AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kangana Ranaut: అతడు నన్ను అసభ్యకరంగా తాకేవాడు.. సంచలన కామెంట్స్ చేసిన కంగనా రనౌత్

సినిమా ఇండస్ట్రీలో ఆమధ్యఎక్కువగా వినిపించిన మాట క్యాస్టింగ్ కౌచ్. చాలా మంది సినిమాతారలు తమకు ఎదురైన చేదు అనుభవాలను మీడియా ముందో లేక సోషల్ మీడియాలోనో చెప్పుకొచ్చారు.

Kangana Ranaut: అతడు నన్ను అసభ్యకరంగా తాకేవాడు.. సంచలన కామెంట్స్ చేసిన కంగనా రనౌత్
Kangana
Rajeev Rayala
|

Updated on: Apr 25, 2022 | 6:23 PM

Share

సినిమా ఇండస్ట్రీలో ఆమధ్యఎక్కువగా వినిపించిన మాట క్యాస్టింగ్ కౌచ్. చాలా మంది సినిమాతారలు తమకు ఎదురైన చేదు అనుభవాలను మీడియా ముందో లేక సోషల్ మీడియాలోనో చెప్పుకొచ్చారు. కేవలం ఇండస్ట్రీలోనే కాదు. తమ చిన్నతనంలో జరిగినవి కూడా చెప్పుకున్నారు. తాజాగా బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్(Kangana Ranaut) కూడా తనజీవితంలో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పుకొచ్చారు. కంగనా రనౌత్ ‘లాకప్’ అనే షోకి హోస్ట్ చేస్తోన్న‌ విషయం విదిత‌మే. ఈ షో వేదికగా ఆమె ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేశారు కూడా.. తాజాగా ఈ షోలో కంటెస్టెంట్ అయిన మునవర్ ఫారూఖీ చిన్నతనంలో తనను లైంగికంగా వేధించేవారని.. 6 ఏళ్ల వయస్సులో లైంగిక వేధింపులకు గుర‌య్యాన‌ని తెలిపాడు. తన బంధువులు ఇద్దరు అప్ప‌ట్లో తనను దాదాపు ఐదేళ్ల పాటు లైంగికంగా వేధించారని.. అప్పుడు ఆవిషయం చెప్పినా ఎవ్వరూ నమ్మేవారు కాదు అని చెప్పుకొచ్చాడు. దీనిపై కంగనా స్పందిస్తూ..

కంగనా మాట్లాడుతూ.. తాను కూడా లైంగిక వేధింపులకు గురయ్యానని అన్నారు. కొంతమంది కామాంధులు చిన్న పిల్లలను లైంగికంగా వేధించేవారని ఆమె అన్నారు. చిన్న వయసులో తనకన్నా పెద్దవాడైన ఓ వ్యక్తి  తనను అసభ్యకరంగా తాకేవాడని కంగనా తెలిపింది. అప్పుడు అతడి ఉద్దేశం ఏంటో త‌నకు అర్థం కాలేదని చెప్పింది. తనను మాత్రమే కాదు త‌న‌లాంటి వారిని పిలిచి బట్టలు విప్పమని అడిగేవాడని, శరీరాన్ని తడిమేవాడని చెప్పుకొచ్చింది. ఆ స‌మ‌యంలో త‌మ‌ వయస్సు 6 ఏళ్లు మాత్రమేన‌ని, దీంతో అత‌డి చేష్ట‌ల‌ను అడ్డుకోలేకపోయా అని తెలిపింది కంగనా..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Tollywood drugs case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ కోర్టు ధిక్కరణ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. క్షమాపణలు కోరారు ఎక్సైజ్ డైరెక్టర్‌..

KGF 2 Collections: ఆల్ టైం రికార్డ్స్ బ్రేక్ చేసిన రాఖీభాయ్.. హిందీలో కేజీఎఫ్ 2 హావా ఇదే..

Upcoming Movies: ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో వచ్చే సినిమాలు ఇవే.. ఆచార్యతోపాటు ఇవి కూడా..