AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Upcoming Movies: ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో వచ్చే సినిమాలు ఇవే.. ఆచార్యతోపాటు ఇవి కూడా..

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పాన్ ఇండియా చిత్రాల హావా కొనసాగుతుంది. ఓవైపు.. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 సినిమాలు కలెక్షన్ల రికార్డ్ సృష్టిస్తుండగా.

Upcoming Movies: ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో వచ్చే సినిమాలు ఇవే.. ఆచార్యతోపాటు ఇవి కూడా..
Acharya
Rajitha Chanti
|

Updated on: Apr 25, 2022 | 1:04 PM

Share

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పాన్ ఇండియా చిత్రాల హావా కొనసాగుతుంది. ఓవైపు.. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 సినిమాలు కలెక్షన్ల రికార్డ్ సృష్టిస్తుండగా.. ఇప్పుడు మరిన్ని సినిమాలు ప్రేక్షకులను మరింత ఎంటర్టైన్ చేయడానికి రాబోతున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆచార్య (Acharya) సినిమాతోపాటు మరిన్ని చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీ సినీ ప్రియులకు సైతం ఈ వారం మరింత వినోదాన్ని అందించనున్నాయి. సూపర్ హిట్ చిత్రాలు.. వెబ్ సిరీస్ ఓటీటీలో సందడి చేయనున్నాయి. ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో విడుదలయ్యే సినిమాల గురించి తెలుసుకుందామా.

ఆచార్య.. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తోన్న సినిమా ఆచార్య. మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 29న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇందులో పూజా హెగ్డే కీలకపాత్రలో నటిస్తుండగా.. సోనూ సూద్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్ మూవీపై మరింత అంచనాలను పెంచేసింది.

కాతు వాక్కుల రెండు కాదల్.. తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి… లేడీ సూపర్ స్టార్ నయనతార, సమంత ప్రధాన పాత్రలలో రాబోతున్న చిత్రం కాతు వాక్కుల రెండు కాదల్. తెలుగులో ఈ చిత్రాన్ని కణ్మని రాంబో ఖతీజా పేరుతో విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ఇద్దరు అమ్మాయిలను ప్రేమించిన ఓ వ్యక్తి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోన్నాడు.. చివరకు ఇద్దరి మనసులు గెలుచుకున్నాడా ? లేదా అనేది ఈ సినిమాలో చూడొచ్చు. ఈ మూవీని ఏప్రిల్ 28న విడుదల చేయనున్నారు.

రన్ వే 34.. బాలీవుడ్ కథానాయకుడు అమితాబ్ బచ్చన్, రకుల్ ప్రీత్ సింగ్, అజయ్ దేవగణ్ ప్రదాన పాత్రలలో నటిస్తున్న సినిమా రన్ వే 34. ఈ చిత్రానికి స్టార్ హీరో అజయ్ దేవగణ్ దర్శకత్వం వహిస్తూ.. నిర్మిస్తున్నారు. 2015లో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 29న విడుదల చేయనున్నారు.

ఓటీటీలోకి రాబోయే చిత్రాలు..

గంగూబాయి కతీయావాడీ. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గంగూబాయి కతీయావాడీ. డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ ఇప్పుడు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ఏప్రిల్ 26న స్ట్రీమింగ్ కానుంది…

మిషన్ ఇంపాజిబుల్.. టాలీవుడ్ హీరోయిన్ తాప్సీ పన్నూ నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం మిషన్ ఇంపాజిబుల్. ఇందులో తాప్సీ పాత్రికేయురాలిగా కనిపిస్తుంది. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ఏప్రిల్ 29న స్ట్రీమింగ్ కానుంది.

ఓ జార్క్.. వెబ్ సిరీస్ ఏప్రిల్ 29 (నెట్ ఫ్లిక్స్)

డిస్నీ ప్లస్ హాట్ స్టా్ర్.. అనుపమా.. నమస్తే అమెరికా.. ఏప్రిల్ 25

జీ5.. నెవర్ కిస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ .. ఏప్రిల్ 29

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Hari Hara Veeramallu: హరిహర వీరమల్లు నుంచి క్రేజీ అప్డేట్.. పవన్ సినిమాలో ఆ బాలీవుడ్ బ్యూటీ ?..

Ram Charan: బాబాయ్‏తో సినిమా చేయాలని ఉంది.. ఆసక్తికర కామెంట్స్ చేసిన రామ్ చరణ్..

Health Tips: వీటితోపాటు ట్యాబ్లెట్స్ అస్సలు తీసుకోవద్దు.. మర్చిపోతే ప్రాణాలకే ప్రమాదం..

Viral Video: బాబోయ్.. ఎక్కడా చోటు లేనట్టు అమ్మాయి జుట్టులో చిక్కుకున్న పాము.. ఒళ్లుగగుర్బొడిచే వీడియో…

ఏపీలో వారందరికీ ఉచితంగా రూ.10 లక్షలు.. దరఖాస్తులకు అవకాశం
ఏపీలో వారందరికీ ఉచితంగా రూ.10 లక్షలు.. దరఖాస్తులకు అవకాశం
మాఘ మాసంలో నదీ స్నానానికి ఎందుకంత ప్రాధాన్యత? ఏం చేయాలి? చేయకూడదో
మాఘ మాసంలో నదీ స్నానానికి ఎందుకంత ప్రాధాన్యత? ఏం చేయాలి? చేయకూడదో
హీరోగా కాకపోతే క్రికెటర్ అయ్యేవాడిని..
హీరోగా కాకపోతే క్రికెటర్ అయ్యేవాడిని..
చిన్న వయసులోనే తెల్ల జుట్టు ఎందుకొస్తుంది.. అసలు నిజాలు తెలిస్తే
చిన్న వయసులోనే తెల్ల జుట్టు ఎందుకొస్తుంది.. అసలు నిజాలు తెలిస్తే
బట్టతల, పల్చటి జుట్టును ఒత్తుగా మార్చే సింపుల్ చిట్కాలు..!
బట్టతల, పల్చటి జుట్టును ఒత్తుగా మార్చే సింపుల్ చిట్కాలు..!
అసలే అమావాస్య అర్ధరాత్రి.. కల్లాపి కోసం ఇంటి వరండాలోకి..
అసలే అమావాస్య అర్ధరాత్రి.. కల్లాపి కోసం ఇంటి వరండాలోకి..
3 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. కట్‌చేస్తే.. గంభీర్, సూర్య స్కెచ్‌కు బలి
3 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. కట్‌చేస్తే.. గంభీర్, సూర్య స్కెచ్‌కు బలి
రేషన్ కార్డులేనివారికి బంపర్ ఛాన్స్.. ప్రభుత్వం మళ్లీ అవకాశం
రేషన్ కార్డులేనివారికి బంపర్ ఛాన్స్.. ప్రభుత్వం మళ్లీ అవకాశం
స్పీ బాలు చెప్పిన మాటలు.. మరోసారి మీ ముందుకు..
స్పీ బాలు చెప్పిన మాటలు.. మరోసారి మీ ముందుకు..
ఘోర ప్రమాదం.. ట్రాక్ తప్పిన రైళ్లు.. చెల్లాచెదురైన బతుకులు..
ఘోర ప్రమాదం.. ట్రాక్ తప్పిన రైళ్లు.. చెల్లాచెదురైన బతుకులు..