LSG vs MI Score: మెరుపు ఇన్నింగ్స్‌తో రాణించిన రాహుల్‌.. ముంబై టార్గెట్‌ 169 పరుగులు..

Lucknow Super Giants vs Mumbai Indians Score: ఐపీఎల్‌ 2022 (IPL 2022)లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. అయితే లక్నో కెప్టెన్‌...

LSG vs MI Score: మెరుపు ఇన్నింగ్స్‌తో రాణించిన రాహుల్‌.. ముంబై టార్గెట్‌ 169 పరుగులు..
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 24, 2022 | 9:44 PM

Lucknow Super Giants vs Mumbai Indians Score: ఐపీఎల్‌ 2022 (IPL 2022)లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. అయితే లక్నో కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ మరోసారి అద్భుత ఆటతీరును కనబరిచాడు. కేవలం 62 బంతుల్లోనే 103 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్టులో రాహుల్‌ తప్ప మిగతా ఎవరూ ఆశించిన స్థాయిలో రాణించలేదు. వచ్చిన బ్యాట్స్‌మెన్‌ వచ్చినట్లు పెవిలియన్‌ బాటపట్టారు.

రాహుల్‌ తర్వాత జట్టులో మానీష్‌ పాండే చేసిన 22 పరుగులు అత్యధికం కావడం గమనార్హం. మిగతా వారంత 15 పరుగుల మార్క్‌ను కూడా దాటలేకపోయారు. దీంతో రాహుల్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో రాణించిన ఆశించిన లక్ష్యాన్ని మాత్రం నిలపలేకపోయింది. ఇక ముంబై ఇండియన్స్‌ బౌలింగ్ విషయానికొస్తే.. రిలే మెరెడిత్ నాలుగు ఓవర్లు వేసి 40 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. కీరన్ పొలార్డ్ 2 ఓవర్లకు గాను 8 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. డేనియల్‌ సామ్స్‌, జస్ప్రీత్ బుమ్రా ఒక్కో వికెట్‌ కోల్పోయారు. మరి 169 పరుగుల లక్ష్యాన్ని ముంబై చేధిస్తుందా.? వరుస ఓటమిలకు చెక్‌ పెడుతుందా చూడాలి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: Corona: కరోనా మిగిల్చిన విషాదం.. అక్షర రూపంలో పొంగిన దుఖం.. గుండెల్ని పిండేస్తున్న ఐదో తరగతి విద్యార్థిని లేఖ

Viral Video: ప్లాట్ ఫాంపై దూసుకొచ్చిన రైలు.. భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు

రాయల్ ఎన్‌ఫీల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. త్వరలో భారత మార్కెట్‌లోకి 6 సరికొత్త మోడల్స్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?