Gangavva: శభాష్ గంగవ్వ.. సొంతూరికి ఆర్టీసీ బస్సు తీసుకొచ్చిన యూట్యూబ్ స్టార్
గంగవ్వ(Gangavva).. పరిచయం అక్కర్లేని పేరు. యాస, మాటతీరు, కామెడీ టైమింగ్ తో యూట్యూబ్(You tube) లో స్టార్ గా ఎదిగింది. అంతే కాదు.. ఫేమస్ రియాలిటీ షో బిగ్ బాస్ నాలుగో సీజన్ లో పాల్గంది. కొన్ని కారణాల వల్ల ఐదో వారానికే...
గంగవ్వ(Gangavva).. పరిచయం అక్కర్లేని పేరు. యాస, మాటతీరు, కామెడీ టైమింగ్ తో యూట్యూబ్(You tube) లో స్టార్ గా ఎదిగింది. అంతే కాదు.. ఫేమస్ రియాలిటీ షో బిగ్ బాస్ నాలుగో సీజన్ లో పాల్గంది. కొన్ని కారణాల వల్ల ఐదో వారానికే షో నుంచి బయటికి వచ్చేసింది. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఎనరేని క్రేజ్ సొంతం చేసుకుంది. ఇటీవల తన సొంతింటి కలను నిజం చేసుకున్న గంగవ్వ తాజాగా తన సొంతూరి ఇబ్బందులు తీర్చింది. తమ గ్రామానికి బస్సు సర్వీసును(RTC Bus) పునరుద్ధరించేలా చేసి గ్రామస్థుల మన్ననలు అందుకుంది. తెలంగాణలోని జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లి గ్రామంలో గంగవ్వ నివసిస్తోంది. కరోనా కారణంగా రెండేళ్లుగా లంబాడిపల్లి గ్రామానికి ఆర్టీసీ బస్సు రావట్లేదు. దీంతో గ్రామస్థులు, వ్యవసాయ దారులు, కూలీలు, విద్యార్థులు జగిత్యాల జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రైవేట్ వాహనాల్లో జగిత్యాలకు వెళ్లి రావాలంటే వాహన ఛార్జీలతో ఆర్థికంగా కుదేలవుతున్నారు. తమ సమస్యలకు పరిష్కారంగా బస్సు సర్వీసును తిరిగి ప్రారంభించాలని ప్రజా ప్రతినిధులను కోరారు.
దీని కోసం బిగ్‌బాస్ ఫేమ్, యూట్యూబ్ స్టార్ గంగవ్వ సహాయం కోరారు. లంబాడిపల్లికి తిరిగి బస్సు తీసుకురావాలన్న లక్ష్యంతో గ్రామస్థులతో కలిసి జగిత్యాల ఆర్టీసీ డిపో అధికారులను గంగవ్వ బృందం కలిసింది. గంగవ్వ వినతితో లంబాడిపల్లికి బస్సు సర్వీసును అధికారులు పునరుద్ధరించారు. ప్రస్తుతం ఈ గ్రామానికి జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి ఐదు ట్రిప్పలుగా ఆర్టీసీ సేవలు అందిస్తోంది. లంబాడిపల్లికి తిరిగి బస్సు రావడంతో గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read:
LSG vs MI Score: మెరుపు ఇన్నింగ్స్‌తో రాణించిన రాహుల్.. ముంబై టార్గెట్ 169 పరుగులు..