Ram Charan : శంకర్ సినిమాలో తన పాత్ర గురించి క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ హీరోగా టాలీవుడ్ లో కంటిన్యూ అవుతున్నాడు. కథకు ప్రధాన్యత ఉన్న పాత్రాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు చరణ్.

Ram Charan : శంకర్ సినిమాలో తన పాత్ర గురించి క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్
Charan
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 24, 2022 | 7:02 AM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan).. చేసింది తక్కువ సినిమాలే అయినా తన నటనతో స్టార్ హీరోగా టాలీవుడ్ లో కంటిన్యూ అవుతున్నారు. కథకు ప్రధాన్యత ఉన్న పాత్రాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు చరణ్. ఇక ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో భారీ హిట్ అందుకున్నారు చరణ్. రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఈ పాన్ ఇండియా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పటికే 1100 కోట్లకు పైగా వసూల్ చేసి దూసుకుపోతోంది ఈ సినిమా. ఈ సినిమా తోపాటు మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో నటించారు చరణ్. ఈ సినిమాలో చిరు, చరణ్ ఇద్దరు నక్సలైట్స్ గా కనిపించనున్నారు. ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత చరణ్ నటిస్తున్న సినిమా RC 15 . టాప్ దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే..

ఈ సినిమా గురించి ఇప్పటికే చాలా వార్తలు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతోందని కొందరు అంటుంటే మరికొందరు ఈ సినిమా సోషల్ మెసేజ్ ఇచ్చే మూవీ అంటూ చెప్పుకొచ్చారు. అలాగే ఈ సినిమాలో చరణ్ ఐపీఎస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని కూడా టాక్ వినిపించింది. తాజాగా ఈ వార్తలకు క్లారిటీ ఇచ్చారు రామ్ చరణ్. పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో రామ్ చరణ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ధ్రువ సినిమాలో పోలీసు అధికారిగా నటించడం చాలా గర్వంగా ఉంది. శంకర్ గారితో చేస్తున్న  సినిమాకూడా అలానే ఉంటుంది. ఈ సమాజంలో మనల్ని ఇస్పైర్ చేసిన ఎందరో ఆఫీసర్స్ ఆధారంగా  నా సినిమా రూపొందుతోంది” అని అన్నారు. దాంతో చరణ్ శంకర్ సినిమా లై క్లారిటీ వచ్చింది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు పాత్రల్లో కనిపించనున్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే తండ్రి పాత్ర అని ఇప్పటికే లీకైన పిక్స్ తో క్లారిటీ వచ్చింది. రెండోది పవర్ ఫుల్ అధికారి పాత్ర. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Megastar Chiranjeevi: తెలుగు సినిమా ఇండియన్‌ సినిమా అని గర్వపడేలా చేశారు.. దర్శకధీరుడిపై మెగాస్టార్‌ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు..

Rashmi Gautam: కవ్వించే సోయగాల కలువ కళ్ళ సుందరి.. రష్మి గౌతమ్ లేటెస్ట్ ఫోటోస్ వైరల్

Ram Charan: ‘అజాదీ కా అమృత్ మహోత్సవ్‌’లో సందడి చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..