Megastar Chiranjeevi: తెలుగు సినిమా ఇండియన్ సినిమా అని గర్వపడేలా చేశారు.. దర్శకధీరుడిపై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు..
Acharya Pre Release Event: మెగాభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తోన్న ఆచార్య (Acharya) మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Acharya Pre Release Event: మెగాభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తోన్న ఆచార్య (Acharya) మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)తో తో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ (Ramcharan) కలిసి స్ర్కీన్ షేర్ చేసుకోవడం, డైరెక్టర్ గా ఇప్పటివరకు అపజయమెరుగని కొరటాల శివ దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. వీటిని నిజం చేస్తూ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్లు, ట్రైలర్లు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈనెల 29న ఈ మెగా మూవీ రిలీజ్ కానున్న నేపథ్యంలో శనివారం (ఏప్రిల్ 23) రాత్రి ప్రి రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో వేడుకగా నిర్వహించారు. దర్శక ధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన చిరంజీవి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘గతంలో ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమా అని మాత్రమే చూపించారు. చాలా బాధగా అనిపించింది. అయితే ఇప్పుడు తెలుగు సినిమా కూడా ఇండియన్ సినిమా అని గర్వపడేలా, రొమ్ము విరుకుని నిలబడేలా బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలు మన కీర్తిప్రతిష్ఠలను ప్రపంచవ్యాప్తంగా చాటాయి. అలాంటి సినిమాలను తెరకెక్కించిన రాజమౌళి ఇక్కడ ఉండడం మనందరికి గర్వకారణం. తెలుగు సినిమా ఆయనను ఎప్పుడూ గుర్తుంచుకుంటుంది. ఇండియన్ సినిమా ఒక మతం అయితే, ఆ మతానికి పీఠాధిపతి మన రాజమౌళి. ఆయన వేసిన బాట వల్ల ప్రతి సినిమా పాన్ ఇండియా మూవీ అవుతోంది. ఇక ఈ దర్శక ధీరుడితో సినిమాలు చేసిన హీరోలకు ఆ తర్వాతి సినిమా ఫ్లాప్ వస్తుందని చాలామంది అనుకుంటున్నారు. అది నిజం కాదు. అలాంటి ఊహలను ఆచార్య తుడిచిపెట్టేస్తుంది. చరణ్‌తో పాటు నాకు మంచి హిట్ ఇస్తుంది. ఏప్రిల్ 29న ఇది నిరూపితమవుతుంది’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు.
కాలేజీలోని ఆచార్యలకు దూరంగా ఉన్నా..
ఇక మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ మాట్లాడుతూ.. బొమ్మరిల్లు సినిమాలోని ఫాదర్‌లా రాజమౌళి తన నటుల చేయిని సినిమా పూర్తయ్యే దాకా వదలరు. అయితే నాన్నమీద గౌరవంతో, అమ్మ డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పడంతో ఆచార్య కోసం నాకు టైం ఇచ్చారు. ఆచార్య లోని సిద్ధ నా మనసుకు బాగా దగ్గరైన పాత్ర. నా లైఫ్‌లో డబ్బులు సంపాదించాలంటే చాలా మార్గాలున్నాయి. చాలా వ్యాపారాలు ఉన్నాయి. అయితే ఈ పేరు రావడానికి మాత్రం సినిమా ఇండస్ట్రీయే కారణం. కళాశాలలోని ఆచార్యలకు దూరంగా ఉన్నా.. మా ఇంట్లో ఉన్న ఆచార్య (చిరంజీవి)కి దగ్గరగా ఉన్నా. సినిమా సక్సెస్ అయినప్పుడు ఎలా ఉండాలి? ఫ్లాఫ్ అయితే ఎలా ఉండాలి? అనే విషయాలు నాన్న నుంచే నేర్చుకున్నా. ఆచార్య’షూట్‌లో ఇద్దరం కలిసి గడిపిన క్షణాలను నా జీవితంలో మర్చిపోలేను’ అని చరణ్ ఎమోషనల్ అయ్యాడు.
Also Read: RCB vs SRH: 68 పరుగులకే కుప్పకూలిన బెంగుళూరు.. సునాయసనంగా గెలిచిన హైదరాబాద్..
అకీరా చేసిన మంచి పనికి ఫిదా అవుతోన్న ఫ్యాన్స్ !! నెట్టింట్లో ఫోటో వైరల్
Rashmi Gautam: కవ్వించే సోయగాల కలువ కళ్ళ సుందరి.. రష్మి గౌతమ్ లేటెస్ట్ ఫోటోస్ వైరల్