Rajinikanth: ‘బీస్ట్’ డైరెక్టర్‌తో సూపర్ స్టార్ సినిమా.. రజినీకాంత్ మూవీలో ఆ యంగ్ హీరో కూడా

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా వచ్చి చాలా రోజులైంది. ఆయన చివరిగా నటించిన అన్నత్తే సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో రజిని నటించే సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Rajinikanth: 'బీస్ట్' డైరెక్టర్‌తో సూపర్ స్టార్ సినిమా.. రజినీకాంత్ మూవీలో ఆ యంగ్ హీరో కూడా
Superstar Rajinikanth
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 24, 2022 | 7:27 AM

సూపర్ స్టార్ రజనీకాంత్( Rajinikanth) సినిమా వచ్చి చాలా రోజులైంది. ఆయన చివరిగా నటించిన అన్నత్తే సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో రజినీ నటించే సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సూపర్ స్టార్ తన నెక్స్ట్ సినిమా నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. నెల్సన్ ఇటీవలే దళపతి విజయ్ తో బీస్ట్ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా అభిమానులు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దాంతో నెల్సన్ రజిని సినిమానుంచి తప్పుకున్నారన్న వార్తలు వినిపించాయి. అయితే ఈ సినిమా నిర్మిస్తున్న సన్ పిక్చర్స్ దీని పై క్లారిటీ ఇచ్చారు. సూపర్ స్టార్ నెక్స్ట్ సినిమా నెల్సన్ తోనే అని ప్రకటించారు. బీస్ట్ సినిమా రిజల్ట్ తో నిరాశలో ఉన్న నెల్సన్ సూపర్ స్టార్ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఉన్నారు. ఈ క్రమంలోనే రజినీకాంత్ సినిమా కోసం పవర్ ఫుల్ కథను సిద్ధం చేస్తున్నారట.

అయితే ఈ సినిమాలో మరో హీరో నటించే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. సూపర్ స్టార్ సినిమాలో సెకండ్ హీరో ఛాన్స్ ఉండటంతో ఆ అవకాశం యంగ్ హీరో శివకార్తికేయన్ కు దక్కిందని తెలుస్తుంది. గతంలో శివ కార్తికేయన్ , నెల్సన్ కాబినేషన్ లో వరుణ్ డాక్టర్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. దాంతో కార్తికేయన్ కు ఇప్పుడు రజినీకాంత్ సినిమాలో ఛాన్స్ దక్కిందని తెలుస్తుంది. ఇక మొదటి నుంచి సూపర్ స్టార్ ఫ్యాన్ కావడంతో శివ కార్తికేయన్ కూడా వెంటనే ఓకే చెప్పారని తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ కొడుతుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Megastar Chiranjeevi: తెలుగు సినిమా ఇండియన్‌ సినిమా అని గర్వపడేలా చేశారు.. దర్శకధీరుడిపై మెగాస్టార్‌ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు..

Rashmi Gautam: కవ్వించే సోయగాల కలువ కళ్ళ సుందరి.. రష్మి గౌతమ్ లేటెస్ట్ ఫోటోస్ వైరల్

Ram Charan: ‘అజాదీ కా అమృత్ మహోత్సవ్‌’లో సందడి చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!