Health Tips: వీటితోపాటు ట్యాబ్లెట్స్ అస్సలు తీసుకోవద్దు.. మర్చిపోతే ప్రాణాలకే ప్రమాదం..

ప్రస్తుతం చాలా మంది చిన్నపాటి నొప్పికి కూడా ట్యాబ్లెట్స్ ఉపయోగిస్తున్నారు. తలనొప్పి, కీళ్ల నొప్పులు, మానసిక ఒత్తిడి, జలుబు ఇలా

Health Tips: వీటితోపాటు ట్యాబ్లెట్స్ అస్సలు తీసుకోవద్దు.. మర్చిపోతే ప్రాణాలకే ప్రమాదం..
Medicine
Follow us

|

Updated on: Apr 25, 2022 | 6:57 AM

ప్రస్తుతం చాలా మంది చిన్నపాటి నొప్పికి కూడా ట్యాబ్లెట్స్ ఉపయోగిస్తున్నారు. తలనొప్పి, కీళ్ల నొప్పులు, మానసిక ఒత్తిడి, జలుబు ఇలా ప్రతి సమస్యకు ట్యాబ్లెట్స్ వినియోగిస్తున్నారు. అయితే మార్కెట్లో లభించే ప్రతి మందుల వెనక వాటికి సంబంధించిన సమాచారం ఉంటుంది. కానీ దానిని ఎవరు పట్టించుకోరు. ట్యాబ్లె్ట్స్‏తోపాటు కొన్ని పదార్థాలను తీసుకోవడం వలన అనేక దుష్ర్పభావాలు ఉంటాయి. దీంతోపాటు.. ఖాళీ కడుపుతో ఏదైనా మందు తీసుకోవాలి.. ఆహారం తీసుకున్న తర్వాత ఎలాంటి మందులు వేసుకోవాలి అనేది మందుల వెనక ఉంటుంది. సాధారణంగా మనం ట్యాబ్లెట్స్ తీసుకునేటప్పుడు నీళ్లతో కలిపి తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. అయితే పొరపాటున కూడా కొన్ని రకాల పానీయాలతో మందులు తీసుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సౌదీ ఫార్మాస్యూటికల్ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం కొన్ని డ్రింక్స్ తోపాటు మందులు తీసుకోవడం వలన కలిగే ప్రభావాలను వెల్లడించింది. అవెంటో తెలుసుకుందామా.

కాఫీ.. మెడిసిన్‏తోపాటు కెఫిన్ తీసుకోవడం వలన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. కాఫీ వంటి వేడి పానీయాలంతో మందులు తీసుకోవడం వలన అది కరగడానికి ఎక్కువ సమయం పడుతుందని అధ్యాయనంలో తెలీంది. కాఫీ లేదా మరే ఇతర వేడి పానీయాలతో మందులు తీసుకోవడం వలన మీ ఆరోగ్యం మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉంది.

ఆరెంజ్ జ్యూస్.. సాధారణంగా చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసేటప్పుడు ఆరెంజ్ జ్యూస్ తీసుకుంటారు. అలాగే.. ఆరెంజ్ జ్యూస్ తోపాటు ట్యాబ్లెట్స్ కూడా తీసుకుంటారు. కానీ ఇలా తీసుకోవడం వలన ట్యాబ్లెట్స్ కరగడానికి ఎక్కువ సమయం పడుతుందని.. విటమిన్ సీతో ట్యాబ్లెట్స్ తీసుకోవడం వలన మరిన్ని అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని నిపుణులు అంటున్నారు. విటమిన్ సీ పానీయాలతో ట్యాబ్లెట్స్ తీసుకోవద్దు.

కోకా.. కోలా… వేసవిలో అందరూ కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగేస్తుంటారు. ఎండవేడిని తట్టుకునేందుకు ఎక్కువగా చల్లటి డ్రింక్స్ తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. అదేసమయంలో వీటితోపాటు ట్యాబ్లె్ట్స్ తీసుకుంటారు. కానీ ఇలా చేయడం వలన అనారోగ్యానికి గురవుతారు.

ఎనర్జీ డ్రింక్స్. ఎనర్జీ డ్రింక్స్ తోపాటు ట్యాబ్లెట్స్ తీసుకోవడం అస్సలు మంచిది కాదు. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వలన అనారోగ్య సమస్యలు పెరుగుతాయి.

మజ్జిగ.. వేసవిలో మజ్జిగను ఎక్కువగా తీసుకుంటారు. అయితే మజ్జిగతోపాటు ట్యాబ్లెట్స్ అస్సలు తీసుకోవద్దు. మర్చిపోతే ట్యాబ్లెట్స్ శోషణ, విచ్ఛిన్న ప్రక్రియ మజ్జిగ ద్వారా ప్రభావితమవుతుంది. అందుకే ట్యాబ్లెట్స్ తీసుకునేటప్పుడు కేవలం నీటిని మాత్రమే తీసుకోవాలంటున్నారు నిపుణులు.

గమనిక:- ఈ కథనం కేవలం నిపుణుల అభిప్రాయాల సూచనలు.. అధ్యాయనాల ప్రకారం మాత్రమే ఇవ్వబడింది. దీనిని టీవీ9 తెలుగు దృవీకరించలేదు. అమలు చేయడానికి మందు వైద్యుల సలహాలు తీసుకోవాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Megastar Chiranjeevi: తెలుగు సినిమా ఇండియన్‌ సినిమా అని గర్వపడేలా చేశారు.. దర్శకధీరుడిపై మెగాస్టార్‌ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు..

Rajinikanth: ‘బీస్ట్’ డైరెక్టర్‌తో సూపర్ స్టార్ సినిమా.. రజినీకాంత్ మూవీలో ఆ యంగ్ హీరో కూడా

Prabhas: రాఖీభాయ్‌కు కంగ్రాట్స్‌ చెప్పిన యంగ్‌ రెబల్‌ స్టార్‌.. యష్‌ ఏం రిప్లై ఇచ్చాడో తెలుసా?

Gangavva: శభాష్ గంగవ్వ.. సొంతూరికి ఆర్టీసీ బస్సు తీసుకొచ్చిన యూట్యూబ్ స్టార్