పుడు దాని ప్లేస్‌లో నిలువుగా స్లాబ్‌లో ‘మన్నత్’ అని రాశారు. దానికి లైటింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు. తాజాగా అమర్చిన పేరు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది.

దేశ వ్యాప్తంగా ఉన్న షారూఖ్ ఖాన్ అభిమానులు ముంబైలోని బాంద్రా వెళ్లినప్పుడు ఆయన ఇల్లు ‘మన్నత్’ చూడకుండా అక్కడి నుంచి రిటర్న్ అవరంటే అతిశయోక్తి కాదు. అమితాబ్ బచ్చన్ ‘జల్సా’, సల్మాన్ ఖాన్ ‘గెలాక్సీ అపార్ట్‌మెంట్స్’ వంటి ఇతర సూపర్ స్టార్‌ల ఇళ్లతో పాటు షారూఖ్ ఇల్లు కూడా ఒక ఐకానిక్ స్పాట్. షారుఖ్ తన అభిమానులను ప్రత్యేక సందర్భాలలో ‘మన్నత్’ బాల్కనీలో నిలబడి చూస్తుంటాడు. తన పుట్టినరోజు, ఈద్, ఇతర ప్రత్యేక కార్యక్రమాల సందర్భంలో తన నివాసం వెలుపల గుమిగూడిన భారీ అభిమానుల సమూహాన్ని ‘మన్నత్’ బాల్కీనిలోకి వచ్చి పలుకరిస్తాడు.

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్.. వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. యష్ రాజ్ ఫిల్మ్ ‘పఠాన్’లో కనిపించనున్నాడు. ఇందులో జాన్ అబ్రహం, దీపికా పడుకొనే కూడా ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 25, 2023న వెండితెరపైకి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక షారూఖ్ ఖాన్.. తన తదుపరి సినిమా ‘ఢుంకీ’ కోసం చిత్ర నిర్మాత రాజ్‌కుమార్ హిరానీతో కలిసి పని చేస్తున్నట్లు ప్రకటించారు. అట్లీ దర్శకత్వంలో వచ్చే సినిమాలోనూ ఈ సూపర్ స్టార్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. షారూఖ్ ఖాన్ చివరగా ‘జీరో’(2018)లో కనిపించాడు.

Also read:

Akshaya Tritiya 2022: ఆర్ధిక ఇబ్బందులున్నాయా.. అక్షయ తృతీయ రోజున ఏఏ రాశివారు ఏఏ దానాలు చేయాలంటే..

Ranveer singh: వారెవ్వా.. క్యా స్టైల్ గురూ.. ఫ్యాషన్ ట్రెండ్ సెట్ చేస్తోన్న బాలీవుడ్ హీరో.. అదరగొట్టిన రణవీర్ సింగ్..

Kangana Ranaut: అతడు నన్ను అసభ్యకరంగా తాకేవాడు.. సంచలన కామెంట్స్ చేసిన కంగనా రనౌత్